మనుష్యుల శవాలతో నువ్వు చేసే ప్రయోగాలు క్షుద్రపూజలకన్నా ప్రమాదకరమైనవి….వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (05-03-2017)

                                        19
బలవంతంగా కళ్ళు తెరిచాడు పరమహంస.తలంతా బరువుగా అనిపించింది.ఎదురుగా అనిరుద్ర.
“హౌ ఆర్యూ డాక్టర్ “నవ్వుతూ అడిగాడు అనిరుద్ర.
“నేను నేనెక్కడ వున్నాను”ఒక క్షణం అతనిలో కన్ఫ్యూషన్.
“నువ్వు సృష్టించుకున్ననార్త్ అవెన్యూ లోనే వున్నావు…కానీ నీ సామ్రాజ్యం కుప్పకూలింది.నువ్వు తయారుచేసిన సైన్యం ఇప్పుడు నువ్వు అలవాటు చేసిన డ్రగ్స్ నుంచి బయటపడడానికి చికిత్స తీసుకుంటున్నారు.మనుష్యుల శవాలతో నువ్వు చేసే ప్రయోగాలు క్షుద్రపూజలకన్నా ప్రమాదకరమైనవి.నీ ప్రయోగాల కోసం నువ్వు మారణహోమం సృష్టించావు.అందుకు చట్టం నిన్ను శిక్షిస్తుంది”చెప్పాడు అనిరుద్ర.
“ఇది నా సామ్రాజ్యం..నార్త్ అవెన్యూ కు నేను హక్కుదారుడిని”పిచ్చిగా అరిచాడు పరమహంస.అతను జీర్ణించుకోలేకపోతున్నారు.సంవత్సరాలుగా నిర్మించుకున్న సామ్రాజ్యం ఒకేసారి కుప్పకూలిపోయింది.
“ఇది న్నీ సామ్రాజ్యం కాదు పరమహంస..నార్త్ అవెన్యూ కు హక్కదారుడిని నేను…”ఒక్కసారిగా ఆ మాటలు విని ముందుకు చూసాడు.
నార్త్ అవెన్యూ లో తను బంధించిన వృద్దుడు.
“అవును సోదరా…నువ్వు నా దాయాది వారసుడివి…నార్త్ అవెన్యూ మా తాతముత్తాలది.ఎప్పటికైనా కోట్ల విలువైన నార్త్ అవెన్యూ మీ స్వంతం కావాలని పురిట్లో ఒకేసారి పుట్టిన మనల్ని మార్చేశారు నీ తల్లిదండ్రులు.నువ్వు నార్త్ అవెన్యూ వారసుడుగా పెరగవు..నేను నీ దాయాది వారసుడుగా మిగిలాను.నా కన్నతల్లిదండ్రులు నన్నెందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారో అర్థం కాకా పిచ్చెక్కిపోయాను.ఆ సమయంలో దేవుడిలా నన్ను ఆదుకున్నారు అనిరుద్ర గారు.నన్ను నాతల్లిదండ్రులే చంపాలని ప్రయత్నించడానికి కారణం నేను వాళ్ళ బిడ్డను కాకపోవడమే.నువ్వే తన బిడ్డవు.
ఆ విషయం నీకు చెప్పాలని నార్త్ అవెన్యూ కు వచ్చిన నీతండ్రిని శత్రువు అనుకుని నువ్వే చంపించావు.మీనాన్న చనిపోయిన దిగులుతో మీ అమ్మ మంచం పట్టి చనిపోయింది.చనిపోయేముందు ఈ రహస్యాన్ని చెప్పింది.ఆ కృతజ్ఞతతో కొన్నాళ్ళైనా అమ్మ అని పిలిచినా బంధంతో నిన్ను చంపకుండా చట్టానికి అప్పగించాలని నిర్ణయించుకున్నాను.అనిరుద్రగారి సాయంతో ఇక్కడికి వచ్చాను”వృద్ధుడు చెప్పాడు.
ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నాడు పరమహంస. తనో వ్యక్తిని వెంటాడి చంపమని తనదగ్గర వున్న ముసుగుమనుష్యులకు చెప్పడం..వాళ్ళు అతడిని వెంటాడి ఘోరంగా చంపడం.అతని మృతదేహాన్ని తన పరిశోధనల కోసం ముక్కలు చేయడం గుర్తొచ్చింది..ఆ క్షణమే అతనికి పిచ్చెక్కింది.
ఒక చిన్న సంఘటన అతని మీద తీవ్రప్రభావాన్ని చూపింది.
తను పట్టుబడడం..సొసైటీ లో తనకున్న పేరు పోయి తనో సైకో అన్న వార్తలు పత్రికల్లో రావడం,తను నార్త్ అవెన్యూ కి వారసుడిని కానని తెలియడం,అన్నింటికీ మించి తన తండ్రి చావుకు కారణం తానే కావడం…
వరుస వైఫల్యాలు..వరుస తప్పిదాలు..నైతికంగా తను దిగజారిన వైనం..తన మీద తనకే అసహ్యం పుట్టింది..
ఫలితంగా అతను మతిస్థిమితం కోల్పోయేలా చేసింది.
                                     ***
వచ్చేవారం వరకూ…బీ అలర్ట్
మిమ్మల్ని అలరిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ కినిగే ద్వారా ఈ బుక్ గా మీ ముందుకు వచ్చింది.
ఈ నవల మీద మీ స్పందన తెలియజేయండి.
నార్త్ అవెన్యూ నవల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/book/North+Avenue

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY