వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (26-02-2017)

                                       18
తలుపు మీద ఎవరో గట్టిగా బాదుతున్న శబ్దం. అనిరుద్ర సడెన్ గా తలుపు తేర్చుకోగానే అలర్ట్ అయ్యాడు.అతని కుడిచేతిలో రివాల్వర్ వుంది.లోపలి అడుగుపెడుతూనే భయంతో వణికిపోతోన్న గోమతిని చూసాడు.విషయం సగం అర్థమైంది.గోమతి జరిగిన కథ చెప్పింది.చివరికి వృద్ధుడు వెళ్తూ తనకు దారి చూపడంతో సహా.
“అంటే ఆ వృద్ధుడు మనకు శత్రువుకాదు.ఆ వృద్ధుడు చూపినదారి నార్త్ అవెన్యూ నుంచి బయటకు వెళ్ళడానికి ,తప్పించుకోవడానికి,..ఆ వృద్ధుడు తప్పించుకోలేదు.అలా తప్పించుకుంటే మాకు ఎదురవ్వాలి.అంటే ఇక్కడి నుంచి నార్త్ అవెన్యూ లోకి వెళ్లే దారి వుంది.ఆ వృధుడు అక్కడికే వెళ్లి ఉంటాడు.”అనిరుద్ర ఆలోచనలు ముందుకు సాగుతున్నాయి.
అనిరుద్ర గోమతి వైపు “మేము వచ్చినదారిలో వెళ్ళిపో…నేను పోలీసులకు చెబుతాను.వాళ్ళు నిన్ను క్షేమంగా ఢిల్లీ పంపిస్తారు”అన్నాడు.
“నాకు భయంగా వుంది …నేనూ మీతోపాటు వస్తాను”అంది గోమతి.ఎర్విక్ అదీ నిజమే అన్నట్టు అనిరుద్ర వైపు చూసింది.అనిరుద్ర సరేనన్నాడు.అక్కడి నుంచి బయటపడే దారి వెతుకుతూ ఉంటే…కనిపించింది…చిన్న ఇరుకైనదారి.
ఆ దారిలో నుంచి వెళ్లి చూసి షాకయ్యారు.పైకి మెట్లు వున్నాయి.ఆ మెట్లదారి గుండా పైకి వచ్చి చూస్తే..తాము వున్నది నార్త్ అవెన్యూ లోనని తెలిసింది.అంటే నార్త్ అవెన్యూ లోనే గోమతిని వృద్ధుడిని బంధించారు.సొరంగమార్గం నార్త్ అవెన్యూ లోకి వస్తుంది.
ఒక చిక్కుముడి వీడింది.సరిగ్గా అదే సమయంలో నార్త్ అవెన్యూ లో వున్న పదమూడవ గదిలో డాక్టర్ పరమహంస వున్నాడు.ఆ విశాలమైన గదిలో కొన్ని టేబుల్స్ వున్నాయి.వాటి మీద కొని మృతదేహాలు వున్నాయి.పరమహంస ఎదురుగా ముసుగు ధరించిన వ్యక్తులు.వాళ్ళు మత్తులో వున్నారు.అతని ట్రాన్స్ లో వున్నారు.
                                      ***
అందరివంకా చూసాడు పరమహంస…ఆ తర్వాత తన గొంతు విప్పాడు”మీకు సుప్రీం అంటే భయం పోతోంది.నేను చెప్పిన పని చేయడం లేదు.నార్త్ అవెన్యూ లోకి ప్రవేశించినవారెవరూ ప్రాణాలతో తిరిగి వెళ్లకూడదని మీకు చెప్పాను…అయినా ఒకడు తప్పించుకున్నాడు..ఆ ఓల్డ్ మేన్ మీ కళ్లు గప్పి మిమల్ని దెబ్బతీసి పారిపోయాడు….ఇలా అయితే మీకు డ్రగ్స్ ఇవ్వను”వాళ్ళ బలహీనతల మీద గేమ్ మొదలుపెట్టాడు.
“వద్దు సుప్రీం …డ్రగ్స్ లేకపోతే మా నరాలు చచ్చుబడిపోతాయి.మాప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.మాకు ఒక్క చాన్సు ఇవ్వండి…”అందరూ మోకాళ్ళ మీద కూచోని ప్రాథేయపడుతున్నారు.
క్రూరంగా నవ్వుకున్నాడు పరమహంస.వాళ్ళ బలహీనత ఏమిటో తనకు తెలుసు..లక్షల పోసిన నార్త్ అవెన్యూ కు కాపలా వుండేవాళ్ళు దొరకరు.కేవలం వాళ్లకు కావాల్సిన డ్రగ్ ఇస్తే ఏం చెప్పినా చేస్తారు.ప్రాణాలు తీయమన్నా తీస్తారు.అలా నార్త్ అవెన్యూ లో వీళ్ళ చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు పదుల సంఖ్యలో వున్నారు.నార్త్ అవెన్యూ పట్ల ఆసక్తి కలిగేలా తానే ఇంటర్ నెట్ లో పెట్టి వాళ్ళను ఇక్కడికి రప్పించి డ్రగ్ ఎడిక్ట్స్ గా మార్చి తన బానిసలుగా చేసుకున్నాడు.తన మాట విననివాళ్లను.నార్త్ అవెన్యూ రహస్యాలను బయట ప్రపంచాన్ని తెలియజేయాలనుకుని ఇక్కడికి వచ్చినవాళ్ళను క్రూరంగా చంపించాడు.చనిపోయిన మృతదేహాల మీద మాత్రమే కాదు,తానే చంపించీ వారిమీద కూడా తను చేసే ప్రయోగాలకు అడ్డులేకుండా చూసుకున్నాడు.కానీ సిబిఐ నుంచి అనిరుద్ర వచ్చేక తన ఉనికికి ప్రమాదం ఏర్పడింది.
పరమహంస వెనుక వున్న గోడ మీద పెద్ద స్క్రీన్ వుంది.దాని మీద అనిరుద్ర ఎర్విక్ స్వాప్నిక ఫోటోలు వున్నాయి.
“వీళ్ళలో ఏ ఒక్కరూ నార్త్ అవెన్యూ దాటి ప్రాణాలతో వెళ్ళకూడదు ..వెళ్ళండి అణువణువూ గాలించండి”ఆజ్ఞాపించాడు పరమహంస.
“మీకు అంత శ్రమ అక్కర్లేదు మిస్టర్ పరమహంస…మీ ఎదురుగానే వున్నాం”అంటూ ఆ హాల్లోకి వచ్చాడు అనిరుద్ర,అతని వెనుకే స్వాప్నిక ఎర్విక్ గోమతీ వున్నారు.
అనుకోని హఠాత్పరిణామానికి ఖంగు తిన్నాడు పరమహంస.వెంటనే అక్కడ వున్న ముసుగుమనుష్యులవైపు చూసి “వాళ్ళను చంపేయండి”అని అరిచాడు.అప్పటికే ఆ హాల్లో పొగ కమ్ముకుంది.
***
వచ్చేవారం వరకూ…బీ అలర్ట్
మిమ్మల్ని అలరిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ కినిగే ద్వారా ఈ బుక్ గా మీ ముందుకు వచ్చింది.
ఈ నవల మీద మీ స్పందన తెలియజేయండి.
నార్త్ అవెన్యూ నవల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/book/North+Avenue

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY