దాదాపు వందరకాల క్యాన్సర్ల లో చాలా వాటిని ముందే గుర్తించి …మేన్ రోబో అవేర్ నెస్ క్యాన్సర్ ని జయించండి

మనకళ్ల ముందు నిలబడిమనం చనిపోతున్నామని చెప్పే క్యాన్సర్ ని తరిమి తరిమి కొడదాం.మనల్ని సమీపిస్తుందని తెలిసినప్పుడే మనం జాగ్రత్త పడుదాం.మొదటి నుంచి మేన్ రోబో క్యాన్సర్ అవేర్నెస్ ను ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తూనే వుంది.
మనకళ్ల ముందు క్యాన్సర్ బారిన పడ్డ ప్రముఖులు ఆత్మీయులు సన్నిహితులు మనల్ని విడిచి కనుమరుగవుతూ విషాదాన్ని మనకు మిగిల్చి వెళ్తున్నారు.
క్యాన్సర్ ని ఎదురించలేమా?క్యాన్సర్ ని గుర్తించలేమా?క్యాన్సర్ బారినుంచి బయటపడలేమా?

ముందే గుర్తిస్తే,కాసింత జాగ్రత్త వహిస్తే క్యాన్సర్ పట్ల అవగాహన కలిగిఉంటే క్యాన్సర్ ని జయించే అవకాశాలు ఉన్నాయన్నది నిపుణుల మాట.
దాదాపు వందరకాల క్యాన్సర్ల లో చాలా వాటిని ముందే గుర్తించి ,క్యాన్సర్ అనే మృత్యువును జయించే అవకాశాలు వున్నాయి.
వంటల గురించి తెలుసుకోవడానికి వంటల పుస్తకాలూ కొనుక్కుంటాం గేమ్స్,ఇంటర్నెట్,భాషలు నేర్చుకోవడం,కుట్లు అల్లికలు.ఇలా చాలావాటి గురించి తెలుసుకోవడానికి పుస్తకాలను ఆశ్రయిస్తాం.
కానీ మన జీవితాల మీద దాడిచేసి,మన ఆనందాలను దూరంచేసి,కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చే క్యాన్సర్ ను ముందే గుర్తించడానికి ,మరణశాసనం గురించి తెలుసుకుని ముందే జాగ్రత్తపడ్డానికి మనం కొద్దిపాటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తాం,భారీ మూల్యాన్ని చెల్లించుకునే దుస్థితిని ఆహ్వానించినవాళ్లమవుతాం.

రండి క్యాన్సర్ అవేర్నెస్ లో మీరూ భాగస్వాములు కండి.
క్యాన్సర్ ను జయించినవారి విజయగాథలను మాకు తెలియజేయండి.

మీ సూచనలు పంపించండి.క్యాన్సర్ కు సంబంధించిన వివరాలు విశేషాలు తెలియజేయండి.
మేన్ రోబో మీ కథనాలు ప్రచురిస్తుంది.

చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహనవంశీ ,ప్రముఖరచయిత విజయార్కె “క్యాన్సర్ ని జయించండి”పుస్తకంలోని కొంతభాగాన్ని ఫ్రీ డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కినిగె అందిస్తుంది.
ఈ పుస్తకం ఆన్సర్ పట్ల అవగాహన కలిగిస్తుందని.ఈ పుస్తకం ద్వారా క్యాన్సర్ ని ముందే గుర్తించి జాగ్రత్తపడి అవకాశం ఉందని,మీరు భావిస్తే ఈ విషయాన్నీ ఇతరులకు తెలియజేయండి.
manrobocreations@gmail.com
“క్యాన్సర్ ని జయించండి” పుస్తకంలోని కొంతభాగాన్ని ఫ్రీ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

http://preview.kinige.com/previews/3100/PreviewCancerniJayinchandi92539.pdf

NO COMMENTS

LEAVE A REPLY