ఎరక్కపోయి వచ్చాంరా దేవుడా అన్న డౌట్ మనసులో ఒక్కసారి మెదిలింది….స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటినేను (25-12-2016 )

Happy Christmas  

 (2)
డ్రామా కోసం ఉన్నవారిలో ఆడవారు కూడా ఉన్నారు. వారి ఇంట్రెస్ట్ చూసి చాలా ఆశ్చర్యపోయాను.
అందులో మా క్లాస్ నుండి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.
సర్ లేచి నిలుచున్నాడు. అందరూ తను ఏమి చెప్తాడో అని ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నాము.
“డ్రామా కోసం ఇంతమంది రావడం చాలా సంతోషం. ఇప్పుడు మీకు ఒక డైలాగ్ ఇస్తాను. ప్రతి ఒక్కరు వచ్చి ఈ డైలాగ్ ని చెప్పాలి”
అందరిలో స్టేజి ఫియర్ ఉంది. ఇక డైలాగ్ ఎలా చెప్తామో అన్న టెన్షన్.
డ్రామా పేరు – స్వర్గంలో ఇంటర్వ్యూ ... సోషియో ఫాంటసీ డ్రామా.
ఇంద్రుడు, మాతలి మొదలైనవారు ఉన్నారు. ఎవరు ఏ రోల్ కి సెలక్షన్ అవుతారో తెలియదు. డైలాగ్ మాత్రం అందరికీ కామన్.
స్టేజ్ లాంటి పొడవైన బల్లను పెట్టారు. ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్లి ఆ స్టేజ్ పైన నిలబడి డైలాగ్ చెప్పాలి.
ఒక్కొకరూ స్టేజ్ పైకి వెళ్తున్నారు. బాగా చెప్తున్నవారిని చూస్తుంటే మనం సెలెక్ట్ అవుతామా అన్న సందేహం. బాగా చెప్పలేని వారిని చూస్తే మన పరిస్థితి కూడా అలాంటిదే అన్న ఫీలింగ్
ఎరక్కపోయి వచ్చాంరా దేవుడా అన్న డౌట్ మనసులో ఒక్కసారి మెదిలింది. అటువంటి వాటిలో నేను మహా మొండి. ఈ పని కాదు అని ఎవరైనా అంటే దాన్నే సాదించాలన్న పట్టుదల…
ఏది జరిగితే అది జరుగుతుంది. వెనుక అడుగు వేసే ప్రసక్తి లేనేలేదనుకుంటూ అక్కడే కూర్చున్నా.
మనసుకు ఎంత ధైర్యం చెప్పుకున్నా ఏదో తెలియని భయం, ఆందోళన మనసును పట్టుకుని కుదిపేస్తోంది.
ఇంతలో నా పేరు పిలిచారు. ఒక్కసారి బీపీ హార్ట్ అటాక్ లాంటివి నన్ను చుట్టుముట్టినట్టు అనిపించాయి.
లేచి నిలబడ్డాను. అందరి కళ్ళూ నన్నే చూస్తున్నట్టు అనిపించిది. తమాయించుకుని నడిచాను
స్టేజ్ ఎక్కడం మొదటిసారి కాకపోయినా ఎందుకో చాలా టెన్షన్ గా అనిపించింది.
ఇచ్చిన డైలాగ్ ను ఒకటి రెండు సార్లు చూసుకున్నా..
“ఈ ప్రపంచం నాకేమిచ్చింది… ఇక నేను ఎందుకు జీవించాలి” ఇది డైలాగ్. కాస్త వెరైటీగా చెప్పాలనిపించింది
ఒక్కసారి ఎన్టీఆర్, ఏఎన్నార్ లను గుర్తుకు తెచ్చుకున్నా. ప్రేమ నగర్ లోని లాస్ట్ సీన్ గుర్తుకు వచ్చింది
నాకు ముందుగా ఇదే డైలాగ్ చెప్పిన స్టూడెంట్స్ సర్ ని చూస్తూ చెప్పారు. మరి కొంతమంది ఎదురుగా ఉన్న స్టూడెంట్స్ ని చూస్తూ చెప్పారు
నేను వెరైటీగా ఉంటుందని శూన్యంలో చూస్తూ ఎంతో బాధగా పేస్ పెట్టి ఈ డైలాగ్ చెప్పాను. మా ఫ్రండ్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానితో నా యాక్టింగ్ పై నాకు మొదటిసారి నమ్మకం కలిగింది.
స్టేజ్ దిగుతుంటే మా ఫ్రెండ్స్ నన్ను మెచ్చుకోలుగా చూశారు.
ఇక నా మనసు ఎక్కడో తేలిపోయింది.
మా ఫ్రండ్స్ మెచ్చుకున్నారంటే ఇక మన సెలక్షన్ పెద్ద కష్టం కాదు అనుకున్నా…
మొదటి రౌండ్ పూర్తి అయ్యింది.
రిజల్ట్స్ కోసం ఆత్రంగా వెయిటింగ్…
మా ఆత్రానికి బ్రేకులు వేస్తున్నట్టుగా స్కూల్ లాస్ట్ బెల్ కొట్టారు.
మగవాళ్ళ స్టేజ్ షో అయ్యింది. ఆడవాళ్ళు
“రేపు ఈవెనింగ్ కంటిన్యూ చేద్దాం”అని సర్ వెళ్ళిపోయారు.
మా ఆశలపై నీళ్ళు చిలకరించినట్టు అయ్యింది.
మరో రోజు వెయిట్ చెయ్యడం అంటే కష్టమే అయినా తప్పదు…
***
రెండో రోజు సాయంత్రం
అందరూ మిస్ అవ్వకుండా వచ్చారు.
అందరి పేస్ లో రిజల్ట్స్ ఎలా ఉంటుందో అని ఒక్కటే ఫీల్.
లేడీస్ స్టేజ్ షో స్టార్ట్ అయ్యింది. అమ్మాయిలంటే సిగ్గు పడతారని మా ఫీలింగ్.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY