ఆ సినిమా చూసినవాళ్లలో కొందరు అనూహ్య పరిస్థితుల్లో చచ్చిపోతూ వుంటారు సినీ మహల్ లో ఏం జరిగింది? సినీ మహల్ రివ్యూ

కృష్ణ అనే సినిమా థియేటర్ లో సీన్ 13 అనే సినిమాను ప్రదర్శిస్తారు.సినిమాను ప్రొజెక్షన్ హాల్ లో నుంచి రికార్డు చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా చనిపోతాడు.మాట్నీ చుసిన కొందరు చెట్టుకు ఉరేసుకుని చనిపోతారు…ఫస్ట్ షో చూసిన వాళ్ళు థియేటర్ లో చనిపోతారు..థియేటర్ క్లోజ్ చేస్తాడు క్రిష్ .అన్వేషణ మొదలుపెడతాడు.ఆ సినిమాలో పనిచేసినవాళ్లు కూడా బ్రతికిలేరన్న నిజం తెలిసి షాకవుతాడు.
సీన్ 13 రీళ్లను తగలబెడుతాడు.అయినా సినిమా రన్ అవుతూనే ఉంటుంది.
సినీ మహల్ సినిమా లో ప్రేక్షకులను కట్టిపడేసే సబ్జెక్టు ఎన్నుకున్నారు.నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా బావుంది.హారర్ జోనర్ లో తీసిన థ్రిల్లర్ …
అసలు సీన్ 13 కు ,సినీ మహల్ లో సినిమా చూసిన ప్రేక్షకులు చనిపోవడాన్ని వున్న లింక్ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే .
హారర్ జోనర్ ని ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే సినిమా గా తీయడానికి సిన్సియర్ గా ప్రయత్నించారు దర్శక నిర్మాతలు…
కొన్ని సన్నివేశాలు నైట్ ఎఫెక్ట్ లో తీస్తే బావుండేది.అర్థరాత్రి సినిమా హాల్ లో నుంచి అరుపులు వినిపించి,అక్కడికి వెళ్లి చూస్తే సినిమా ప్రొజెక్టర్ లేకుండానే రన్ అవుతున్నట్టు చూపించి ఉంటే మరికొంత టెన్షన్ బిల్డప్ అయ్యేది.
రెండు గంటలసేపు థియేటర్ లో ప్రేక్షకులను కూచోబెట్టడం మాములు విషయం కాదు.టీవీలో నెట్ లో వచ్చే సినిమాలధాటికి తట్టుకుని,థియేటర్ లో కూచోబెట్టే సాహసం డబ్బు, సమయం,శ్రమ ప్రతిభ పుష్కలంగా ఉండాలి.వాణిజ్యసూత్రాలతో మినిమం గారంటీ సినిమా తీయాలంటే రిస్క్ చేయాలి.
కథలో కొత్తదనం స్క్రీన్ ప్లే లో మంచి బిగి నటీనటుల పెర్ఫార్మెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటి ఎన్నో అంశాలు ఉండాలి.
కళానిలయ క్రియేషన్స్ ఇలాంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.సినీ మహల్ పేరుతొ హారర్ జోనర్ లో థ్రిల్లర్ గా అందించింది.
తీసుకున్న సబ్జెక్టు లో కొత్తదనానికి ప్రాధాన్యత ఇచ్చింది.ఎక్సయిట్మెంట్ ను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేసింది.
ఈ చిత్రానికి .కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం లక్ష్మణ్ వర్మ,నిర్మాత: బి.రమేష్
అలీఖాన్‌, సోహెల్‌, తేజ‌స్విని, గొల్ల‌పూడి మారుతీరావు, స‌త్య‌, జెమిని సురేష్, షకలక శంకర్ త‌దిత‌రులు తారాగణం కాగా ఛాయాగ్ర‌హ‌ణంః దొరై కె.సి.వెంకట్సంగీతం: శేఖర్ చంద్ర,కూర్పుః ప్రవీణ్ పూడి,కళ: గోవింద్
సహనిర్మాతలు: పార్ధు, బాలాజీ, మురళీధర్, మహేంద్ర

 

NO COMMENTS

LEAVE A REPLY