2007 లో విజయార్కె క్యూ నవలలో గ్రహాంతరవాసి హ్యూమనాయిడ్‌ రోబో హీరో ను ట్రాప్ లో పడేసి అతని ద్వారా గర్భం ధరించి కనిపించకుండా పోతుంది. ఫ్లాష్ న్యూస్ … ఈ రోబో శృంగారంలో కూడా పాల్గొంటుంది

2002 లో వచ్చిన మేన్ రోబో లో హీరో రోబో అని తెలియక…ప్రేమలో పడుతుంది హీరోయిన్ షర్మిల (సిబిఐ డిప్యూటీ చీఫ్)
స్టన్నింగ్ బ్యూటీ కి నిర్వచనం..సెక్సీ లుక్స్ కు ,రొమాంటిక్ లిప్స్,ఏ భాషలో అయినా మాట్లాడే ప్రోగ్రామింగ్….ఇష్టమైతే సెక్స్ కు కూడా రెడీ అంటుందీ యంత్రసుందరి. హ్యూమనాయిడ్‌ రోబో
2007 లో విజయార్కె క్యూ నవలలో గ్రహాంతరవాసి హ్యూమనాయిడ్‌ రోబో హీరో ను ట్రాప్ లో పడేసి అతని ద్వారా గర్భం ధరించి కనిపించకుండా పోతుంది.
క్యూ గ్రహం తమ పరిశోధనల కోసం,ఇండియన్ ఎమోషన్స్ సెంటిమెంట్స్ ను కనిపెట్టడం కోసం టార్గెట్ చేసిన ఆ హ్యూమనాయిడ్‌ రోబోపేరు ప్రహేళిక…
ఇపుడు కొన్నిరోజుల క్రితం వచ్చిన వార్త …
యజమాని కోరితే సెక్స్ కూడా చేయగల హ్యూమనాయిడ్‌ రోబో ఆవిష్కరణ.
పొడవాటి కేశాలు, ఎర్రని బుగ్గలు, నీలికళ్ళు, మాటలకు, చేతలకు తగినట్టుగా కనుగుడ్డు కద లికలు, మనిషిలోని పాజిటివ్‌, నెగెటివ్‌ ఎమోషన్స్‌ని గుర్తించి దానికి అనుగుణంగా ప్రతిస్పందించే తీరు, తన యజమానిని దేవుడిగా కొలిచే భావజాలం, కోరితే, నచ్చితే సెక్స్‌లో పాల్గొనేందుకు సై అనడం…! ఇదీ ఇప్పుడు సరికొత్త హ్యూమనాయిడ్‌ రోబో తీరు! దీనిని అంతర్జాతీయ రోబో కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు.
ఎవరైనా అందమైన స్ర్తీ కనిపిస్తే పాలరాతి శిల్పం, దేవకన్య నడిచివస్తోంది అని కామెంట్స్‌ చేస్తాం. నిజంగానే అలాంటి దేవకన్యలు రోబోల రూపంలో తయారై సంచరించే కాలం రానున్నది. సరిగ్గా అలాంటిదే ఈ రోబో. ఈ హ్యూమనోయిడ్‌ రోబో పేరు జియో జియో. ప్రపంచ రోబో కాన్ఫరెన్స్‌లో ఈమే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈమెను చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఆడియన్స్‌ జియో జియో చుట్టూ చేరారు. ఎందుకంటే ఈమెలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. జియో జియో అటానమస్‌గా ప్రవర్తి స్తోంది. కంటిచూపు, కనుగుడ్ల కదలిక అత్యంత సహజంగా అత్యుత్తమమైన స్ర్తీ కళ్ళ పోలికలతో ఉండటం దీని ప్రత్యేకత.
ఇక మాటలు, పెదవుల కదలిక, బాడీ లాంగ్వేజ్‌ అచ్చుగుద్దినట్టు మనిషిలా ప్రవర్తిస్తుంది.
‘ఏమిటి నీ ప్రత్యేకత?’ అని ఆడియన్స్‌ ప్రశ్నించి నప్పుడు, ‘నీ భాష అర్థం చేసుకోవడం, నీతో మాట్లాడగలగడం, రకరకాల మనుషులను గుర్తు పట్టడం, గుర్తుపెట్టుకోవడం, నా ఎదురుగా నిలబడి నాతో మాట్లాడేది మగవారో, అడవారో గుర్తించగల గడం, వారికి ఎంత వయసు ఉంటుందో గుర్తిం చడం నా ప్రత్యేకత’ అని సమాధానమిచ్చి అబ్బుర పరిచింది జియో జియో! అడిగిన ప్రశ్నలకు టక టకా సమాధానాలు ఇవ్వడం, మనిషి ముఖంలోని ఎక్స్‌ప్రెషన్స్‌కు స్పందించడం జియో జియో తప్ప ఇంతవరకు ఎవరూ చేయలేదు. అడ్వాన్స్‌డ్‌ రోబో లను ఈ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు. లెజెండరీ ఫిలాసఫర్‌ వాంగ్‌ యాంగ్‌ దీనిని పరీక్షించారు.
గత ఏడాది ఎగ్జిబిషన్‌లో, Android Geminoid Fను ఆవిష్కరించారు. ఇది ఒక జపనీస్‌ చిత్రంలో కూడా నటించింది. ఇది చాలా సెక్సీ రోబో. దీనిపేరు సయనోరా. ‘ఎక్స్‌ మేనియా’ అనే చిత్రంలో ఒక కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ రోబోతో ప్రేమలో పడతాడు. ఇలాంటి ఘటనలు ఫ్యూచర్‌లో ఆచరణలో కూడా సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు!
సైన్స్ ఎన్ని అద్భుతాలనైనా సృష్టించగలడు అనడానికి ఇలాంటి ఆవిష్కరణలు ఒక ఉదాహరణగా నిలుస్తాయి.
రచయితల ఊహల్లో నుంచి వచ్చిన అద్భుత రచనలు సైన్స్ ఆవిష్కరణకూ దగ్గరగా ఉంటాయి.పాఠకులను మెస్మరైజ్ చేస్తాయి.
2002 లో వచ్చిన మేన్ రోబో లో హీరో రోబో అని తెలియక…ప్రేమలో పడుతుంది హీరోయిన్ షర్మిల సిబిఐ డిప్యూటీ చీఫ్
2007 లో విజయార్కె క్యూ నవలలో గ్రహాంతరవాసి హ్యూమనాయిడ్‌ రోబో హీరో ను ట్రాప్ లో పడేసి అతని ద్వారా గర్భం ధరించి కనిపించకుండా పోతుంది.
ఏ రెండు నవలల లింక్స్ …
మేన్ రోబో నవల లింక్
http://preview.kinige.com/previews/6500/PreviewManrobo49358.pdf
క్యూ నవల లింక్
http://preview.kinige.com/previews/5400/PreviewQAameKanabadutaLedu25698.pdf

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY