ఒంటరిగా వున్నప్పుడు భయం రెట్టింపు అవుతుంది.ఆ ఒంటరితనానికి తోడు ప్రమాదంలో ఉంటే….వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (29-01-2017)

                                          (14)
ఒంటరిగా వున్నప్పుడు భయం రెట్టింపు అవుతుంది.ఆ ఒంటరితనానికి తోడు ప్రమాదంలో ఉంటే….గోమతికి ఒళ్ళంతా చెమట్లు పట్టింది.తన ముందు పడ్డ నీడ ఎవరిదో చూడ్డానికి కూడా భయపడుతోంది.మెల్లిమెల్లిగా కళ్ళు పైకెత్తి తలా వెనక్కి తిప్పింది.తనవెనుక వున్నది వృద్ధుడే.
“ష్ …మాట్లాడకు నిన్ను కూడా తప్పిస్తాను…బయట ఎవరివో అరుపులు వినిపిస్తున్నాయి.అంటే మనం నార్త్ అవెన్యూ పరిసర ప్రాంతంలోనే వున్నాం’మెల్లిగా లోగొంతుకతో అన్నాడు వృద్ధుడు.
“నాకు భయంగా వుంది”గోమతి అంది.
“నాకుమాత్రం భయం లేదా?భయపడితే బ్రతుకుతామా?పారిపోతే బ్రతుకుతాం”అంటూ మెల్లిగా కుర్చీ వెనక్కి వెళ్లి తాళ్లతో కట్టివేసి వున్న ఆమె కట్లను విప్పడానికి కిందికి వంగాడు.
అప్పుడే అతని తలా మీద గట్టిగా దెబ్బపడింది.రక్తం చివ్వున చిమ్మింది.అలాగే కిందికిపడిపోయాడు.
ఆ దృశ్యం చూసిన గోమతి స్పృహ తప్పింది.
***
డాక్టర్ పరమహంస ఇల్లు
విశాలమైన ఆ బిల్డింగ్ ముందు కట్టుదిట్టమైన కాపలా వుంది.ఆ బిల్డింగ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వుంది.ఆ బిల్డింగ్ కు నలువైపులా సిసి కెమెరాలు వున్నాయి.
హాల్ లో నుంచి కుడివైపుకు తిరిగాడు పరమహంస.లైఫ్ సైజు పెయింటింగ్ వుంది.అడవిని పెయింట్ చేసారు…అడవి జలపాతం…పరమహంస ఆ పెయింటింగ్ దగ్గరికి వచ్చాడు.జలపాతం మొదలయ్యే ప్రాంతంలో చిన్న బొడిపె లాంటిపరికరం వుంది.అది పరిశీలనగా చూస్తేతప్ప కనిపించేలా లేదు.ఆ పరికరాన్ని గట్టిగా ప్రెస్ చేసాడు.చిత్రంగా ఆ చిత్రపటం మెల్లిగా పక్కకు జరిగింది.
ఒక మనిషి వెళ్లే దారి..నేలమాళిగ .కిందికి మెట్లు వున్నాయి.మెట్లు దిగగానే పెద్ద హాల్ దర్శనమిచ్చింది.పరమహంస తనచేతిలో వున్న చిన్న రిమోటులోని ఒక బటన్ నొక్కాడు.ఆ హాల్ లో లైట్స్ వెలిగాయి.అది ఒక ల్యాబ్.అంతే కాదు అక్కడ పెద్ద కంప్యూటర్ వుంది.పరమహంస కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాడు.సిస్టం ఆన్ చేసాడు.స్క్రీన్ మీద ముందుగా మసకమసకగా కనిపించింది.ఆ తర్వాత పెద్ద మైక్ కనిపించింది.
అలర్ట్ అలర్ట్ అలర్ట్ మూడుసార్లు గట్టిగా అన్నాడు పరమహంస.మైక్ ముందు వున్న ఇనుపచువ్వలతో నిర్మించిన గేట్ తీర్చుకుంది.ట్రాన్స్ లో ఉన్నట్టు వున్న కొందరువ్యక్తులు ఒక్కొక్కరు ఆ మైక్ ముందుకు వస్తున్నారు.వారిని చూస్తే స్పృహలో ఉన్నట్టు లేరు.ట్రాన్స్ లో ఉన్నట్టు వున్నారు.చేతబడికి గురైనట్టు వున్నారు.వారి ముఖాలకు విచిత్రమైన మాస్క్స్ వున్నాయి.
బీ అలర్ట్ …
“మీరు నా వాయిస్ వింటున్నారు నా ఆజ్ఞ పాటిస్తున్నారు.ఐయామ్ యువర్ బాస్…”
పరమహంస వాళ్ళను హిప్నటైజ్ చేస్తున్నాడు.వాళ్ళు అతను చెప్పే ప్రతీ మాట వింటున్నారు.చాలా రోజులుగా వాళ్ళు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు.అలవాటు చేయబడ్డారు.అతిప్రమాదకరమైన స్టెరాయిడ్స్ వాళ్ళ శరీరాల్లోకి ఇంజెక్ట్ చేయబడుతున్నాయి.
వాళ్ళ శరీరాల్లోకి ప్రమాదకరమైన శక్తి వచ్చి చేరుతుంది..కానీ అది అతిప్రమాదకరమైన స్థాయిలో వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుందని వారికీ తెలియదు.
ఫ్రస్ట్రేటెడ్ యూత్ పరమహంసటార్గెట్ .అంతేకాదు డబ్బు మీద వ్యామోహం వున్నవారిని ట్రాప్ చేస్తాడు.తన మేథస్సును తన స్వార్థానికి వాడుకుంటాడు.వాళ్ళను ఆయుధాలుగా మారుస్తున్నాడు..ప్రమాదకరమైన ఆయుధాలుగా మారుస్తున్నాడు.
పరమహంస వాళ్ళవైపు చూసి తీక్షణమైన స్వరంతో చెబుతున్నాడు..
“సరిగ్గా అర్థరాత్రి తర్వాత నార్త్ అవెన్యూ వైపు వచ్చే ముగ్గురువ్యక్తులను ఫినిష్ చేయాలి.వాళ్ల దగ్గర ట్రాకింగ్ డివైజెస్ ఉంటాయి.వాళ్లలో ఇద్దరు వ్యక్తులు అతిప్రమాదకరమైన వాళ్ళు.మీరంతా నాలుగువైపులా నుంచి వారిని చుట్టుముట్టాలి…”చెబుతున్నాడు పరమహంస.వాళ్లంతా ఆ మాటలను తమ మెమోరీలో ఫీడ్ చేసుకుంటున్నారు.వాళ్ళు ఆ గొంతుకు ఎడిక్ట్ అయ్యారు..కనెక్ట్ అయ్యారు.ఆ గొంతు చెప్పింది వాళ్ళు చేస్తారు.ట్రాకింగ్ డివైజ్ వున్నవారిని చంపడమే వాళ్ల టార్గెట్
వాళ్లకు ఆహారం బదులు స్టెరాయిడ్స్ ఇస్తారు.ఒక విధంగా వాళ్ళు కూలీలు.ప్రాణాలు తీసే కూలీలు..
చాలా మందికి తెలియని రహస్యం ఒకటుంది.డాక్టర్ పరమహంస పూర్వీకులు నార్త్ అవెన్యూ కు వారసులు.బ్రిటిష్ వాళ్ళ నుంచి పరమహంస పూర్వీకులకు లభించిన నార్త్ అవెన్యూ లో చాలా దశాబ్దాల క్రితం ఆస్తికోసం హత్యలు జరిగాయి.ఆ హత్యలను కప్పిపుచ్చడానికి నార్త్ అవెన్యూ లో ఆత్మలున్నాయన్న పుకారు బయల్దేరింది..ఆ తర్వాత చిత్రంగా నార్త్ అవెన్యూ ను కొనుకున్నవాళ్ళు చనిపోవడం,అదృశ్యం అవ్వడం మొదలైంది.నార్త్ అవెన్యూకు అసలైన వారసులు పరమహంస పూర్వీకులు…అయితే వాళ్ళ దాయాదులు దౌఊర్జన్యంగా నార్త్ అవెన్యూ ని ఆక్రమించుకున్నారు.ఆ పరిణామంతో పరమహంస పూర్వీకులు ఓ మంత్రగాడిని ఆశ్రయించి తమ దాయాదులు చంపించారన్న వదంతి వుంది.ఆ దాయాదుల పిల్లలు పరమహంస పూర్వీకుల మీద ఎదురుదాడి చేసారు.ఆ తర్వాత దాయాదులు అంతా చనిపోయారు.కొందరు విదేశాలకు పారిపోయారు.
ఈ నేపథ్యంలో పరమహంస విదేశాల్లో తన చదువును పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చి నార్త్ అవెన్యూ ని స్వాధీనం చేసుకోకుండా,అనధికారికంగా నార్త్ అవెన్యూ ని తన పరిశోధనల కోసం వాడుకుంటున్నాడు.
నార్త్ అవెన్యూ మీద వున్న ప్రచారాలకు ప్రాణం పోస్తూ,నార్త్ అవెన్యూ లోకి ఎవరూ ప్రవేశించకుండా పథకం వేసాడు.నిరుద్యోగులను,ఫ్రస్ట్రేటెడ్ యూత్ ని టార్గెట్ చేసి వారికీ డ్రగ్స్ అలవాటు చేసి స్టెరాయిడ్స్ తో వాళ్లలో కృతిమ ఎనర్జీని క్రియేట్ చేసి,తన నీచమైన తెలివితేటలతో వాళ్ళను హిప్నటైజ్ చేసి దారుణాలు చేయిస్తున్నాడు…
ఇది తెలిసిన ఒకేఒక వ్యక్తి…ప్రాణాలతో పోరాడుతున్నాడు.
వచ్చేవారం వరకూ…బీ అలర్ట్
మిమ్మల్ని అలరిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ కినిగే ద్వారా ఈ బుక్ గా మీ ముందుకు వచ్చింది.
ఈ నవల మీద మీ స్పందన తెలియజేయండి.
నార్త్ అవెన్యూ నవల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/book/North+Avenue

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

 

 

 

NO COMMENTS

LEAVE A REPLY