మెయిన్ డ్రామా లో బాగా పట్టు సాధించాం. డైలాగ్స్ అలవోకగా చెప్పగలుగుతున్నాం. ఎమోషన్స్ పండించడం వచ్చేసింది….స్మార్ట్ రైటర్ సురేంద్ర చిగురించిన జ్ఞాపకాలు..నిన్నటి నేను (12-03-2017)

(గత సంచిక తరువాయి…)
మెయిన్ డ్రామా లో బాగా పట్టు సాధించాం. డైలాగ్స్ అలవోకగా చెప్పగలుగుతున్నాం.
ఎమోషన్స్ పండించడం వచ్చేసింది.
మైమ్ డ్రామా మొదట్లో నిడివి 10 నిముషాలు ఉండేది. ప్రాక్టీస్ తో దాన్ని 20 నిముషాలు చేయగలిగాం.
మొదట్లో సీన్ బై సీన్ వేగంగా చేయడం వల్ల 10 నిముషాలలో అయిపోయేది.
ఎక్కడ నెక్స్ట్ సీన్ మరిచిపోతామో అన్న తొందరలో చేయడం వల్ల వచ్చిన చిక్కుగా తరువాత అర్థం అయ్యింది.
మైమ్ డ్రామాలో ఎక్కడ స్లో చెయ్యాలో ఎక్కడ వేగం పెంచాలో క్లియర్ గా తెలిసింది.
నేను డైరెక్ట్ చేయబోయే చినబాబు డ్రామా పట్టాలు ఎక్కింది.
డ్రామా రిహార్సల్స్ లో నేను ఎంత స్ట్రిక్ట్ గా ఉంటానో ముందుగానే చెప్పేశాను.
డ్రామా ప్రాక్టీస్ కు టైం బాగా ఉంటోంది. డిస్టర్బ్ చేసే సాహసం ఎవరికీ లేదని కూడా అందరికి బాగా తెలుసు.
ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ సీన్…
డైలాగ్ చెప్పడానికి మొదటి స్టూడెంట్ వచ్చాడు. చేతిలో పేపర్ ఉంది. డైలాగ్ చెప్పడం స్టార్ట్ చేశాడు.
ఏదో స్కూల్ లెసన్ అప్పజేప్పినట్టు ఉంది. ఎమోషన్స్ లేవు. డైలాగ్ లో డెప్త్ లేదు.
అతణ్ణి పక్కకు జరగమని అదే సీన్ నేను చేసి చూపించాను.
అంతే… ఒక్కసారి చప్పట్లతో రూమ్ మారుమ్రోగిపోయింది. ఆ సౌండ్ విని బయట ఉన్న స్టూడెంట్స్ కూడా పరుగెత్తుకుని లోనికి వచ్చారు. అందరూ మెచ్చుకుంటుంటే చినబాబు పేస్ లో ఏదో అనీజీనెస్…
అతను బయటకు ఎక్స్ ప్రెస్ చెయ్యకపోయినా అతని పేస్ లో అది క్లియర్ గా తెలిసింది. దీని ఫలితం ఏమిటో అనుకుంటూ మనసులో ఏదో ఫీల్ కలగడం స్టార్ట్ అయ్యింది….
ఆ బ్యాచ్ లోనే నాకు ఫాలోయర్స్ స్టార్ట్ అయ్యారు… డ్రామాలో మొదటి రోజు గడిచింది.
డ్రామాలో ఉన్న జూనియర్స్ అందరూ బాగా క్లోజ్ అయ్యారు.. తమ డైలాగ్ పేపర్స్ తో వచ్చి తమ యాక్టింగ్ చూడమని, అందులో ఏదైనా తప్పులు ఉంటే కరెక్ట్ చెయ్యమని అడగడం స్టార్ట్ చేశారు.
చినబాబు మూడ్ మారడం నాకు క్లియర్ గా తెలుస్తోంది..
డ్రామా మద్యలో కల్పించుకోవడం స్టార్ట్ చేశాడు..
అతని ప్రక్కన ఉన్నవారు ఏదో చెప్పినట్టు ఉన్నారు…
బహుశా అతను సైలెంట్ గా ఉంటే అతని పేరు రాదని నేను హైలైట్ అవుతానని వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగినట్టు ఉంది…
***
డ్రామా రిహార్సల్ స్లో అయ్యింది… చినబాబు ప్రతి విషయంలో కలుగజేసుకోవడం ఎక్కువ అయ్యింది..
చివరకు స్టూడెంట్స్ ఎలా ఆక్ట్ చెయ్యాలో కూడా తన ఇష్టప్రకారం జరగాలన్నంత దూరం వెళ్ళింది.
వాళ్ళు యాక్ట్ చేస్తుంటే అలా కాదు ఎలా అని మార్చడం… వాళ్లకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చెయ్యమని చెప్పడం… మనసుని కష్టపెడితే యాక్టింగ్ రాదు అన్న విషయం ఆ డ్రామా రిహార్సల్ ద్వారా క్లియర్ గా అర్థం అయ్యింది.
సినిమాలో డైరెక్టర్ ని కాదని ప్రొడ్యూసర్ అన్ని విషయాలలో వేలు పెడుతూ ఉంటె డైరెక్టర్ బాధ ఎలా ఉంటందో నా పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది.
ఇష్టం వచ్చినట్టు చేయడం… రిహార్సల్ మద్యలో డైలాగ్స్ చెప్పడం ఆపి మాట్లాడుకుంటూ ఉండడం లాంటివి ఎక్కువ అయ్యాయి.
డైరెక్టర్ గా నా రోల్ నామమాత్రం అయ్యింది. వాళ్ళ మాటలు అయ్యేంతవరకు వెయిట్ చెయ్యడం, తరువాత వారికి తీరిక దొరికినప్పుడు ప్రాక్టీస్ చెయ్యడం సాదారణం అయ్యింది…

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY