ప్రాక్టీస్ మంచి స్పీడ్ లో సాగుతోంది. ఇలా ఉండగా నాకు మరో చిక్కు వచ్చి పడింది…స్మార్ట్ రైటర్ సురేంద్ర నిన్నటి నేను (16-04-2017)

(గత సంచిక తరువాయి)
స్కూల్ డే దగ్గర పడుతోంది…
మా డ్రామా రిహార్సల్ ముమ్మరంగా సాగుతోంది. రెండు డ్రామాలతో నా ఎంజాయ్ మెంట్ బాగా సాగుతోంది. ముందు మెచ్చుకుంటూ వెనుక నొచ్చుకునే వాళ్ళను పట్టించుకోవడం అనవసరం అని అర్థం అయ్యింది. ఇలా ఉండగా ఒక రోజు మా పి.ఇ.టి సర్ ఒక సర్కులర్ పట్టుకొచ్చాడు…
సైన్స్ ఫెయిర్ కి ఆహ్వానం…
సైన్స్ ఫెయిర్ లో కొత్తగా డ్రామాలను చేర్చారంట. మా స్కూల్ కూడా పార్టిసిపేట్ చెయ్యాలని నిర్ణయించారు. ఇంటర్ స్కూల్ పోటీలలో పాల్గొనాలని కొత్తగా చేరిన పి.ఇ.టి సర్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ ను కన్విన్స్ చెయ్యడం వల్ల మా స్కూల్ కూడా ఆ లిస్టులో చేర్చబడింది.
పి.ఇ.టి సర్ మేము ప్రాక్టీస్ చేస్తున్న రూమ్ లోకి వచ్చాడు.
“మన స్కూల్ ఫస్ట్ టైం సైన్స్ ఫెయిర్ లో పార్టిసిపేట్ చేస్తోంది. అది కూడా డ్రామా కంపిటీషన్ లో.
మీరు బాగా ప్రాక్టీస్ చేసి మన స్కూల్ పేరు నిలబెట్టాలి” అంటూ సర్కులర్ మా డ్రామా సర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయారు
“విన్నారు కదా… మన ప్రాక్టీస్ ఇక రోజంతా ఉంటుంది. వచ్చే వారమే సైన్స్ ఫెయిర్. మనకు ఇదో మంచి అవకాశం. మన కెపాసిటీ మన స్కూల్ కే కాకుండా అన్నీ స్కూల్స్ కి తెలుస్తాయి” అంటూ ఎంకరేజ్ చెయ్యడంతో ఇక మా సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.
ప్రాక్టీస్ మంచి స్పీడ్ లో సాగుతోంది. ఇలా ఉండగా నాకు మరో చిక్కు వచ్చి పడింది.
రెండు డ్రామాల ప్రాక్టీస్… మెయిన్ డ్రామా టైంలో మైమ్ డ్రామా సర్ పిలవడం… రాకపోతే ఏదో వంక పెట్టి అరవడం… మైమ్ డ్రామా ప్రాక్టీస్ లో ఉండగా మెయిన్ డ్రామా కాల్…
ఒక్కటి మాత్రం క్లియర్ గా అర్థం అయ్యింది. మా ఇద్దరు సర్ లకు పడ్డం లేదు. వాళ్ళిద్దరి ఈగో మధ్య నేను బలిపశువు అయ్యాను. రెండు డ్రామాలతో నాకు పేరు రావడం ముఖ్యం. దానికోసం ఎలాంటి ప్రాబ్లం అయినా ఎదుర్కోవడానికి రెడీ అయ్యాను.
ఇలా ఫిక్స్ అవ్వడంతో మా సర్ ఏమన్నా పెద్దగా ఫీల్ కాకుండా ఉండడానికి ట్రై చేసేవాడిని.
మనసులో బాధ ఉన్నా బయటకు చూపించక ప్రాక్టీస్ లో ఉండేవాడిని.
సైన్స్ ఫెయిర్ డేట్ రానే వచ్చింది..
రెండు రోజుల్లో మా డ్రామా డేట్ ఫిక్స్ అయ్యింది. మా పి.ఇ.టి సర్ మా డ్రామా చూడడానికి వచ్చాడు.
డ్రామా స్టార్ట్ అవ్వడానికి ముందే తన స్పీచ్ స్టార్ట్ చేశాడు.
“మీరు ఎలా ప్రాక్టీస్ చేసారో నాకు తెలీదు కాని మనం అక్కడ సరిగ్గా చెయ్యకపోతే మన స్కూల్ పేరు పోతుంది. మీరు ఎలా చేస్తారో అన్న టెన్షన్ ఉంది” అనడంతో మాకు మతిపోయింది.
అతను ఎంకరేజ్ చేస్తున్నాడో లేక డిస్కరేజ్ చేస్తున్నాడో తెలీకుండా పోయింది. ఎలా అయినా మా టీం ఫీల్ అవ్వడం నేను గమనించాను. మా డ్రామా సర్ కి కూడా ఆ మాటలు రుచించినట్టు కనిపించలేదు.
“ఏం పరవాలేదు సర్. మేము బాగా ప్రాక్టీస్ చేశాం. బాగా చేస్తాం మీరు ఏమి టెన్షన్ పడకండి” అంటూ నేను మా టీంను కవర్ చెయ్యడంతో మా డ్రామా సర్ పేస్ లో ప్రశంసాపూర్వకమైన నవ్వు కనిపించింది.
మా పి.ఇ.టి సర్ అపనమ్మకంగా మా వైపు చూశాడు. అతని బాధ నాకు అర్థం అయినా ఎంకరేజ్ చెయ్యవలసిన స్టూడెంట్స్ ను డిస్కరేజ్ చెయ్యడం నాకు అస్సలు నచ్చలేదు.
“మీరు డ్రామా ఒక్కసారి చూడండి. మీకే అర్థం అవుతుంది” అంటూ సిట్యువేషన్ లైట్ చేశాను.
సరే అన్నాడు కాని ఎందుకో పేస్ లో డౌట్ మాత్రం పోలేదు.
మా డ్రామా స్టార్ట్ చేశాం. ప్రాక్టీస్ వల్లనో లేక ఆయన అన్న మాటలకు ఫీల్ అవ్వడం వల్లో తేలేదు కాని డ్రామా ఆద్యంతం మా టీం కసిగా చేశారు.
అప్పటికి కాని మా పి.ఇ.టి సర్ పేస్ లో కాన్ఫిడెన్స్ కనపడలేదు
***

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY