“కిరణ్ నాకు భయంగా వుంది..వెనక్కి వెళ్లిపోదామా?మెల్లిగా అడిగింది గోమతి….వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (11-12-2016)

                                             (7)
ఒక్కసారిగా ఆ నిర్మానుష్యమైన ప్రాంతంలో మృత్యువు తిరుగుతున్నట్టు అనిపించింది గోమతికి..ఎందుకో వృద్ధుడు సెల్ఫీ తీసుకుందామా?అని అడగడం ఏదో అపశృతిలా అనిపించింది.
“రండి సెల్ఫీ తీసుకుందాం?ఆ తరువాత మనలో ఎవరుంటారో?ఎందరుంటారో?అతని మాటల్లో వాళ్లకు భయం కనిపించింది.వృద్ధుడు మధ్యలో నిలబడి సెల్ఫీ తీసుకున్నాడు.
“రండి చీకటి పడింది.”అంటూ జీపు స్టార్ట్ చేసాడు.
జీపు చీకటిని చీల్చుకుంటూ,భయాన్ని మోసుకుంటూ ముందుకు కదిలింది.అందరికన్నా ఎక్కువగా గోమతి భయపడుతుంది.కిరణ్ తన బ్యాగులో వున్న కెమెరా తీసి షూట్ చేస్తున్నాడు.చెట్లు నిర్మానుషయమైన దుమ్మురేపుతోన్న మట్టిరోడ్లు కెమెరాలో రికార్డు అవుతూనే వుంది.
“కిరణ్ నాకు భయంగా వుంది..వెనక్కి వెళ్లిపోదామా?మెల్లిగా అడిగింది గోమతి.
కిరణ్ గోమతి వైపు చూసి”ఇప్పుడా …ఇంత దూరం వచ్చేక ఎలా వెళ్తాము?అయినా నువ్వెందుకు భయపడుతున్నావ్?మేమంతా ఉన్నాంగా ?ధైర్యం చెప్పాడు కిరణ్.అప్పుడే సడన్ గా జీపు ఆగింది.కిరణ్ ముందుకు పడబోయాడు.అతని చేతిలోని హ్యాండీక్యామ్ జీపులో పడింది.గోమతి భయంగా వృద్ధుడి వైపు చూసింది.
ఆ వృద్ధుడు జీపు దిగి ముందుకు చూసాడు.కనుచూపు మేరలో చుట్టూ ఇనుపతీగలతో నిర్మించిన ఫెన్సింగ్.
“నార్త్ అవెన్యూ కు వచ్చేసాం…”చెప్పాడు వృద్ధుడు.
ఫెన్సింగ్ కనిపిస్తోంది.కిరణ్ తన బాగ్ లోని టార్చిలైట్ తీసాడు.అతి శక్తివంతమైన టార్చిలైట్…చాలా దూరాన్ని కూడా కవర్ చేస్తుంది.టార్చిలైట్ వెలుతురులో దూరంగా అస్పష్టంగా భీతిని కొలుపుతూ నార్త్ అవెన్యూ కనిపిస్తోంది.మృత్యువు కోరలు చచ్చినట్టు.
“జాగ్రత్త ఇక్కడి నంచి పదినిమిషాలు ముందుకు వేస్తె ఫెన్సింగ్ వేయిస్తుంది.ఇనుపగేటు కూడా తగులుతుంది.మీరు ధైర్యంచేసి లోపలి వెళ్లగలిగితే నార్త్ అవెన్యూ చేరుకుంటారు.మళ్ళీ చెబుతున్నాను…మీరు చాలా ప్రమాదకరమైన ప్రాంతానికి వచ్చారు.ఇప్పటికైనా మించిపోయింది లేదు.నాతోపాటు వెనక్కి వచ్చేయండి’వృద్ధుడు వాళ్ళ వైపు చూసి చెప్పాడు.
“వాట్ ఇంత దూరం వచ్చింది వెనక్కి వెళ్ళడానికే?నో వే…నార్త్ అవెన్యూ షూట్ చేసి ఇక్కడి రహస్యాన్ని చేధించే వెళ్తాము.” మరొకడు అన్నాడు.
‘మీ ఇష్టం నాకు త్వరగా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను.ఆలస్యమైతే ప్రమాదం ‘అన్నాడు.
కిరణ్ పర్సులో నుంచి డబ్బు తీసి ఇచ్చాడు”థాంక్స్ మమ్మల్ని ఇక్కడివరకూ తీసుకువచ్చినందుకు..సరిగ్గా రెండు రోజులో మమ్మల్ని కలుస్తాం ?చెప్పాడు కిరణ్.
ఆ వృద్ధుడు వాలవైపు అదోలా చూసి జీపు స్టార్ట్ చేసాడు.జీపు కనుమరుగయ్యేవరకూ చూసి ముందుకు కదిలారు.
***
“నాకు భయంగా వుంది’గోమతి మరోసారి అంది.
“గోమతీ నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టకు…మేమంతా ఉన్నాంగా’హరి అన్నాడు.
“లేదు హరి ఈ ప్రాంతాన్ని చూస్తుంటే భయంగా వుంది”గుబురుగా వున్న పొదలు…నిర్మానుష్యమైన ప్రాంతం…చీకటి…ఆమెలో భయాన్ని పెంచుతున్నాయి. టార్చ్ లైట్వెలుతురులో ముందుకు నడుస్తున్నారు.ఫెన్సింగ్ కనిపిస్తోంది.
సరిగ్గా అప్పుడే గోమతి వెనగ్గా ఎదో అలికిడి అయ్యింది.ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. పక్కనే వున్న పొదల్లో ఎదో అలికిడి.
“హరి అక్కడ ఆ పొదల్లో ..”భయంతో మాట రావడం లేదు గోమతి.
కిరణ్ టార్చిలైటును పొదల వైపుకు తిప్పాడు. .పొదల్లో ఏదో కదులుతుంది.వెంటనే హ్రీ అటువైపు కదిలాడు.అంతలోనే కిరణ్ వెనక ఏదో అలికిడి అయ్యింది.వెనక్కి తిరగబోయాడు కిరణ్ ..ముందు ఎవరో కదిలినట్టు అనిపించింది.ఎవరో బలంగా చేతిమీద కొట్టారు.చేతిలోని టార్చిలైట్ కిందపడింది..కిరణ్ నోట్లో నుంచి కేక అప్రయత్నంగా బయటకు వచ్చింది.
నేల మీద పడ్డ టార్చిలైట్ అటూ ఇటూ కదులుతుంది..ఆలా కదిలినపుడు వెల్తురు కూడా అటుఇటు కదుల్తుంది.టార్చిలైట్ వెలుతురూ పడ్డ ప్రాంతంలో నీడ పడింది.
కిరణ్ తేరుకునేలోగా వెనక నుంచి ఒక స్నేహితుడి అరుపు వినిపించింది.మరో స్నేహితుడి గొంతు…”పారిపోండి”అంటూ…
కిరణ్ ఆలోచించలేదు..ముందుకు పరుగెత్తాడు.వెనక హరి గొంతు వినిపిస్తోంది.భయంతో అరుస్తున్నాడు.
క్షణాల వ్యవధిలోనే ఒకదాని వెనుక ఒకటి జరిగిపోతూనే వున్నాయి.
గోమతి ఏంచేయాలో తోచలేదు.నేల మీద పడ్డ టార్చిలైట్ అటూ చీకటి.ఎవరు ఎక్కడున్నారో తెలియదు.కనిపించిన వైపు పరుగెత్తుతూనే కళ్ళకు ఏదో అడ్డుపడి కిందపడింది.
చేతికి మొబైల్ .తగిలింది..హరి మొబైల్ అది.చీకటిలోనే మొబైల్ ఆన్ చేసింది.అందులో వున్న టార్చి లైట్ ఆన్ చేసింది.ఆ వెలుతురులో ఇనుపతీగ ఫెన్సింగ్ దగ్గర ఎవరో పడివున్నట్టు అనిపించింది.వెంటనే అక్కడికి పరుగెత్తికెళ్లి అతడిని వెల్లికిలా తిప్పింది.
పెద్దకేక ఆమె నోట్లో నుంచి వచ్చింది.హరి చనిపోయి వున్నాడు.అతని తలమీద బలంగా రాయితో కొట్టినట్టు వుంది.
వెంటనే వెనక్కి పరుగెత్తింది ..అక్కడ కిరణ్ డెడ్ బాడీ వుంది.అప్పుడే మరో స్నేహితుడి చావుకేక..మరో ఆర్తనాదం.
ఆలా ఎంతదూరం పరుగెట్టిందో గుర్తులేదు..కానీ స్పృహలోకి వచ్చేసరికి తాను నార్త్ అవెన్యూ ఇనుపగేటు దగ్గర ఉన్నట్టు గమనించింది.వెనకే ఎవరో ఉన్నట్టు అనిపించి కూసింది.కళ్ళు మూటలు పడుతున్నాయి.అణా వెనుక ఎవరో వున్నారు..
స్పృహతప్ప పడిపోతుండగా వెనక్కి తిప్పి చూసింది…భయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి..
తననే చూస్తూ చేతిలో జాకీతో వృద్ధుడు.కళ్ళు మూతలు పడుతుండగా తలమీద బలమైన దెబ్బ పడింది.
ఎదురుగా కోరలుచాచినట్టు నార్త్ అవెన్యూ
                                                      ***
జరిగినదంతా గుర్తొచ్చింది.అంటే తనతో వచ్చిన వాళ్లంతా చచ్చిపోయారా?
తన స్నేహితులను చంపింది ఆ వృద్ధుడే…సందేహం లేదు.తాము మృత్యువు వెంటే వచ్చాం.తల్చుకుంటుంటే బాధగా భయంగా వుంది.అప్పుడే అతడిని చూసి అనుమానం కలిగింది.ఏడుపు తన్నుకొచ్చేస్తుంది.ఇలాంటి సాహసాలు ఎంత ప్రాప్తో ఇప్పుడు తెలిసివచ్చింది..కానీ అంతా అయిపోయాక బుద్ధి వస్తే ఏం లాభం.
గోమతి అమ్మానాన్నల గుర్తొచ్చారు.
తనతో వచ్చిన స్నేహితులు గుర్తొచ్చారు.దీనికంతకీ కారణం ఆ వృద్ధుడే.
చేతులు కట్టివేయబడి వున్నాయి.ఆమె కళ్ళు మెల్లిమెల్లిగా చీకటికి అలవాటు పడుతున్నాయి.అటుఇటు కదిలింది.అపుడు తెలిసింది.తన పక్కనే మరొకరుతినాలనే బంధించబడి వున్నారని.
అతి కష్టమ్మీద తలతిప్పి చూసి షాకయింది.
తన పక్కన కట్టివేయబడి వున్న వ్యక్తి..తమతో పాటు వచ్చిన వృద్ధుడు,
వచ్చే వచ్చేవారం వరకూ బీ అలర్ట్ …
తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY