అతను నేను అనుకున్నంత చెడ్డవాడు కాదనిపించింది. సినిమాలో చూపించినట్టు గ్యాంగ్ ను వెంటేసుకుని…స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటి నేను (05-03-2017)

(గత సంచిక తరువాయి…)
నేను చేయబోయే రెండు డ్రామాల ప్రాక్టీస్ చాలా జోరుగా సాగుతోంది. స్కూల్ డే దగ్గరపడే కొద్దీ క్లాస్ కి వెళ్ళడమే మానేశాము.
పొద్దున మెయిన్ డ్రామా, సాయంత్రం మరో డ్రామా.ఇక మిగిలింది మధ్యాహ్నమే..
లంచ్ తరువాత డ్రామా ప్రాక్టీస్ చేసేలా చిన్నబాబు అండ్ గ్యాంగ్ ప్లాన్ చేశారు.
డ్రామాలో మాకు పట్టు దొరికింది. డైలాగ్ ఫ్లో బాగా వస్తోంది.
ఎవరి రోల్ రాగానే వారు క్లియర్ గా డైలాగ్స్ చెప్పేస్తున్నారు.
ఇక నటించి చూపడమే మిగిలింది.
డైలాగ్ డెలివరిలో పిచ్ మరియు ఇంటెన్సిటీ రావడంలేదు.
***
సోమవారం లంచ్ తరువాత చినబాబు అండ్ గ్యాంగ్ తో కలసి లైబ్రరీలో సెటిల్ అయ్యాం. లైబ్రరీ ఇప్పుడు కేవలం వాళ్ళ డ్రామా రిహార్సల్స్ కి పెర్మనెంట్ ప్లేస్ అయ్యింది.
లైబ్రేరియన్ కూడా రావడం మానుకుంది.
కీస్ చినబాబు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు.
మా డ్రామాలో ఎలా చేస్తున్నారో అలానే స్టార్ట్ చేశాం. అందరిని కూర్చోబెట్టి డ్రామా కాన్సెప్ట్ వివరించాను. వారి రోల్ ఎలా ఉంటుందో, డ్రామాలో వారి ఇన్వాల్వ్ మెంట్ ఏమిటో చెప్పాను. చినబాబుతో సహా అందరూ శ్రద్దగా విన్నారు.
చినబాబు కూడా శ్రద్దగా వినడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను నేను అనుకున్నంత చెడ్డవాడు కాదనిపించింది. సినిమాలో చూపించినట్టు గ్యాంగ్ ను వెంటేసుకుని అల్లరి చేయడం, ఎవరి మాటా వినకపోవడం, స్కూల్ మాదే అన్న అహంకారంతో టీచర్స్ ను లేక్కచేయకపోవడం లాంటివి మచ్చుకైనా కనపడలేదు.
ఫస్ట్ రౌండ్ లో డ్రామా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక రోల్ ప్లే చేసేవారికి ఏదైనా డౌట్స్ ఉన్నాయేమో అడిగాను. డైలాగ్స్ నేర్చుకోవడంలో ఏదైనా కష్టం, డైలాగ్స్ ఎక్కడైనా చేంజ్ చెయ్యాలేమో అన్న వివరాలు కూడా రాబట్టాను.
డైలాగ్ మార్చుకోవచ్చు అన్న ఐడియా ఫస్ట్ టైం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే అనిపించింది. డ్రామాబుక్ లో రాసింది అలానే తీసుకోకుండా మనకు నచ్చిన రీతిలో మార్చుకోవచ్చు అన్న ఐడియా నిజంగా నాకు నచ్చింది.
ఎవరికీ ఏ ప్రాబ్లం లేదన్నట్టు అందరూ సైలెంట్ గా కూర్చున్నారు.
చినబాబు అందరి తరపున వకాల్తా పుచ్చుకుంటూ మార్చనవసరం లేదు అన్నట్టు సంకేతం ఇచ్చాడు.
డైరెక్టర్ గా నా మొదటి ప్రయత్నం, మొదటి ప్రయాణం ప్రారంభం అయ్యింది.
నా మాటకు విలువిస్తూ అందరూ తమ డైలాగ్ పేపర్స్ చేతిలో పెట్టుకుని నిల్చున్నారు. డ్రామాకి ముఖ్యమైన విషయం స్క్రిప్ట్ ని రెడీ చెయ్యడం.
ఆ గ్రూప్ లో హ్యాండ్ రైటింగ్ బాగున్న వారి దగ్గర వైట్ పేపర్స్ లో డ్రామా స్క్రిప్ట్ మొత్తం రాయించాను. రోల్ ప్రకారం వారి డైలాగ్స్ ను స్క్రిప్ట్ నుండి రాసుకోమని చెప్పాను. డ్రామా ప్రాక్టీస్ కి వచ్చేటప్పుడు వారి రోల్ స్క్రిప్ట్ ను మరిచిపోకుండా తేవాలని చినబాబు ఉన్నాకూడా కేర్ చెయ్యకుండా స్ట్రిక్ట్ గా చెప్పాను మెయిన్ స్క్రిప్ట్ నా వద్ద ఉంచుకుంటూ.
చినబాబు మెయిన్ స్క్రిప్ట్ ను మూడు కాపీలు జిరాక్స్ చేయించాడు. అందులో ఒకటి లైబ్రరిలోనే ఉంచాడు.
డ్రామా విషయంలో చినబాబు సీరియస్ గా ఉండడం సంతోషంతో పాటు కాస్త భయాన్ని కూడా కలిగించింది.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY