“ఉమా …నీకు నచ్చానా…”ఆమె తల మీద ముద్దు పెట్టుకుంటూ..అచ్చంగా అరవై ఏళ్ళ క్రితం అడిగినట్టు అడిగాడు… “రోజు ఉదయించే ఆ సూర్యుడిని..నా గుండె లో ప్రతీ క్షణం ఉదయిస్తూనే వుండే ఈ విభాకరుడిని…ఎలా మర్చిపోతాను…మాటలతో కాదు చెక్కిలి నుంచి రాలి పడిన కన్నీటితో చెప్పింది…విజయార్కె …కాలం చెప్పిన సరసమైన కథ

విపుల మాసపత్రిక ఫిబ్రవరి (2017)సంచికలో ప్రచురితమైన కథ

నేను కాలాన్ని
వర్తమానాన్ని…గతాన్ని….భవిష్యత్తును …
చరిత్రను పురాణాలను ఇతిహాసాలను…
నా కాలగర్భంలో పదిల పర్చుకున్నాను…
నేను నిరంతరం కదిలే కాల ప్రవాహాన్ని…కోటాను కోట్ల జీవులు,ప్రాణులు,చెట్లూ చేమలు నా ముందు పుట్టాయి…గిట్టాయి…
యుగాలను చూసాను…మానవుల రాగద్వేషాలను చూసాను…చివరికి వాటి అంతాన్ని చూసాను…
నేను మీకిప్పుడు ఒక కథ చెబుతాను…రతీ మన్మథుల శృంగార కేళీ చూసిన నేను దంపతుల మధ్య నిలిచే అనురాగాలను, కిలికించితాలను భావోద్వేగాలతో వీక్షించాను…
నా (కాలం)ఎదను మీటిన సరసమైన కథ…చదివినంతనే దంపతుల ఆంతరంగిక ప్రపంచం స్వర్గతుల్యం అవుగాక …!
***
ఆ గదిలో …
అతని మదిలో చిన్న అలజడి
అలా అలలా వచ్చి సెలయేరులా చుట్టేసింది.బ్రహ్మచర్యానికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది.అగరొత్తులు ధూపం బద్దకంగా ఒళ్ళు విరుచుకునే ప్రయత్నం మొదలుపెట్టింది.
సన్నజాజులు అరనవ్వులతో…అరమోడ్పు కన్నులతో జరుగబోయే సృష్టి కార్యానికి తన పరిమళాలను అందించాడనికి సంసిద్ధమయ్యాయి.నీలిరంగు బల్బు వెలుతురు బ్లూ కార్పెట్ ను పరిచేసింది.
రెండు మనసుల ఒక్కటై .రెండు శరీరాలు ఏకమై.ఒకరిలో మరొకరు మమేకమై…మమజీవన హేతునా…అన్న శుభలగ్న మంత్రాలకు మంత్రముగ్ధమై…
సమాగానికి…సహజీవన ప్రయాణానికి సుముహూర్తం..
సిగ్గులన్నీ దూపానికి వదిలి
బిడియాలను సన్నజాజుల్లో తురిమి…
అచ్చాధనలను గది మూలకు తరిమి…
ఒక్కటవుదామని ఎదుర్చూస్తోన్న క్షణాన …
ఆ గదిలోకి అడుగు పెట్టింది ఆమె.
ఒక్కసారిగా వెన్నెల ఆ గదిలో పర్చుకున్నట్టు అనిపించింది అతనికి.
శోభనం చీరలో,పాలనురగ లాంటి అందాలతో…పాలగ్లాసుతో అడుగు పెట్టింది.పాలగ్లాసు అతని చేతికి ఇచ్చి కిందికి వంగి అతని పాదాలను చేత్తో తాకింది…అతను వెంటనే ఆమె భుజాలు పట్టుకుని పైకి లేపి,మంచం దగ్గరికి తీసుకువచ్చి మంచం మీద కూచోబెట్టాడు.అతను నేల మీద కూచొని ఆమె తెల్లటి పాదాలను తన చేతుల్లోకి తీసుకుని పెదవులతో పలకరించాడు.
ఆమె చప్పున తన పాదాలను వెనక్కి తీసుకోబోయింది.ఆ ప్రయత్నంలో కిందికి వంగింది.అలా కిందికి వంగినప్పుడు ఆమె పైట కిందికి జారింది.మంగళసూత్రం వేలాడుతూ అతని పెదవులను తాకింది.పైట స్థానభ్రంశం చెందడంతో ఆమె ఎద అందాలు అతని శరీరంలో ప్రకంపనాలను సృష్టించాయి.శంఖం లాంటి ఆమె కంఠాన్ని ముద్దు పెట్టుకున్నాడు.ఆమె ఒంట్లో వెచ్చని ఆవిర్లు…
కళ్ళు మూసుకుని తల వెనక్కి వాల్చింది.
అతని చేతి వ్రేళ్ళు నిపుణుడైన సర్జన్ లా ఆమె దుస్తులను శరీరం నుంచి వేరు చేస్తున్నాయి,ఆమె అభ్యంతర పెట్టలేదు…
పెళ్లి చూపుల్లో అతను మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంది.ఆ మాటల వెనుక వున్న నిజాయతీ గుర్తించింది.అందుకే అతనికి సహకరించింది…
***
పెళ్లి చూపుల్లో అమ్మాయితో విడిగా మాట్లాడాలని చెప్పాడు.
పెరట్లో జమ చెట్టు కింద చిలుక కొరికిన జామకాయను చేతిలోకి తీసుకుని సూటిగా ఆమె వంక చూస్తూ అన్నాడు.
“మీకు వంట వచ్చా?పాటలు పాడగలరా?అడిగినంత కట్నం ఇవ్వగలరా ?లాంటి ప్రశ్నలు అడగను…
వైబాహిక జీవితంలో దాంపత్య సంబంధం ఒక అంశం …ఒక కీలకమైన భాగం…మనసుల మధ్య,మనుష్యుల మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా వుండాలి.కేవలం పిల్లల కోసం,వంశం అభివృద్ధి కోసమే కాదు పెళ్లి అని నా ఉద్దేశం.మన ప్రైవసీ మిస్ కాకూడదు.
సెక్స్ అంటే కేవలం లైఫ్ లో ఒక స్టేజ్ వరకు వుండే దశ అనుకోకూడదు.
జీవితాంతం నాకు తోడుగా ఉండగలవా?నా మనసు.శరీరానికి,నా ప్రతీ ఆలోచనకు….అతను ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు.
చిత్రంగా ఆమె సిగ్గు పడలేదు.ఇబ్బంది పడలేదు.పెళ్ళికి ముందు ఆర్ధిక విషయాలు,ఇంటి పనులు,అందం లాంటి విషయాలు మాత్రమే మాట్లాడకుండా మనసులో వుండే ఫీలింగ్స్ ను ఓపెన్ గా తనకు కాబోయే పార్టనర్ కు చెప్పేది ఎంత మంది?
“మీకు నేను నచ్చిన ఈ క్షణం నుంచి మీ ప్రతీ ఆలోచన నాకు నచ్చుతుంది .మీతో ప్రతీ అడుగు సంతోషంగా వేయగలను అనే నమ్మకం వుంది?అని మాటలతో చెప్పలేదు.అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని చేతలతో,తన రెండు చేతులతో పట్టుకుని చెప్పింది.ఆమె
వారం రోజుల్లో పెళ్లి జరిగిపోయింది.
***
అక్కడ బిడియాలు మొహమాటాలు సంకోచాలు లేనేలేవు .
ఆమె శరీరం నుంచి ఒక్కో ఆచ్చాదన వేరైపోతూ వీడ్కోలు తీసుకుంటుంది.తనకు తానుగా తన శరీరం మీద వున్న ఒక్కో అడ్డుతెరను తొలిగిస్తొన్న ఫీలింగ్.
ఆమెను ఆపాదమస్తకం ఒక పుస్తకంలా ప్రతీ పేజీని ఇష్టంగా తిరగేస్తున్నాడు.చివరి పేజీ వరకూ….
తన వక్షాన్ని అతనికి సమస్తంగా మార్చింది. తన పెదవుల్లోని తేనెను అతనికి అందించింది.ఆ రాత్రి అతను నిద్రపోలేదు..ఆమెను నిద్ర పోనివ్వలేదు…ఇద్దరూ..ఒక్కరయ్యారు…
శోభనం అంటే కోరికను చల్లార్చే ఆకర్షణ అనే అపోహ తొలిగిపోయింది.
సెక్స్ అంటే యవ్వనంలో ఒక అవసరం అనే భ్రమ తుడుచి పెట్టుకుపోయింది.
ఇంటర్ కోర్స్ అంటే ఫిజికల్ నీడ్ మాత్రమే అనే చాందసభావం కొట్టుకుపోయింది.
రెండు శరీరాల కలయిలలో ఒక ఉద్వేగం..
రెండు దేహాల రాపిడిలో ఒక వ్యాయామం..
మేని కలయికలో ఒక జీవితకాల సంతృప్తి వున్నాయని అర్థమైంది.
స్విచ్చాఫ్ చేసి చీకట్లో సృష్టి కార్యాన్ని ఒక డ్యూటీ లా ఫినిష్ చేసి,ఆనక ఇద్దరూ చెరో పక్కకు తిరిగి తెల్లారేక అపరిచితుల్లా వుండిపోయి…రాత్రి వేళల్లో మాత్రమే బెడ్ రూం లో డ్యూటీ అన్నట్టుగా యాంత్రికంగా బ్రతికే దంపతుల్లా ఉండకూడదన్న గొప్ప సత్యాన్ని ఆ రాత్రి అతనితో కలిసాక అర్థమయ్యింది.
కాదు అతను అర్థమయ్యేలా చేసాడు.

***
తెల్లవారు ఝామున బద్దకంగా విడిపోయారు…కలిసి షవర్ బాత్ చేసారు.ఆమె వీపు మీద ముత్యాల్లా జరుతోన్న నీటి ముత్యాలను జారిపోనివ్వ కుండా అతను పెదవులతో ఆనకట్ట వేసాడు.
ఎంత గొప్ప కమ్యూనికేషన్ ?ఎంత గొప్ప రొమాంటిక్ మెమోరీ?
ఆమె ఉదయమే టిఫిన్ చేస్తుంటే అతను ఆమె వెనుకగా వెళ్లి ఆమెను చుట్టేస్తాడు.కిచెన్ ఫ్లాట్ ఫాం మీద కూచోని ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకుంటాడు…ఒక్కోసారి కిచెన్ ను బెడ్రూం గా మారుస్తాడు.హల్ లోని కార్పెట్ వాళ్ళ శృంగారానికి యుద్ధక్షేత్రం అవుతుంది.
ఇదంతా ఆమెకు ఆశ్చర్యంగా.అద్భుతంగా అనిపిస్తుంది.
సర్ప్రయిజ్ గిఫ్ట్స్…సరదాల క్షణాలు…అతని చేతులు సంవత్సరంలో మూడు వందల అరవై అయిదు రోజులు భార్య ను స్పర్శిస్తూనే వుంటాయి.
ఇంత కన్నా ఏ భార్య అయినా ఇంకేం కోరుకుంటుంది.?
అందుకే భర్త దగ్గర తను ఏమీ దాచాడు..మనసును,శరేరాన్ని…ఆ రెంటి ద్వారా కలిగే ఫీలింగ్స్ తో సహా….
పొద్దునే బద్దకంగా భర్త లేవడం,వంటగదిలో జిడ్డు మొహంతో భర్తకు అన్నీ అమర్చడం.అతను సాయంకాలాలు ఆఫీసు నుంచి వచ్చి సోఫాలో కూచుంటే భార్య కిచెన్ లో కుస్తీ పడుతూ వుండడం…ఎప్పుడో మూడ్ వస్తే భర్త అనే శాల్తీ దగ్గరికి తీసుకుంటే అతగాడి కోర్కె తీర్చి అటు తిరిగి పడుకోవడం…
అతనితో జీవితం ఏడురంగుల ఇంద్రధనుసులో చేరిన మరో వర్ణంలా వుంది.పిల్లలు పుట్టినా,వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా మనవలు వచ్చినా తమ ఏకాంతాన్ని అతనెప్పుడూ మిస్ కానివ్వలేదు.
అతని దృష్టిలో శేషజీవితం అంటే కోమాలో వుండడం…అప్పుడు కూడా అతను భార్యను మిస్సవ్వలేదు.
అవును..నా సాక్షిగా ,ఈ కాలం సాక్షిగా ఇది నిజం.
***
వాళ్ళ వైవాహిక జీవితంలో యాభై తొమ్మిది వసంతాలు….పూర్తయ్యాయి…
దురదృష్టం అతడిని వెన్నాడింది.భార్య బాత్ రూం లో కాలు జారి పడింది.కోమాలోకి వెళ్ళింది…
అతను సంవత్సరం పాటు ఆమెను అంటి పెట్టుకునే వున్నాడు.ఆమె కళ్ళు తెరిచింది.కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నాయి…కానీ కదలలేదు..కళ్ళు సైతం కదల్చలేదు…
ఆమె కళ్ళు అతడిని మాత్రమే చూస్తున్నాయి.
అరవై ఏళ్ళ క్రితం పెరట్లో జామచెట్టు కింద అతను మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి.ఆమెకు…
అతను భార్య కళ్ళలోకి చూసాడు.అక్కడ నర్స్,డాక్టర్ ,అటెన్డెంట్…
వారి పాటు నేను…కాలాన్ని వున్నాను.
అతను భార్య నుదురు చుంబించాడు…హ్యాపీ మారీడ్ లైఫ్ విషెస్ చెప్పాడు…తన పెదవుల స్పర్శతో…ఆమె తలను పైకి లేపాడు.గుండెలకు హత్తుకున్నాడు…
అక్కడ సెక్స్ లేదు..ఎఫెక్షన్ వుంది…భావోద్వేగాల భావప్రాప్తి వుంది.
నర్స్,డాక్టర్ ,అటెన్డెంట్..అందరూ బయటకు వెళ్లారు…నేను వెళ్ళలేను…వెళ్ళలేదు…నా సమక్షంలో అతను మాట్లాడుతున్నాడు…
“ఉమా …నీకు నచ్చానా…”ఆమె తల మీద ముద్దు పెట్టుకుంటూ..అచ్చంగా అరవై ఏళ్ళ క్రితం అడిగినట్టు అడిగాడు…
“రోజు ఉదయించే ఆ సూర్యుడిని..నా గుండె లో ప్రతీ క్షణం ఉదయిస్తూనే వుండే ఈ విభాకరుడిని…ఎలా మర్చిపోతాను…మాటలతో కాదు చెక్కిలి నుంచి రాలి పడిన కన్నీటితో చెప్పింది…
***
నేను…కాలాన్ని …క్షణ కాలమైనా స్తంభించి పొతే బావుండు అనుకున్నాను…
ఇది నా ఒడిలో సేదతీరిన ఓ జంట సరసమైన కథ…స్వాతి యవనికపై జారిపడిన అక్షరాల వర్ణచిత్రం..
ఇది కాలం చెప్పిన రసరమ్య గాథ..చదివి తరించండి..దాంపత్య జీవితాన్ని పరిపూర్ణం చేసుకోండి.

***

దంపతుల పడగ్గదిలో వుండవలిసిన హార్ట్ టచింగ్ రొమాంటిక్ ఫ్లేవర్ విజయార్కె గుడ్ నైట్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/book/Goodnight+Stories

NO COMMENTS

LEAVE A REPLY