కరెక్ట్ గా చెప్పాలంటే నిన్ను ప్రమాదం అంచుకు పంపించడానికి వచ్చాను”అనిరుద్ర చెప్పాడు .వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (27-11-2016)

                                             (5 )
మండుటెండలో మలయమారుతం మనల్ని చుట్టేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది?
ఎడారిలో మేఘాలు మనతో కరచాలనం చేస్తే ఎంత బావుంటుంది?
చీకటిని చీల్చుకుని వచ్చే వెలుతురు కిరణాన్ని చూస్తే ఏమనిపిస్తుంది?
ఎర్విక్ చిన్నపిల్లలా పరుగుతీసింది అనిరుద్ర దగ్గరికి…
“మీరా?మీరు మీరేనా?వాటే గ్రేట్ సర్ప్రయిజ్…”అంది తన మనసులోని ఆనందాన్ని పెదవుల మీదికి ట్రాన్ఫర్ చేస్తూ…
“అవును నేను నేనే…”ఎర్విక్ చేతిలో వున్న బిడ్డ వంక చూస్తూ అన్నాడు.
“ఎర్విక్ …”సర్ ని కూచోమంటావా?అలాగే నిలబెట్టి మాట్లాడుతావా?”సమీర్ మాటలతో వర్తమానంలోకి వచ్చింది.
“ఓహ్ సారీ ..ప్లీజ్ రండి కూచోండి”అంది.
అనిరుద్ర ఎర్విక్ చేతిలో వున్న బిడ్డ వంక చూసి”జూనియర్ ఎర్వికా ?అని అడిగాడు.
“బిడ్డను అనిరుద్ర చేతిలో పెట్టి…తర్జని…నా చెల్లెలు తర్జని బిడ్డగా నా చేతుల్లోకి వచ్చింది.”చెప్పింది.
అనిరుద్ర ఒక్కక్షణం అలానే స్తబ్దుగా వుండిపోయాడు.ఇరవయ్యేళ్ళ తర్వాత చెల్లెలిని వెతుక్కుంటూ ఎర్విక్ ఇండియా రావడం అదేసమయంలో తర్జని హత్యకు గురికావడం.చెల్లెలు ఎలా ఉంటుందో చూడకుండానే చెల్లెలిని చంపినవారి మీద ఎర్విక్ డెత్ సెంటెన్స్ ప్రకటించి యుద్ధం చేయడం,ఆ కేసును పరిశోధన చేస్తోన్న తను సిబిఐ ఏజెంట్ గా ఎర్విక్ ను కలవడం…అన్నీ ఒక కలలా గుర్తుకు వచ్చాయి.
(ఎర్విక్ తర్జని ల గురించి,అనిరుద్రతో ఎర్విక్ పరిచయం,డెత్ సెంటెన్స్ నేపథ్యం తెలుసుకోవాలంటే డెత్ సెంటెన్స్ నవల చదవొచ్చు.డెత్ సెంటెన్స్ ఈ బుక్ లింక్..)
http://preview.kinige.com/previews/7100/PreviewDeathSentence74556.pdf
***
“సో తర్జని తిరిగి మీ మనస్సుల్లో నుంచి డైరెక్ట్ గా మీ ఇంట్లోనే అడుగుపెట్టిందన్న మాట..”అనిరుద్ర అన్నాడు.
“అవును సర్…చిన్నపుడు నా చెల్లెలు ఎలా ఉంటుందో తెలియదు..ఇప్పుడు ” చిన్నప్పుడు తర్జని ఎలా ఉంటుందో చూసే అవకాశం నా బిడ్డ ద్వారా వచ్చింది.తనను పెంచే అదృష్టం కలిగింది “
“గుడ్…”అన్నాడు .అప్పుడే వాళ్ళ బెడ్ రూమ్ లో నుంచి ఏడుపు వినిపించింది.
అనిరుద్ర కన్ఫ్యూజన్ తో చూసాడు.
సమీర్ నవ్వి చెప్పాడు…”లోపల బుల్లి అనిరుద్ర లేచాడు”
అనిరుద్రలో ఇంకా కన్ఫ్యూజనే…ఎర్విక్ పాపని సమీర్ చేతికి ఇచ్చి లోపలి వెళ్లి క్షణాల్లో బాబుతో వచ్చి ,ఆ బాబును అనిరుద్ర చేతిలో పెట్టి చెప్పింది.”ట్విన్స్…అని చెబుతూ,తర్జని,అనిరుద్రలు,నాకు రెండు కళ్ళు…దేవుడు ఇద్దరు అమ్మలనూ ఇద్దరు నాన్నలను ఇచ్చాడు,ఆ సంతోషాన్ని పంచుకునే సమయంలో వున్న ఒక్కగానొక్క చెల్లెలిని దూరం చేసాడు.ఆ తప్పును సరిదిద్దుకొని చెల్లెలితో పాటు…పేగుపంచుకుని పుట్టకపోయిన అంతకన్నా ప్రేమగా నాకు పునర్జన్మను ఇచ్చిన అన్నయ్యను కూడా బిడ్డగా ఇచ్చాడు.”కళ్లు తుడుచుకుంటూ చెప్పింది ఎర్విక్.
ఎమోషన్స్ ఇంత గొప్పగా ఉంటాయా?
ఎఫెక్షన్స్ ఇంకా ఈ ప్రపంచంలో బ్రతికే ఉన్నాయా?
తన చేతిలో వున్నబాబును ఎర్విక్ చేతిలో పెట్టాడు.
ఎర్విక్ ను సమీర్ ను ఇద్దరినీ దగ్గరికి తీసుకున్నాడు.
“నాకు చాలా సంతోషంగా వుంది.డ్యూటీ చేయడం అంటే బుల్లెట్స్ తో ఫ్రెండ్షిప్…నేరాలు ఘోరాలు పరిశోధన…నో ఎమోషన్స్ ,నో ఫీలింగ్స్ …ఓన్లీ క్రిమినల్స్ టార్గెట్…ఈ ప్రపంచంలో నుంచి కొత్త ప్రపంచంలోకి తీసుకు వచ్చారు.
నేను సిటీ లోకి రాగానే తర్జని క్యాబ్స్ కనిపించాయి…కాలేజీ అమ్మాయిలకు ,నైట్ షిఫ్ట్ చేసి అర్థరాత్రుళ్లు ఇంటికి వెళ్లే మహిళలకు నిరుద్యోగులైన మహిళలకు డ్రైవింగ్ నేర్పించి,దానితో పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్పించి డ్రైవర్స్ గా రిక్రూట్ చేసుకుంటుందని విన్నాను.క్షణాల్లో అందుబాటులో ఉంటూ అతితక్కువ రేటుకే గమ్యస్థానాలకు చేరుస్తుంది అని తెలుసుకున్నాను.నేను కూడా తర్జని క్యాబ్ లోనే వచ్చాను…
గ్రేట్ మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా గర్వంగా వుంది.ఇప్పుడు ఇలా మీ కుటుంబాన్ని చూస్తుంటే ఆనందంగా వుంది,చక్కటి కుటుంబం”సిన్సియర్ గా అన్నాడు అనిరుద్ర.
“ఈ ఆనందం మీరు పెట్టిన బిక్ష…ఈ జీవితం మీరు ఇచ్చినపునర్జన్మ “ఎర్విక్ అంది.ఈలోగా సమీర్ కిచెన్ లోకి వెళ్లి కాఫీ కలుపుకు వచ్చాడు.
***
కాఫీ తాగాక లేచాడు అనిరుద్ర.
“వెళ్తాను ఫ్రెండ్స్ ఒక చక్కటి కుటుంబాన్ని చూసానన్న ఆనందంతో వెళ్తున్నాను…ఢిల్లీ వస్తే మీరు తప్పక నన్ను కలవాలి “చెప్పాడు అనిరుద్ర.
బాబును పాపను పడుకోబెట్టి వచ్చారు సమీర్,ఎర్విక్.
ఓసారి ఇంటిని పరిశీలనగా చూసాడు.ఎక్కువగా పాపా బాబుల ఫోటోలు.సమీర్ ఎర్విక్ ల ఫోటోలు ఎక్కువలేవు.
ఎదురుగా గోడమీద తన ఫోటో..తన గురించి హిందూలో వచ్చినవార్త…అందులో నుంచి తన ఫోటోను స్కాన్ చేయించి ఎన్లార్జ్ చేయించి లైఫ్ సైజు ఫ్రేమ్ లో బంధించారు…గోడమీద మాత్రమే కాదు తమ మనసులోనూ…
అనిరుద్ర గుమ్మం వరకూ వెళ్ళాడు
“సర్ మీరు ఎందుకు వచ్చారో చెప్పకుండానే వెళ్తున్నారు?ఎర్విక్ అంది.
“మీరెలా వున్నారో చూడాలని వచ్చాను..ఎంత సంతోషంగా వున్నారో చూసాను..అంత కన్నా ఆనందంగా వెళ్తున్నాను..నాకు ఇంత కన్నా ఆనందం ఏం కావాలి?అనిరుద్ర అన్నాడు.
“మీరు గొప్ప సిబిఐ ఆఫీసర్ …ఒప్పుకుంటాను…కానీ మీకు అబద్దం చెప్పడం చేతకాదు.ఎందుకంటే మీలోని గొప్పమనసుకు అది సూటవదు…”నామీద ఒట్టేసి చెప్పండి అన్ని దగ్గరికి వచ్చి అతని చేతిని తీసుకుని తన తలమీద పెట్టుకుని చిన్నపిల్లలా అడిగింది నీళ్లు నిండిన కళ్ళతో ఎర్విక్.
చప్పున చేతిని వెనక్కి,తర్జనిని దగ్గరికి తీసుకుని అన్నాడు అనిరుద్ర “నిజం చెప్పాలంటే నీతో పని ఉండి వచ్చాను.నా స్వార్థానికి,డిపార్టుమెంట్ అవసరానికి నిన్ను ఆయుధంగా ఉపయోగించుకోవడానికి పర్మిషన్ తో పాటు నిన్ను తీసుకువెళదామని వచ్చాను..కరెక్ట్ గా చెప్పాలంటే నిన్ను ప్రమాదం అంచుకు పంపించడానికి వచ్చాను”అనిరుద్ర చెప్పాడు
(ఎర్విక్ ను మృత్యువు సరిహద్దుకు తీసుకువెళ్లే కారణం తెలుసుకోవాలంటే వచ్చేవారం వరకూ బీ అలెర్ట్ )
నార్త్ అవెన్యూ నేపథ్యం
డెత్ లాంప్ లోకి వెళ్లినవాళ్ళు తిరిగిరాలేదు.
అదొక పెద్ద భవనం …దానిపేరు బెడ్ లాంప్ …ఆ భవనంలోకి వెళ్లిన మొదటోరోజే ఆ ఇంట్లో ఒకవ్యక్తి అదృశ్యమయ్యాడు.వేసినతలుపులు వేసినట్టే వున్నాయి.తెల్లారి లేచి చూస్తే ఇంటియజమాని బావమరిది కనిపించలేదు.మూడవరోజు ఆ ఇంట్లో పనిచేసే తోటమాలి అదృశ్యమయ్యాడు.
వారం రోజుల వ్యవధిలో నలుగురు మిస్సింగ్.పోలీసులు కట్టుదిట్టమైన కాపలా పెట్టారు.ఇన్వెస్టిగేషన్ చేసారు.ఎలాంటి క్లూ దొరకలేదు.చిత్రంగా ఆ కేసు పరిశోధిస్తున్న ఆఫీసర్ మాయమయ్యాడు.చీకటి పడిందంటే ఆ ఇంటి తలుపులు ఎంత బద్దలు కొట్టినా తెరుచుకోవానే పుకారు బయల్దేరింది.ఈ విషయాన్నీ తేల్చుకుందామని బయల్దేరిన పరిశోధకుల వాహనం ప్రమాదానికి గురైంది.అందులో ఉన్నవాళ్ళంతా చచ్చిపోయారు.
కొన్ని కారణాలతో బెడ్ లాంప్ ను ప్రమాదకరమైన ప్రాంతంగా ప్రకటించారు.దానికి డెత్ లాంప్ అనే పేరు పెట్టారు.
ఆ బిల్డింగ్ ను కూలగొట్టే కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తి క్రేన్ కింద పది చచ్చిపోయాడు.దాని మిస్టరీ అలానే ఉండిపోయింది.

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY