డైలాగ్ డెలివరి.. డిక్షన్… డైలాగ్ స్పష్టంగా ఎలా చెప్పాలి?…స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటినేను (08-01-2017)

సంక్రాంతి శుభాకాంక్షలు
మా తెలుగు సర్...
నన్ను అమితంగా అభిమానించే టీచర్స్ లో ఒక్కరు. నేను తెలుగు సర్ ప్రియ శిష్యుణ్ణి అని మా క్లాస్ లో అన్ని సెక్షన్స్ కి తెలుసు.
ఆయన పిలిచిన కారణంగా వెళ్లి ఎదురుగా నిలబడ్డాను.
“స్కూల్ డ్రామాలో సెలెక్ట్ అయ్యావంట?” ఉపోద్గాతం లేకుండా సూటిగా అడిగారు.
నేను ఒక్కసారిగా గతుక్కుమన్నాను…
నేను స్కూల్ డే డ్రామా కి సెలెక్ట్ అయిన విషయం తనకు అప్పుడే ఎలా తెలిసిపోయిందా అని కంగారుపడ్డాను.
నా కంగారుకు కారణం మరొకటి ఉంది. నేను డ్రామాలో సెలెక్ట్ అయిన విషయం నేను తనకు చెప్పలేదని కోప్పడతారేమో…
“అవును సర్” నసుగుతూ అన్నాను
“మనం తెలుగు డ్రామా చేస్తున్నాం” నా మాటను పట్టించుకోకుండా అన్నారు.
ఒక్కసారిగా షాక్…
అనుకోకుండా వచ్చిన అవకాశం… ఏ మాత్రం సందేహించక ఒప్పేసుకున్నా…
రెండు డ్రామాలలో మొదటిసారే అంటే ఇక మన పరిస్థితి…”మేఘాలలో తేలిపోమ్మన్నది… తూఫానులా…” అన్న పాటలా అయ్యింది.
రాబోయే ప్రమాదం తెలియక అనాలోచితంగా ఒప్పుకున్నా… ఆలోచించినా కాదు అనే పరిస్థితి లేదు.
“డ్రామా ప్రాక్టిస్ అంటే నేను చెప్పినప్పుడు చెప్పిన చోటుకు రావాలి” ఆర్డర్ లా అనిపించింది…
“అలాగే సర్” తలాడించాను
డ్రామా కాన్సెప్ట్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. డ్రామా పేరు రైలు ప్రయాణం.
మైమ్ డ్రామా… నో డైలాగ్స్… ఓన్లీ యాక్షన్… కామెడీ
డైలాగ్ లేకుండా కేవలం యాక్షన్ తో కామెడీని పండించడం అంటే ఎంత కష్టమో ఆ డ్రామా చేసే సమయంలో తెలిసింది…
ఒక పల్లెటూరి వ్యక్తి కంగారుగా కదిలే రైల్ లో ఎక్కుతాడు. అక్కడే ఉన్న ఒక గ్రాడ్యుయేట్ పక్కన కూర్చుంటాడు. ఆ ప్రయాణంలో పల్లెటూరి వ్యక్తి గ్రాడ్యుయేట్ ని పడరాని కష్టాలు పెడతాడు.
ఇది కాన్సెప్ట్… డ్రామా అంటే కేవలం డైలాగ్స్ తో ఆదరగొట్టడం అనుకుంటున్న నా మందబుద్దికి ఇలాంటి కాన్సెప్ట్ కొత్తగా వింతగా అనిపించింది
***
స్కూల్ డ్రామాలో భాగంగా ఇచ్చిన డైలాగ్స్ అన్నీ బట్టీ కొట్టేసాం.
ఇక ఎవరి రోల్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పాలి. ఎక్సైటింగ్ గా ఉంది నాకు… కారణం… నేనే ముందు స్టార్ట్ చెయ్యాలి.
డ్రామాలో మొత్తం 15 వరకు యాక్టర్స్ ఉన్నారు.
డ్రామాలో మాకు మొదటి లెసన్
స్టేజి ఫియర్ ను ఎలా అధిగమించాలి?
డైలాగ్ చెప్పేటప్పుడు (అది ఎంత కామెడీ అయినా) నవ్వకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఆడియన్స్ అల్లరిని ఎలా ఇగ్నోర్ చెయ్యాలి?
నటించేటప్పుడు ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ మనపై పడకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలి.
డైలాగ్ డెలివరి.. డిక్షన్… డైలాగ్ స్పష్టంగా ఎలా చెప్పాలి?
ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి? డైలాగ్ లో ఆడియెన్స్ కు ఎలా రెస్పాండ్ కావాలి?
అన్న విషయాలు నెమ్మదిగా నేర్చుకున్నా….
(వచ్చే వారం – డ్రామా ప్రాక్టీస్ లో అనుకోని అతిధి…)

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY