వీడికి డ్రామాకి ఏమి సంబంధమో ఏ మాత్రం అర్థం కాలేదు. .స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటి నేను (05-02-2017)

“చినబాబు”
చినబాబుగా పిలవబడే మా స్కూల్ ఓనర్ రెండవ కుమారుడు. నాకన్నా 1 ఇయర్ జూనియర్. ఇతని అన్న నాకన్నా 1 ఇయర్ సీనియర్. ఇద్దరూ మా స్కూల్ లోనే చదువుతున్నారు.
వీడికి డ్రామాకి ఏమి సంబంధమో ఏ మాత్రం అర్థం కాలేదు.
“కూల్ డ్రింక్ తీసుకోండి” మర్యాద మాటల్లో కనపడడంతో కాస్త సంతోషం వేసింది.
రాబోయే ప్రమాదం తెలియక సంతోషంగా కూల్ డ్రింక్ అందుకున్నా.
“మేము ఒక డ్రామా చెయ్యాలి అనుకుంటున్నాం.. మీరు ఆ డ్రామాని డైరెక్ట్ చెయ్యాలి” ఆ మాట వినపడడంతో ఒక్కసారిగా పొలమారింది నాకు. తాగుతున్న కూల్ డ్రింక్ వేడిగా చేదుగా అనిపించింది
“నేను డైరెక్ట్ చెయ్యాలా?” నేను విన్నది నిజమో కాదో అనుకుంటూ అడిగాను.
“అవును. మీరు రెండు డ్రామాలలో ఉన్నారట కదా… మీకు ఎంత టాలెంట్ లేకపోతే ఫస్ట్ టైం డ్రామా చేస్తూ ఒకేసారి రెండింటిలో యాక్ట్ చేస్తారు?”
కధ రూట్ మారుతోంది అనిపించింది. నేను పెద్ద యాక్టర్ అని అందరూ అనుకుంటున్నారు. అది ఒకందుకు మంచిదే. మన పేరు స్కూల్ లో మారుమోగుతోంది. ఇంకా డ్రామా స్టేజి పైకి రాకుండానే నేను పాపులర్ అవుతున్నా… సంతోషంతో ఛాతీ రెండు ఇంచిలు పెరిగింది.
“నేను డైరెక్షన్ చేయడం ఏమిటి? ఇప్పుడే యాక్టింగ్ నేర్చుకుంటున్నా” చేయాలని ఉన్నా రోటిలో తల దూర్చడం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు అనుకుంటూ అన్నాను.
“మీరు చేయగలరు” నాపై నాకన్నా చినబాబుకే నమ్మకం ఎక్కువలా అనిపించింది.
“నేను ఆల్రెడీ రెండు డ్రామాలలో నటిస్తున్నా. డ్రామా రిహార్సల్స్ కే టైం కుదరడం లేదు. ఆపై మీ డ్రామా అంటే నాకు క్లాస్ లో పర్మిషన్ దొరుకుతుందో లేదో” నసుగుతూ అన్నా.
“మీకు ఓకే అంటే పర్మిషన్ సంగతి నేను చూసుకుంటా” నన్ను కాదని పర్మిషన్ ఎవడు ఎందుకు ఇవ్వడో చూస్తాను అన్నట్టు వినిపించింది చినబాబు వాయిస్.
నా చుట్టూ ఉన్న జూనియర్స్ వైపు చూశాను. అందరిలోనూ ఉత్సాహం తొంగిచూస్తోంది.
“సరే… మీకు నాపై నమ్మకం ఉంటే నాకు ఏమి ప్రాబ్లం లేదు” అంటూ ముగించాను
అందరి మొహాలలో సంతోషం…
“ఇంతకూ డ్రామా ఏమిటో సెలెక్ట్ చేసుకున్నారా?” అడిగాను
“అదే ఏమీ అనుకోలేదు. మీరే మంచి డ్రామా ఒకటి సెలెక్ట్ చెయ్యండి” నా నెత్తిన బాంబు పేలుస్తూ అన్నాడు చినబాబు.
“నేనా! సరే ట్రై చేస్తా” ఎలా ప్రొసీడ్ కావాలో తెలియకపోయినా తల ఊపేశాను.
గొప్పలకు పోయి మాట ఇచ్చేశానే తప్ప, డ్రామాకు కావలసిన సమాచారం, సరుకు మన వద్ద లేదు.
ఎక్కడ చూడాలో, ఎక్కడ వెదకాలో కూడా అర్థం కాలేదు…
ఆలోచనలతో బుర్ర వేడి ఎక్కుతుండగా లైబ్రరీ నుండి బయటకు వచ్చాను
“మండే నుండి స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. కాస్త తొందరగా ఫైనలిజ్ చెయ్యండి” వెనుక నుండి చినబాబు మాట ఒక హెచ్చరికలా అనిపించింది.
ఆ రోజు ఫ్రైడే… ఎక్కడని వెదకాలి. ఎవరిని అడగాలి.
పోనీ మా సర్ అడుగుదామంటే “అప్పుడే డైరెక్షన్ చేసేంత పెద్దవాడివి అయ్యావా” అంటూ దెప్పుతారు
ఈ ఐడియా పెద్దగా వర్క్ అవుట్ కాదు…
ఆలోచిస్తుండగా ఒక మంచి ఐడియా దొరికింది… మంచి బుక్స్ దొరికేది లైబ్రరీలో…
మా స్కూల్ లైబ్రరీ అసలు పనికిరాదు. అందులో న్యూస్ పేపర్స్ తప్ప మరేమీ ఉండవు.
ఇక ఒకటే మార్గం. ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరి.
వందల పుస్తకాలు ఉంటాయి. అందులో మనకు కావలసిన మేటర్ దొరక్కపోదు అనుకుంటూ ఆదివారం పొద్దున్నే లైబ్రరీ వెళ్లాలని డిసైడ్ అయ్యాను
***
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY