మొదట స్టార్ట్ అయ్యేది నా పాత్రే… విషం తాగి చనిపోయే సీన్. ప్రతిరోజూ సాయంత్రం …స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటినేను (01-01-2017)

నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆ రోజు మార్నింగ్ క్లాస్ లేకపోవడంతో అందరినీ డ్రామా సెలెక్షన్స్ కోసం పిలిచారు.
రిజల్ట్స్ టైం కావడంతో అందరికి ఒక్కటే టెన్షన్.
సెలెక్ట్ అయిన ఒక్కొక్కరి పేరు చదువుతూ ఉంటే నాకు ఒకటే కంగారు.
ఎలా అయినా సెలెక్ట్ కావాలి… అదే నా ఎయిమ్. మరి దారి?
కాస్త కష్టమైనా ఒక దారి ఎంచుకున్నా… మా క్లాస్ అమ్మాయితో రెకమెండేషన్…
నా రిక్వెస్ట్ మన్నించి తను సెలెక్ట్ కాకపోయినా నా పేరు సజెస్ట్ చేసింది.
“సర్… సురేంద్ర బాగా యాక్ట్ చేస్తాడు. అతణ్ణి తీసుకోండి” అంటూ రికమెండ్ చేసింది
సర్ ఏ కళన ఉన్నాడో కాని నన్ను సెలెక్ట్ చేశాడు. తను సెలెక్ట్ కాకపోయినా పెద్ద మనసుతో హెల్ప్ చెయ్యడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదే ఆ అమ్మాయికి చెప్పాను.
“ఎడిశావులే… సెలెక్ట్ కావడంతో సరిపోదు. పెర్ఫార్మన్స్ ముఖ్యం… ముందు దానిపై కాన్సంట్రేట్ చెయ్యి” కాస్త విసురుగా అన్నా మంచి మాట అనడంతో ఆ విసురును నేను పట్టించుకోలేదు.
ఆ విసురు తను సెలెక్ట్ కాకపోవడం వల్ల వచ్చింది కాదు… నేను తనకు థాంక్స్ ఎక్కువ సార్లు చెప్పడంతో విసిగి కసురుకుంది.
మనం అవన్నీ పట్టించుకోం కదా…
***
డ్రామాలో నాది నిరుద్యోగి పాత్ర. ఒక నిరుద్యోగి చనిపోయి స్వర్గం వెళతాడు. అక్కడ జరిగే సరదా సంఘటనలే డ్రామా.
మొదట స్టార్ట్ అయ్యేది నా పాత్రే… విషం తాగి చనిపోయే సీన్.
ప్రతిరోజూ సాయంత్రం 4 నుండి డ్రామా రిహార్సల్స్…
డ్రామా రిహార్సల్స్ మొదటి రోజు…
స్వర్గం అంటే ఇంద్రుడు … అతని అసిస్టెంట్ మాతలి ఉన్నారు
ఇంద్రుడుగా మమ్మల్ని సెలెక్ట్ చేసిన సర్ వేస్తున్నాడు. మాతలిగా మా క్లాస్ మెట్ ప్రత్యక్షం అయ్యాడు.
అతణ్ణి నేను సెలక్షన్ అప్పుడు చూడలేదు… మరి ఎలా వచ్చాడు?
ఆలోచించగా నాకు అర్థం అయ్యింది ఏమిటంటే ఆ రోల్ కి అతణ్ణి ఆల్రెడీ సెలెక్ట్ చేశారు.
ఇలా కూడా జరుగుతుందా అన్న ఆలోచన నన్ను చాలా రోజుల వరకు స్థిమితంగా ఉండనీయలేదు.
అయినా అక్కడ మనం ప్రొటెస్ట్ చేసే అంత సీన్ లేదు. ఎక్కువ మాట్లాడితే ఉన్న రోల్ కూడా పీకేసి ఇంటికి పంపించేస్తారు.
అందుకే ఏ మాత్రం సౌండ్ లేకుండా నాకు ఇచ్చిన డైలాగ్ పేపర్స్ ని బట్టి పట్టడం స్టార్ట్ చేశాను.
మా డ్రామాలో పాత్రలు – సినిమా హీరో, రాజకీయనాయకుడు, బిజినెస్ పర్సన్… ఇలా పాత్రలు వచ్చిపోతూ ఉంటాయి.
***
డ్రామా రిహార్సల్స్ స్టార్ట్ అయ్యి వారం గడిచింది. స్కూల్ డే డ్రామా కావడంతో ప్రేస్తేజ్ లా చేస్తున్నారు.
రెగ్యులర్ క్లాసెస్ కూడా పెద్దగా జరగడంలేదు. దానితో మా కాన్సంట్రేషన్ అంతా డ్రామాపై నిలిపాం
ఇలా ఉండగా ఒక రోజు మా తెలుగు సర్ నుండి పిలుపు వచ్చింది. మనం తెలుగు సబ్జెక్టులో పులి.
మూడు సెక్షన్స్ లో మనల్ని మించి ఎవరూ లేరు. సబ్జెక్టుపై అంతగా గ్రిప్ ఉండేది. దానితో కాస్త అహంకారం కూడా తలకెక్కింది. ఎంత అహంకారం ఉన్నా టీచర్స్ అంటే మర్యాద మాత్రం ఎత్తి పరిస్థితిలో తగ్గేది కాదు.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY