ఓ ఖైదీని సుమన్ ముందే చితకబాదారు. వాళ్ళేదీ డైరెక్ట్ గా చెబుతున్నట్టు అనిపించడం లేదు…విజయార్కె…సీరియల్ ..ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్(16-04-2017 )

4
పోలీసు స్టేషన్
ఇన్ స్పెక్టర్ అడగడం మొదలెట్టాడు. సుమన్ కు సంబంధించి ప్రతి విషయాన్ని అడిగాడు.
“మీ పేరేమిటి? స్వస్థలం ఏది?? మీ ఫ్రెండ్స్ పేరేమిటి? ఒక్కటేమిటి? సుమన్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని అడిగాడు.
సుమన్ కు ఇవన్నీ ఏమిటో? ఎందుకో?? అర్ధం కావడం లేదు. అయినా యాంత్రికంగా అన్నింటికీ సమాధానాలు చెబుతున్నాడు.
”సార్. ఇంట్లో అమ్మ ఒక్కర్తే ఉంటుంది వెళ్ళాలి” ఇన్ స్పెక్టర్ తో చెప్పాడు సుమన్.
కొన్ని బ్లాంక్ పేపర్లు తీసుకొచ్చాడు ఇన్ స్పెక్టర్.
”వీటి మీద సైన్ చేయండి” అన్నాడు.
”ఎందుకు?” సుమన్ కన్ఫ్యూజన్ లో పడిపోయాడు.
ఓ ఖైదీని సుమన్ ముందే చితకబాదారు. వాళ్ళేదీ డైరెక్ట్ గా చెప్పినట్టు అనిపించడం లేదు.
ఆలోచించుకునే వ్యవధి కూడా లభించలేదు.
తనున్నది పొలిసు స్టేషన్ లో.
అందులో అర్ధరాత్రి.
బయటపడాలంటే వాళ్ళు చెప్పినట్టు చేయడంతప్ప గత్యంతరం లేదు అనుకుంటూ.
బ్లాంక్ పేపర్లమీద సంతకం చేశాడు.
అంతే కొద్దీ సమయం తర్వాత సినిమాట్రిక్ లా జరిగిందది!
”యూ ఆర్ అండర్ అరెస్ట్” అన్నాడు ఇన్ స్పెక్టర్ హఠాత్తుగా.
”ఎందుకండీ?” సుమన్ లో ఓవైపు అయోమయం, మరోవైపు ఆవేశం.
”తరువాత తెలుస్తుంది” వెళ్ళిపోయాడు ఇన్ స్పెక్టర్.
ఇద్దరు కానిస్టేబుల్స్ వున్నారు.
సుమన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనకు బ్రేక్ పడింది. తను అనవసరంగా ఇందులో చిక్కు పడిపోయాడు.
* * *
నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
పూజాగదిలో కూర్చున్నది సుమన్ తల్లి.
క్షణాలు…నిమిషాలు…గంటలు…
కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తోందా తల్లి.
చిరునవ్వడైనా బాబూ వచ్చావా? అని ప్రశ్నించాలనే తపన. అక్షరాల్లోకి తర్జుమా చేయలేని కన్నతల్లి ఆరాటం ఆ గదిలో నిస్సహాయంగా నిలబడిపోయింది.
ఎదురుగా షిరిడి సాయిబాబా విగ్రహం. బాబా ముందు మోకరిల్లిందామె.
* * *

సరస్వతి వేషం!
ఓసారి ఫ్యాన్సీ డ్రస్ కాంపిటీషన్ జరుగుతోంది- చిల్డ్రన్స్ డే నాడు. నేను సరస్వతి వేషం వేసి వీణ పట్టుకుని పెర్ ఫార్మెన్స్ ఇచ్చాను. అందరూ ‘ఈ అమ్మాయి బాగుంది’ అంటూ బుగ్గ గిల్లి మెచ్చుకున్నారు.
అలాగే ఇంటికి వెళ్ళాను. మా మమ్మీ కూడా నన్ను గుర్తుపట్టలేదు. ‘పాప బాగుంది’ అంటూ బుగ్గమీద ముద్దు పెట్టుకుని ఎందుకో అనుమానం వచ్చి ‘ఒరేయ్ నువ్వా కన్నా’ అంది ఆశ్చర్యపోయి చూస్తూ. ఎంతైనా అమ్మకదా? గుర్తుపట్టింది కొద్దిసేపట్లోనే. మా అమ్మకు నేనొక్కణ్నే కాబట్టి కూతుర్ని కూడ నాలో చూసుకుంది. నన్ను గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంది.
ఇప్పటికి ఆ సంఘటన గుర్తుకు వస్తే అదో అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది.

మేన్ రోబో పాఠకుల కోసం పునః ప్రచురణ
ఈ పుస్తకం కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులో వుంది.
ఆంధ్రభూమి వీక్లీలో ఈ సీరియల్  వస్తోన్న సమయంలో (1991 ప్రాంతంలో) ఈ సీరియల్ చదివిన పాఠకులు అప్పటి అనుభవాలను షేర్ చేసుకోవచ్చు.
ఈ పుస్తకం కావాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చేయండి

http://preview.kinige.com/previews/7800/PreviewJailuGodalaMadhyaHeroSuman36533.pdf

NO COMMENTS

LEAVE A REPLY