ఇక్కడేమో సర్ భారీ డైలాగ్స్ ఉన్న డ్రామా చూపిస్తున్నాడు. ఎక్కడో ఏదో తేడాగా ఉంది…నిన్నటి నేను (02-04-2017)

(గత సంచిక తరువాయి…)
అక్కడ ఉన్నవారికి డ్రామాలో ఉన్న కమిట్ మెంట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డ్రామా అంటే ఇలా ఉండాలి అన్న భావం కలిగేలా అక్కడ ప్రాక్టీస్ జరుగుతోంది.
నాకు పనిపాటా ఏమి లేకపోవడంతో మైండ్ ఏదో ఆలోచించడం స్టార్ట్ చేసింది.
నేను మా సర్ తో వేయబోయే డ్రామా మైమ్… మూకీ
ఇక్కడేమో సర్ భారీ డైలాగ్స్ ఉన్న డ్రామా చూపిస్తున్నాడు. ఎక్కడో ఏదో తేడాగా ఉంది
అడిగితే ఈ సారి మొహమాటం లేకుండా నాలుగు పీకుతాడు… అందులో ఏ సందేహం లేదు.
మనసులో ఒక్కసారి డౌట్ వస్తే ఇక దానికి సమాధానం దొరికే వరకు నిద్ర పట్టదు.
“మై… ఏమి ఆలోచిస్తున్నావు?” గంభీరమైన వాయిస్ వినపడడంతో నా ఆలోచనలను పక్కనపెట్టి ఆ వైపు చూశాను.
మా సర్ వాళ్ళ గురువు ఎవరినో అడుగుతున్నారు.
‘మై’ అనే పేరు కూడా ఉంటుందా… అది కూడా సంస్కృతం చదువుకునే కాలేజీలో…. ఆశ్చర్యంగా మా సర్ వైపు చూశాను.
ఆ సారి ఆయన తిట్టినా సరే నా డౌట్ ని మొహమాటం లేకుండా అడగాలని నిశ్చయించుకున్నాను.
అసలే సైలెంట్ గా కూర్చోవడం రాని నాకు అక్కడ కూర్చోవడం అంటే చాలా చిరాగ్గా ఉంది. నా చిరాకును మా సర్ కి చూపిస్తే ఇక నన్ను మా శివయ్య కూడా రక్షించలేడు.
అయినా అసహనంగా కదలడం మా సర్ దృష్టిని దాటలేదు అని గ్రహించాను.
ఆయన ఏమనుకున్నారో కాని నా మనసులోని సందేహాన్ని ఇట్టే పట్టేశారు
“అతని పేరు మైరావణ…”
“సర్… మరొక్కసారి చెప్పండి?” వినపడ్డా కూడా నిజమో కాదో అన్న డౌట్ మరోపక్క పీడిస్తుంటే ఉండబట్టలేక అడిగాను
“అతని పేరు మైరావణ. వాళ్ళ ఫాదర్ ఈ కాలేజీలోనే ఆచార్యులు”
ఎవరైనా ఏ దేవుడి పేరో లేక ఏదైనా మంచి పేరో పెట్టుకుంటారు. ఇదేంటి మైరావణ అంటూ రాక్షసుని పేరు.
“అతని సోదరుని పేరు రావణుడా” అని అడిగాను. నా మాటలో వ్యంగ్యం నాకే క్లియర్ గా అర్థం అయ్యింది.
ఆ మాట అన్నాక ఎందుకో అనకుండా ఉంటే బాగుండేది అనిపించింది.
గురువులతో హాస్యాలాడకూడదు అన్న పాయింట్ నాకు అప్పుడు ఎందుకు తట్టలేదో అర్థం కాలేదు
“నువ్వు అన్న మాట నిజమే… వాళ్ళు మొత్తం నలుగురు బ్రదర్స్. రావణ, మైరావణ, విభీషణ, కుంభకర్ణ”
“సర్ నిజమే చెప్తున్నారా”
“అవును… ఆయన మాకు సంస్కృత ఆచార్యులు… పురాణంలో ఆయనకు నచ్చిన పాత్రలు అవే అందుకే ఆ పేర్లే పెట్టాడు”
కరెక్ట్ గా నలుగురు పుట్టడం, వాళ్లకు రామ లక్ష్మణ భారత శత్రుఘ్నుల పేర్లు పెట్టకుండా రాక్షసుల పేర్లు పెట్టడం నాకు వింతగా అనిపించింది.
ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని తలచుకుంటే అయ్యో అనిపించింది.
మైరావణ అన్న పేరు కల వ్యక్తి ఆ డ్రామాలో ఏదో రోల్ ప్లే చేస్తున్నాడు అనుకుంటాను.
అతన్ని ఆ పేరుతో పిలిచినా పెద్దగా ఫీల్ అయినట్టు కనపడలేదు. బహుశా అలవాటు ఐనట్టు ఉంది.
ఆ ఊపులోనే నా మనసులో ఉన్న డౌట్ ను ఆయన ముందు పెట్టేశాను.
“మనం ఇక్కడకు ఈ రాత్రిలో ఎందుకు వచ్చాం సర్?” తిట్లు మొదలైతాయని తెలిసినా అడిగాను
“నీకు గుర్తు ఉందా… మనం యూనివర్సిటీ హాస్టల్ కి వెళ్లాం” అని మొదలెట్టారు
ఇదేంటి నేను ఏదో అడుగుతుంటే మా సర్ చెప్తున్నాడు. నిద్రలో ఉన్నట్టు ఉన్నారు అనుకున్నాను.
నా భావం బయటకు కనపడక గుర్తు ఉంది అన్నట్టు తల ఊపాను.
“ఆ డ్రామా డైరెక్ట్ చేసింది మా గురువే” అప్పటికి కాని నా మట్టి బుర్రకు అర్థం కాలేదు.
మా డ్రామా పర్ఫెక్షన్ కోసం మా సర్ ఎంతగా తపించిపోతున్నారో అని.
మా సర్ పై గౌరవం ఒక్కసారిగా పెరిగిపోయింది. గౌరవం మనసులో పొంగిపోతుంటే ఆయనకు దగ్గరగా కూర్చున్న నేను కాస్త దూరం జరిగాను
ఆయన పక్కన కూర్చునే అర్హత నాలో లేదనుకుంటూ…

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY