ఎండుటాకుల మీద ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది.ఎదో పాకుతూ వస్తుంది.తలతిప్పి చూసాడు.మూడు అడుగుల పొడవున్నపాము …వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (12-02-2017)

 (16)
ప్రమాదం కళ్ళెదురుగా కనిపించినప్పుడు భయాన్ని కనుమరుగయ్యేలా చేయాలి.అప్పుడే ఆలోచన భయాన్ని ఎదురించే శక్తినిస్తుంది.
ఎప్పుడైతే ముసుగువ్యక్తులు గుంపులుగా కనిపించారో… అప్పుడే అనిరుద్ర తన జేబులో వున్న చిన్న పరికరాన్ని బయటకు తీసాడు.ఆ పరికరానికి వున్న చిన్న బొడిపెను నొక్కి గాలిలోకి విసిరేసాడు.క్షణాల్లో అక్కడ స్మోక్ రీలీజ్ అయ్యింది. శక్తివంతమైన పొగ..దాన్ని పీల్చిన క్షణాల్లోనే దాని ప్రభావం చూపిస్తుంది.
స్వాప్నిక ఎర్విక్ లకు మాస్క్ లు తగిలించాడు.కమాన్ రన్…అంటూ ఎడమవైపుకు పరుగు తీసాడు.ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరిగింది.ఇలాంటి సంఘటనలను ముందే ఊహించి అనిరుద్ర వారికి శిక్షణ ఇచ్చాడు.
ఒక్కసారిగా గుంపుగా వచ్చిన ముసుగువ్యక్తులు అక్కడ అలుముకున్న పొగను పీల్చి ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు.పైగా వాళ్ళు ట్రాన్స్ లో వున్నారు..మెల్లిమెల్లిగా స్పృహ తప్పుతున్నారు.
అనిరుద్ర ఎర్విక్ స్వాప్నిక లు కొద్దీ దూరం పరుగెత్తారు.అనిరుద్ర స్పీడ్ ను అందుకోలేకపోయారు.ఎర్విక్ స్వాప్నికలు…అందులో ఎర్విక్ మరికొంత స్పీడ్ గా పరుగెట్టేదే..కానీ స్వాప్నిక కోసం మెల్లిగా పరుగెత్తింది..ఆ విషయాన్నీ నోటీస్ చేసింది స్వాప్నిక..
“మీరు పరుగెత్తండి..ఒకవేళ రిస్క్ వున్నా తీవ్రత తగ్గుతుంది,”ఆయాసంతో రొప్పుతూ అంది స్వాప్నిక.
“ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఇక్కడికి వచ్చాం..అందరం సేఫ్ గా ఉండాలి…నా గురించి ఆదుర్థాపడకండి.”అంది ఎర్విక్.అప్పటికే వాళ్ళు చాలా దూరం వచ్చేసారు.ఒక చెట్టు కింద ఆగారు.అనిరుద్ర ఆ ఇద్దరి వైపు చూసాడు.స్వాప్నిక చాలా అలిసిపోయినట్టు కనిపిస్తోంది. ఆమెలో ఆందోళ భయం కనిపిస్తున్నాయి.
ప్రమాదాలతో ఆడుకునే తనకు ఇది సాధారణ విషయం..కానీ స్వాప్నిక లాంటి అమ్మాయికి చాలా కష్టం.
“పాపం డాక్టర్ పరమహంస ఈ వయసులో ఎలా పరుగెత్తగలడు.?ముసుగువ్యక్తుల చేతుల్లో చనిపోయి ఉంటాడు”స్వాప్నిక అంది
“అతను చంపే టైపు..చచ్చే టైపు కాదు.అయినా అతడ్ని వాళ్ళేమీ చేయరు చేయలేరు”అనిరుద్ర అన్నాడు.
“ఎందుకని?ఆయాసాన్ని తీర్చుకుంటూ అడిగింది స్వాప్నిక.
“ఎందుకంటే ఆ ముసుగువ్యక్తులు డాక్టర్ పరమహంస చెప్పినట్టు వినే యంత్రాల్లాంటి మనుష్యులు”చెప్పాడు అనిరుద్ర
అర్థం కానట్టు చూసింది స్వాప్నిక.
“మీఅన్నయ్యను,నార్త్ అవెన్యూ లోకి వచ్చేవారిని చంపిస్తున్నది పరమహంసే…యూత్ ను డిప్రెషన్ లో వున్నవారిని అట్రాక్ట్ చేసి వారిని నార్త్ అవెన్యూ కు తీసుకువచ్చి వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేస్తాడు.ఆ డ్రగ్స్ వాళ్ళ శరీరంలోకి వెళ్లి వాళ్ళ ఆలోచనలను నిర్వీర్యం చేస్తుంది.వాళ్ళను ట్రాన్స్ లోకి తీసుకువెళ్తాడు.
తన ఇంటినుంచి ఇక్కడ జరిగే ప్రతీ విషయాన్నీ టెక్నాలజీ సాయంతో అబ్సర్వ్ చేస్తాడు.కమాండ్స్ పంపిస్తాడు.
నార్త్ అవెన్యూ చుట్టూ అతిశక్తివంతమైన కెమెరాలు వున్నాయి వాటిద్వారా నార్త్ అవెన్యూ లోకి వచ్చేవారిని గమనిస్తాడు.”
“ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు?అయోమయంగా అడిగింది స్వాప్నిక.
“స్వార్థం…పైశాచికత్వం.ఉగాండాలో ఒక వ్యక్తి మనుష్యులను చంపి వారి మెదళ్లను ప్రిజ్ లో భద్రపర్చుకుని తినేవాడుట…నిక్లోస్ అనే వ్యక్తి మనుష్యులను చంపి వారి శరీరంలోని పార్ట్శ్ ని గాజు బీకర్లలో భద్రపర్చేవాడుట…దాదాపు పది సంవత్సరాలు అతని దుశ్చర్యలు కొనసాగాయి.అతను చచ్చాక అతని ఇంట్లో బయటపడ్డాయి.కొందరు గుప్త నిధుల కోసం బలులు ఇస్తారు.
మరికొందరు విధ్వంసకరమైన పరిశోధనల కోసం ఇలా చేస్తారు.డాక్టర్ పరమహంస తన మేథస్సును ఇలాంటి ప్రయోగాల కోసం వినియోగిస్తున్నారు..అదేమిటో నార్త్ అవెన్యూ లోకి అడుగుపెడితేనే తెలుస్తుంది.అన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నార్త్ అవెన్యూ హక్కుదారుడు డాక్టర్ పరమహంసే.రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎంక్వయిరీ చేస్తే తెలిసింది.తన పరిశోధనలు జరపడానికి.ఆ పరిశోధనలకు అడ్డులేఉండా ఉండడానికి నార్త్ అవెన్యూ ని వాడుకుంటున్నాడు.”
“నార్త్ అవెన్యూ తనదే అయినప్పుడు డైరెక్ట్ గా ఇక్కడే వుండొచ్చుగా?స్వాప్నికలో అనుమానం.
“అలా ఉంటే తన పరిశోధనల గుట్టు రట్టవుతుంది.”చెప్పాడు అనిరుద్ర.అప్పుడే వెనుక ఎదో చప్పుడైంది.అనిరుద్ర చెవులు రిక్కించి విన్నాడు.
ఎండుటాకుల మీద ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది.ఎదో పాకుతూ వస్తుంది.తలతిప్పి చూసాడు.మూడు అడుగుల పొడవున్నపాము వీళ్ళ వైపే వస్తుంది.అది స్వాప్నిక వైపుకు తిరిగింది.స్వాప్నిక కళ్ళు పామును చూశాయి.కోరలు బయటకు కనిపిస్తున్నాయి.
ఏ క్షణమైనా కాటువేయడానికి సిద్ధంగా వుంది.
ఎర్విక్ తన ప్యాంటు జేబులో వున్న రివాల్వర్ బయటకు తీసింది.వద్దు అన్నట్టు సైగ చేసాడు అనిరుద్ర.మెల్లిగా కిందికి వంగి ఒడుపుగా పాము మెడమీద చేయివేసి గాల్లోకి చేయిలేపి దూరంగా విసిరేసాడు.స్వాప్నిక భయంగా అనిరుద్ర దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకుంది.ఆమె చేతులు అతడిని వీపును చుట్టేసాయి.
అనిరుద్ర ఒక్కక్షణం అలానే వుండిపోయాడు.వెంటనే తేరుకున్నాడు.
అతని చెవులు ఒక శబ్దాన్ని విన్నాయి..పామును దూరంగా విసిరేసినప్పుడు పాము నేల మీద పడిన శబ్దం రాలేదు.చిన్న శబ్దం,ఆ శబ్దం ఎలాంటిదో గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ ముందుకు కదిలాడు..
అప్పుడు గుర్తొచ్చింది…పాము పడింది డప్పు మీద…డప్పుమీద పాము పడ్డ శబ్దం డప్పు వాయించినట్టు.టముకు వేసినట్టు…దూరంగా రక్తంతో తడిసిపోయిన డప్పు….మరికాస్త దూరం నడిచాడు.అక్కడ డప్పుదాసు శవం.తలమీద బలమైన గాయంతో చచ్చిపడివున్నాడు.
అతని చూపుడు వేలు దారిని చూపిస్తున్నట్టు…ఉత్తరం వైపు చూపిస్తుంది.ఉత్తరం వైపు పొదలున్నాయి.
వచ్చేవారం వరకూ…బీ అలర్ట్

మిమ్మల్ని అలరిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ కినిగే ద్వారా ఈ బుక్ గా మీ ముందుకు వచ్చింది.
ఈ నవల మీద మీ స్పందన తెలియజేయండి.
నార్త్ అవెన్యూ నవల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/book/North+Avenue

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY