ఎదురుగా చైర్ లో కూర్చున్న వ్యక్తిని చూడగానే ఒక్కసారి అద్దిరిపడ్డాను …స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటినేను (29-01-2017)

(గత సంచిక తరువాయి)
అంతమందిని చూడడం కొత్తగా ఉన్నా ఏదో నేర్చుకోవచ్చు అన్న ఇంట్రెస్ట్ వచ్చింది.
మా తెలుగు సర్ హాస్టల్ లో రెండవ అంతస్తులో ఒక రూమ్ లోకి తీసుకెళ్ళాడు. అక్కడకు ఎందుకు వచ్చామో తెలియకపోయినా సర్ తీసుకురావడంతో మాట్లాడకుండా ఆయన వెనుకనే రూమ్ వెళ్లాను.
బ్యాచిలర్ రూమ్… రూమ్ కి ఇద్దరు ఉన్నట్టు ఉన్నారు. సర్ ఫ్రండ్ అక్కడే ఉన్నాడు.
ఆయన మాటల్లో నాకు అర్థం అయ్యింది ఏమంటే మేము వేసే డ్రామాను ఇదివరకే యూనివర్సిటీలో వేయడం జరిగిందని, దాన్ని మా సర్ స్కూల్ లో వేయడానికి దాన్ని అలానే తీసుకున్నారని…

సర్ ఫ్రండ్ కూడా అందులో ఒక రోల్ వేయడం జరిగింది.
మా స్టోరి అంతా విన్న తరువాత అతను ఏం చెప్తాడో విందామని నేను రెడీ అయ్యాను.
“నేను చేసిన రోల్ మీకు యాక్ట్ చేసి చూపుతాను. ఏదైనా మీకు ఉపయోగపడుతుందో చూడండి” అంటూ సర్ ఫ్రండ్ తన రోల్ చేసి చూపించాడు.
అతని యాక్టింగ్ లో నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను.
అంతవరకు మెకానికల్ గా చేస్తూ వచ్చిన నేను ఒక్కో సీన్ నెమ్మదిగా ఎలా చేయాలో, ఒక్కో సీన్ లో ఎక్స్ ప్రెషన్ ఎలా ఉండాలో అర్థం అయ్యింది. టైంని పెంచుతూ ఒక్కో సీన్ ఎలా రక్తి కట్టించాలో, ప్రేక్షకుల రియాక్షన్ కి డ్రామా ఎక్కడ ఎలా విరామం ఇవ్వాలో తెలిసింది.
ఆయనకు థాంక్స్ చెప్పి బయటపడ్డాం. డ్రామా బాగా రావాలని మా సర్ పడే తపన చూస్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ కలగసాగింది. ఆయన కమిట్ మెంట్ ఎలా ఉందోకానీ లైఫ్ లో కమిట్ మెంట్ ఎలా ఉండాలో అన్న లెసన్ నేర్చుకున్నా.
స్కూల్ డే ఫైనలైజ్ చేశాక డ్రామా రిహార్సల్స్ వేగం అందుకున్నాయి.
రెండు ద్రామాలతో నా టైం బాగా సాగుతోంది. రెండు డ్రామాలు ఒకేసారి చేస్తున్నా ఎక్కడ కన్ఫ్యూజ్
కాకుండా చెయ్యడం మా ఫ్రండ్స్ తో పాటు నాకు కూడా ఆశ్చర్యం కలుగుతోంది. పైగా నా టాలెంట్ మీద నాకే నమ్మకం కలగసాగింది.
***
ఇలా ఉండగా ఒక రోజు…
మా జూనియర్ బ్యాచ్ స్టూడెంట్స్ నా వద్దకు వచ్చారు.
“అన్నా… మేము కూడా స్కూల్ డేకి ఒక డ్రామా ప్లాన్ చేస్తున్నాం” అన్నారు
స్కూల్ డ్రామా సెలెక్షన్స్ ఆల్రెడీ అయ్యాయి కదా మరి వీళ్ళు కొత్తగా డ్రామా అంటూ వచ్చారు… ఇదెలా సాధ్యం?
అర్థం కాకుండా వాళ్ళ పేస్ చూస్తుంటే…
“అన్నా… మా బ్యాచ్ లైబ్రరీలో ఉంది ఒక్కసారి వస్తావా?” అని అడిగారు.
తెలిసిన పిల్లలు పైగా అన్నా అంటూ వస్తే కాదనడం ఎలా అనుకుంటూ వారి వెంట లైబ్రరీకి నడిచాను.
నా అనుమానం మాత్రం తీరలేదు… డ్రామా సెలెక్షన్స్ లో వీళ్ళను చూసిన జ్ఞాపకం కూడా లేదు. అయినా డ్రామా ఎలా చేస్తారు?
పర్మిషన్ ఎవరు ఇచ్చారు?
అనుమానాలన్నీ మనసులో మెదిలినా బయటకు కనిపించనీక వారి వెనుక నడిచాను.
అందరం లైబ్రరీలో అడుగుపెట్టాం.
అది పేరుకే లైబ్రరీ కానీ అక్కడ బుక్స్ అంటూ పెద్దగా ఉండవు.
లైబ్రరీలోకి ఎంటర్ అవ్వగానే నాకు ముందు కనపడ్డది… కూల్ డ్రింక్స్ ఉన్న ట్రే…
ఎదురుగా చైర్ లో కూర్చున్న వ్యక్తిని చూడగానే ఒక్కసారి అద్దిరిపడ్డాను

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY