నాకు అసలే చీకటంటే భయం…ఎరక్కపోయి వచ్చానురా దేవుడా అనుకున్నా… నిన్నటి నేను (26-03-2017)

 

(గత సంచిక తరువాయి…)
‘హే అత్రి మహర్షే… కిమ్ ఇదం?” అన్న అరుపు విని ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. సైలెంట్ గా ఉన్న ప్లేస్ లో వినపడ్డ పెద్ద గొంతుతో ఒళ్ళు జలదరించింది.
అయోమయంగా మా సర్ వైపు చూశాను. ఎందుకో ఒక్కసారి భయం వేసింది.
రాత్రివేళ… పైగా ఎవరూ కనపడ్డం లేదు… ఈ అరుపులు… కొంపదీసి ఏ దయ్యమో… భూతమో..
నాకు అసలే చీకటంటే భయం…
ఎరక్కపోయి వచ్చానురా దేవుడా అనుకున్నా…
మా సర్ పక్కన నడిచేవాడిని కాస్త ఆయన వెనుక చేరాను.
మా సర్ దూరంగా లైట్ వెలుగుతున్న క్లాస్ రూమ్ వైపు కదిలాడు.
నేను బిక్కుబిక్కుమంటూ ఆయన వెనుకనే కదిలాను. దగ్గరకు వెళ్ళే కొద్దీ ఏదో మాటలు వినపడుతున్నాయి.
అర్థం కాని బాష… తెలుగులా లేదు… వినసొంపుగా ఉంది కాని అర్థం మాత్రం కావడం లేదు.
మెల్లగా క్లాస్ రూమ్ వద్దకు చేరాం. మా సర్ ఎవరినో చూసి నమస్కారం పెట్టాడు.
తలయెత్తి ఆయన వైపు చూశాను. చక్కటి తేజస్సు ఉట్టిపడుతోంది…
నిలువు నామాలు, బావిరి గడ్డంతో చూడగానే భక్తిభావం కలుగుతోంది. పంచెకట్టుతో హుందాగా ఉన్నారు.
ఆయన చుట్టూ చాలా మంది కూర్చున్నారు. వాళ్ళు మమ్మల్ని ఒక్కసారి చూసి తరువాత వాళ్ళ పనిలో పడ్డారు.
నేను, మా సర్ క్లాస్ రూమ్ లో ఒక మూల కూర్చున్నాం. నేను నా టెన్షన్ తట్టుకోలేక మా సర్ ని మెల్లగా అడిగాను.
“వీళ్ళు ఎవరు సర్? మనం ఇక్కడకు ఎందుకు వచ్చాం?”
“ఆయన మా సర్”
“మీరు ఇక్కడే చదివారా?”
“అవును”
“ఓరియంటల్ కాలేజీ అంటే ఏమిటి సర్?”
“సంస్కృత కళాశాల”
అప్పటికి కాని నాకు అర్థం కాలేదు. నేను విన్నది సంస్కృతం అని.
“ఇక్కడకు ఎందుకు వచ్చాం?”
“మా సర్ తో పని ఉంది.”
“మరైతే డే టైం లో రావొచ్చు కదా”
మా సర్ నా వైపు ఒక్కసారి ఉరిమి చూడడంతో నా నోరు టక్కున మూతపడింది.
సైలెంట్ ఉండడం అలవాటులేని నాకు ఊరికే కూర్చోవడం అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు.
“సర్” అని పిలిచాను
ఏమిటి అన్నట్టు చూశాడు
‘హే అత్రి మహర్షే… కిమ్ ఇదం?” అంటే ఏమిటి అని అడిగాను
మా సర్ ఏదో చెప్పబోయేంతలో మరో పెద్ద వాయిస్ వినిపించింది. అదిరిపడి ఆ వైపు చూశాను
అక్కడ సీన్ చూస్తుంటే ఏదో ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఉంది.
మా సర్ వాళ్ళ గురువు ఎవరికో క్లాస్ పీకుతున్నాడు
“ఏమిటయ్యా ఈ ఎక్స్ ప్రెషన్. ఎమోషన్ ఎక్కడ? హే అత్రి మహర్షే … కిమ్ ఇదం? అంటే అర్థం తెలుసా..” అని అడుగుతున్నాడు
నాకు కావలసిన టాపిక్ రావడంతో ఒక్కసారి నా అటెన్షన్ ఆ వైపు పెట్టాను.
“హే అత్రి మహర్షే అంటే ఓ అత్రి మహర్షీ… కిమ్ ఇదం అంటే ఏమిటి ఇది… అని అర్థం. దాన్ని ఎమోషన్ లేకుండా ఇలా చెప్తే ఎలా?” అని అడిగాడు
నాకు సిచువేషన్ మొత్తం క్లియర్ గా అర్థం అయ్యింది.
ఇక్కడ ఏదో డ్రామా రిహార్సల్ జరుగుతోంది. మా సర్ నన్ను అక్కడకు తీసుకురావడానికి కారణం పెద్దవాళ్ళ డ్రామా ఎలా ఉంటుందో, ప్రాక్టీస్ ఎలా చేస్తారో చూపించడానికి రాత్రి అని చూడకుండా నన్ను లాక్కురావడం.
హ్యాపీగా ఫీలై మా సర్ వైపు థాంక్స్ అన్నట్టు చూశాను.
ఇంత చిన్న విషయానికే అంతగా ఫీల్ అవ్వకు. ముందు ఉంది ముసళ్ళ పండగ అన్న భావమేదో కనపడడంతో చటుక్కున నా చూపును డ్రామా రిహార్సల్ జరుగుతున్న వైపు బలవంతంగా మరల్చాను.

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY