నా మాటలు అతనికి ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించకపోవడం నా అనుమానాన్ని బలపరిచింది….నిన్నటి నేను (19-03-2017)

(గత సంచిక తరువాయి…)
ఇక డ్రామా ముందుకు పోతుందన్న ఆశ పోయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది.
క్రమంగా డ్రామాలో రోల్ ప్లే చేసేవారు తమకు ఇచ్చిన స్క్రిప్ట్ మరిచిపోవడం స్టార్ట్ అయ్యింది. ఇక మనం అక్కడ ఉంటే లాభం లేదు అనుకుంటూ చినబాబుకి చెప్పాను.
అతని పేస్ లో స్మైల్ నాకు అతను ఈ మాట కోసమే వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది.
నా మాటలు అతనికి ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించకపోవడం నా అనుమానాన్ని బలపరిచింది.
ఇక నా టైం నేను చేస్తున్న డ్రామాలపై ఉంచడం చాలా మంచిది అనుకున్నాను. అదే విషయం టీం మొత్తానికి చెప్పాను. ఆ బ్యాచ్ లో కొంతమంది నిజంగానే నా డెసిషన్ విని బాధపడ్డారు. అక్కడే డైరెక్టర్ గా నేను సక్సెస్ అయినట్టు అనిపించింది. వాళ్లకు డ్రామా చెయ్యాలని ఉన్నా చినబాబు ఉన్నంతవరకు అది కుదరదని తెలుసు. ఆ తరువాత ఆ బ్యాచ్ లో కొంతమందిని మేము తీసిన డ్రామాలో తీసుకోవడం జరిగింది.
                                        ***
మొత్తానికి నా డైరెక్టర్ పోస్ట్ కి గుడ్ బై చెప్పేసి తిరిగి నా డ్రామా ప్రాక్టీస్ లో పడ్డాను. స్కూల్ డే డేట్ బయటకు రావడంతో ప్రాక్టీస్ ముమ్మరం అయ్యింది.
ఇలా ఉండగా ఒక రోజు రాత్రి…
9 గంటల సమయం. డిన్నర్ చేసి ఇంటి బయట చల్లగాలిని ఆస్వాదిస్తూ కూర్చున్నాను.
ఒక్కసారిగా మా తెలుగు సర్ ప్రత్యక్షం అయ్యాడు. వచ్చీ రావడంతో సైకిల్ ఎక్కమన్నాడు.
ఎక్కడకు… ఎందుకు… ఎలా… అన్న ప్రశ్నలు ఉండవని ఆయనకు తెలుసు.
సర్ తో బయటకు వెళ్తున్నా అని మా అమ్మమ్మకు చెప్పి సైకిల్ ఎక్కాను.
పది నిముషాలలో నాలుగైదు సందులు తిప్పి ఒక ఏరియాలో సైకిల్ ఆపాడు.
ఎదురుగా ఉన్న బోర్డ్ చూశాను
“ప్రాచ్య కళాశాల” అప్పటివరకు ఆ రోడ్ లో ఎన్నోసార్లు వెళ్లాను. అక్కడ ఒక కాలేజ్ ఉందని తెలుసు కానీ అక్కడ ఏమి ఉంటుంది, ఏమి చెప్తారో అసలు ఆ కాలేజ్ లో ఏ సబ్జక్ట్స్ ఉంటాయో కూడా తెలియదు.
తెలియని విషయాలు తెలుసుకోవడం అంటే అత్యంత ఇంట్రెస్ట్ చూపే నేను ఆ ప్లేస్ కి రావడం అది కూడా రాత్రి 10 గంటల సమయంలో అనుకోగానే ఉన్న నిద్రమత్తు వదిలిపోయింది.
నైట్ లో ఏ కాలేజీ కూడా పని చెయ్యడం ఉండదు. పైగా ప్రాచ్య కళాశాల అంటే అర్థం కూడా తెలియదు.
అదే విషయం మా తెలుగు సర్ ని అడిగాను…
అందుకు ఆయన చిరునవ్వు నవ్వి లోపలకు పొతే నీకే తెలుస్తుంది అన్నట్టు ముందుకు కదిలాడు.
అర్థరాత్రి ఈ సస్పెన్స్ ఏమిటో అర్థం కాకున్నా ఏదో అర్థం అయినట్టు తల ఊపుతూ ఆయన వెంట లోనికి నడిచాను.
***
ప్రాచ్య కళాశాలలో అడుగుపెట్టడం మొదటిసారి కావడంతో అంతా కొత్తగా కనిపించింది.
దూరంగా కొన్ని క్లాస్ రూమ్స్ లో లైట్స్ వెలుగుతున్నాయి. రాత్రి బడిలా, ఈవెనింగ్ కాలేజీలా అర్థరాత్రి కూడా కాలేజ్ ఉన్నట్టు ఉంది.
నిద్రపోయే సమయంలో చదవడమా…
ఎంత ఆలోచించినా నా బుర్రకు ఈ పాయింట్ అంతుపట్టలేదు.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY