ఆఫ్ కోర్స్ మీ సిబిఐ వాళ్ళ దగ్గర ఏ విషయాన్నైనా దాచడం కష్టమే…వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (15-01-2017)

సంక్రాంతి శుభాకాంక్షలు
 (12)
ఐసియులో అనిరుద్ర ఒక్కడే వున్నాడు.ఐసియులో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయన్న విషయం ఎవరికీ తెలిసే అవకాశం లేదు.డెబ్భైరెండేళ్ల పరమహంస ఐసీయూలోకి అడుగుపెట్టాడు.గుండ్రటిమొహం.తెల్లనిగడ్డం..కలర్ వేసుకోలేదు.కళ్లద్దాలు చాటున తీక్షణమైన చూపులు.
“హలో అయామ్ పరమహంస…డాక్టర్ పరమహంస.నన్ను కలవాలని అనుకుంటున్నారని ఇన్స్పెక్టర్ జేమ్స్ చెప్పారు.చెప్పండి మీకు నేను ఏ విధంగా సాయపడగలను?డెబ్భైరెండేళ్ల వయసులోనూ అతని గొంతులో గాంభీర్యం  తగ్గలేదు.అతని చూపులు పరిసరాలను పరీక్షిస్తున్నాయి.
“థాంక్యూ డాక్టర్…పిలవగానే వచ్చినందుకు..నేనే మిమ్మల్ని కలవాలి.కానీ చిన్న ఆక్సిడెంట్…”చెప్పాడు పరమహంస.
‘ఆక్సిడెంట్ ?చిన్న ఆక్సిడెంట్ కే ఐసియులో ఎందుకు ఉంచారు..?చూస్తే మీకు పెద్దగా గాయాలు కూడా అయినట్టులేవు…”అనుమానంగా అడిగాడు.
“మీరు చాలా స్మార్ట్ డాక్టర్.నిజమే …ఆక్సిడెంట్ వల్ల పెద్దగా గాయాలు తగల్లేదు…జస్ట్ మైనర్  ఆక్సిడెంట్…”చెప్పాడు పరమహంస వంకే చూస్తూ.
‘ఆక్సిడెంట్ ఎక్కడ జరిగింది..ఐ మీన్ ప్లేస్ ..?
“ఎయిర్ ఫోర్ట్ నుంచి వస్తుంటే?
“ఓహ్…సరే చెప్పండి..నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను?అడిగాడు పరమహంస.
“నాకు నార్త్ అవెన్యూ కు సంబంధిన కొన్ని డిటైల్స్ కావాలి…ఎందుకంటే మీరు అంతకు క్రితం ఓ సారి నార్త్ అవెన్యూ కి వెళ్లారని,అంతేకాదు అక్కడికి వెళ్లి ప్రాణాలతో తిరిగివచ్చారని తెలిసింది?పరమహంస వంక చూస్తూ అడిగాడు అనిరుద్ర.
“ఆఫ్ కోర్స్ మీ సిబిఐ వాళ్ళ దగ్గర ఏ విషయాన్నైనా దాచడం కష్టమే…నాకు శోధించడం అంటే పాషన్ ..నార్త్ అవెన్యూ గురించి ఎన్నో వార్తలు విన్నాను.దాని అంతు తేల్చుదామని  ట్రై చేసిన విషయం కూడా వాస్తవమే..అయితే నార్త్ అవెన్యూకి వెళ్ళక ముందే భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి.బ్లాక్ మేజిక్ ను నమ్మని నేను క్షుద్రశక్తులను నమ్మాల్సి వచ్చింది.ఒకరాత్రి అంతా నరకం అనుభవించాను.నా వయసుకు ఇలాంటి సాహసాలు వద్దనుకున్నాను.ఈ వయసులో పరుగెత్తలేను.ప్రాణాలతో పోరాడలేను.కంటికి కనిపించని శత్రువును ఎదుర్కోవడానికి నేను మీలా సిబిఐ ఆఫీసర్ ను కూడా కాదు..అందుకే ఆ ప్రయత్నం మానుకున్నాను”చెప్పాడు పరమహంస.
“ఈ విషయాన్నీ స్థానిక పోలిసుల దగ్గర చెప్పలేదు కదూ’సూటిగా అడిగాడు అనిరుద్ర
“ఎస్ చెప్పలేదు..చెప్పాలని అనిపించలేదు. విషయాన్నీ పోలీసులకు చెబితే మీడియాకు వెళ్తుంది.నార్త్ అవెన్యూ కు నేను మరింత పబ్లిసిటీ ఇచ్చి ప్రజలను భయపెట్టినట్టవుతుంది.మీక్కూడా చెప్పేవాడిని కాదు.కానీ నేను చెప్పేవిషయం మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెబుతున్నాను”
‘థాంక్యూ డాక్టర్..అయితే మీరు నార్త్ అవెన్యూకి అడుగుపెట్టలేదన్నమాట”
“అవును..నార్త్ అవెన్యూ గేట్ దగ్గరే సగం ప్రాణాలు పోయాయి.”
“డాక్టర్ మీరు మాకు ఓ చిన్నపేవర్   చేయగలరా?
“చెప్పండి..నాకు చేతనైతే చేస్తాను”అన్నాడు పరమహంస
“థాంక్యూ డాక్టర్..మరేమీలేదు..మీరు మాతోపాటు నార్త్ అవెన్యూ కు రావాలి .ఎందుకంటే సైన్స్ కు సంబంధించిన కోణాలు నార్త్ అవెన్యూ లో వున్నాయేమోనని చిన్న సందేహం”పరమహంస వంక చూస్తూ అన్నాడు అనిరుద్ర.
ఒక్కక్షణం అలోచించి వెంటనే”ఓకే మీరెపుడు వెళ్తారో చెప్పండి’అన్నాడు డాక్టర్ పరమహంస.
“ఎల్లుండే వెళ్దాం..అన్నట్టు మనతోపాటు ఇద్దరమ్మాయిలు కూడా వస్తారు”చెప్పాడు అనిరుద్ర.
“అమ్మాయిలా?అదీ ఇద్దరా?
‘అవును…ఒకమ్మాయి మీలాగే నార్త్ అవెన్యూ రహస్యాలు తెలుసుకుందామని వస్తుంది.మరో అమ్మాయి తన అన్నయ్య కనిపించడం లేదట…నార్త్ అవెన్యూ కు వెళ్తానని చెప్పాడట..వాళ్ల అన్నయ్యను వెతుక్కుంటుందిట..:
“ఓహ్ సరే మీరు వన్ అవర్  ముందు చెప్పినా చాలు రెడీ అవుతాను”అంటూ లేచాడు డాక్టర్ పరమహంస.
అతను వెళ్ళిపోయాక పక్కగదిలో నుంచి బయటకు వచ్చింది ఎర్విక్.అప్పటివరకూ ఐసియులో జరిగిన సంభాషణ దృశ్యాలు పక్కగదిలో వున్నకంప్యూటర్ లో చూసింది.ఐసియును అన్నివైపులా కవర్ చేసేలా కెమెరాలు అమర్చబడ్డాయి.
“ఎర్విక్ ఓసారి ప్లే చెయ్…”చెప్పాడు అనిరుద్ర.
ఎర్విక్ లాప్ టాప్ ఓపెన్ చేసింది.ఇందాక రికార్డు అయినా ఫుటేజ్ ప్లే చేసింది.నిముషాలు గడుస్తున్నాయి.ఫుటేజ్ అయిపొయింది.
“ఇదంతా ఎందుకు?అడిగింది ఎర్విక్.
“నాతో మాట్లాడేప్పుడు ఓసారి డాక్టర్ పరమహంస ఫీలింగ్స్ గమనించు…”వీడియో ను మరోసారి ప్లే చేసి చెప్పాడు అనిరుద్ర.
ఐసియులో అన్నివైపు కెమెరాలు ఉండడం వల్ల  అన్నివైపులా కవర్ అవుతుంది.అనిరుద్ర నార్త్ అవెన్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు పరమహంస ఎక్స్ ప్రెషన్స్లో తేడా వచ్చింది.మధ్యలో ఒకసారి ఎడమచేతిలో వున్న మొబైల్ వంక చూసుకున్నాడు.జూమ్ చేసి చూస్తే మొబైల్ ను సైలెంట్ లోకి పెడుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది.
‘అంటే నార్త్ అవెన్యూ మిస్టరీకి ,డాక్టర్ పరమహంస కు సంబంధం ఉందంటారా…?అడిగింది ఎర్విక్.
“ఇరవైనాలుగు గంటల్లో తెలిసిపోతుంది.మనం నార్త్ అవెన్యూ  వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి”చెప్పాడు అనిరుద్ర.
“మీ ప్రియమైనశత్రువు కూడా వస్తుంది కదా”నవ్వుతూ అడిగింది ఎర్విక్.
అప్పుడే అక్కడికి అడుగపెట్టిన స్వాప్నిక ఒక్కసారిగా ఆ మాటలతో ఉలిక్కిపడింది.
నార్త్ అవెన్యూ నేపథ్యం 
క్రూరత్వానికి పరాకాష్ట 
శాడిజం అనే పదం ఇంకా చిన్నదేమో…పత్రికల్లో వచ్చిన ఈ వార్త చూడండి.
ఆస్ట్రేలియాలోని వుడ్‌విల్లే వెస్ట్ ప్రాపర్టీకి చెందిన 43 ఏళ్ల మహిళకు ఓ క్రూరమైన ఆలోచన వచ్చింది. పిల్లుల్లో ద్వేషం పెంచి ఒక్కదాన్ని ఒకటి చంపుకు తినేలా చేయాలని వాటిని ఇంట్లో బంధించింది. 14 పిల్లులను ఓ గదిలో బంధించి వెళ్లిపోయింది. సెప్టెంబరులో పోలీసులు ఇంటికి చేరుకుని చూసేసరికి 13 పిల్లులు ఇంట్లో నిర్జీవంగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక్కటి మాత్రం షుష్కించిన స్థితిలో ఉందని రాయల్ సొసైటీ ఫద్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్(ఆర్ఎస్‌పీ‌సీఏ) పేర్కొంది.
ఈ కేసును విచారించిన పోర్ట్ అడిలైడ్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం మహిళను దోషిగా తేల్చింది. ఆమె జంతువులను పెంచుకోవడాన్ని నిషేధించింది. ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆమె సమర్పించిన 12 నెలల ‘గుడ్ బిహేవియర్’ బాండ్‌ను అంగీకరించింది. గతంలో జరిగిన వాయిదాలకు మహిళ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఇప్పటికే ఆమె రెండు వారాల జైలు శిక్ష అనుభవించింది. కాగా ఆమె ఇంటి నుంచి రక్షించిన ఒకే ఒక్క పిల్లి ‘ట్రూపర్’ ప్రస్తుతం కోలుకుంటున్నట్టు పోలీసు అధికారి ఆండ్రియా లూయిస్ తెలిపారు. 
వచ్చేవారం వరకూ…బీ అలర్ట్
మిమ్మల్ని అలరిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ కినిగే ద్వారా ఈ బుక్ గా మీ ముందుకు వచ్చింది.
ఈ నవల మీద మీ స్పందన తెలియజేయండి.
నార్త్ అవెన్యూ నవల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/book/North+Avenue

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY