నో ఎండ్ అనే అక్షరాలు కీ బోర్డు మీద టైపు చేస్తుంటే మూడుసార్లు పవర్ పోయింది.సరిగ్గా “నో ఎండ్” అని టైపు చేస్తున్నప్పుడే…

రివ్యూ
ఈ పుస్తకంలో రచయిత రాసిన ముందుమాట …
నో ఎండ్
కొన్ని కథలకు నో ఎండ్
హారర్ కథలకు ,ఆసక్తి కలిగించే సంఘటనలు..విచిత్రవార్తలకు నమ్మలేని నిజాలకు ఒళ్ళు గగుర్పొడిచే సంగతులకు నో ఎండ్.
నో ఎండ్ అనే అక్షరాలు కీ బోర్డు మీద టైపు చేస్తుంటే మూడుసార్లు పవర్ పోయింది.సరిగ్గా “నో ఎండ్” అని టైపు చేస్తున్నప్పుడే…
ఇది కాకతాళీయమే కావచ్చు.
అర్థరాత్రి పదకొండున్నరకు స్క్రిప్ట్ ఫినిష్ చేసాక…ఓ నల్ల పిల్లి కంప్యూటర్ టేబుల్ పక్కనుంచి మ్యాప్ అంటూ నావైపు చూసి పరుగెత్తడం యాదృశ్చికమే కావచ్చు.
కిందికి వచ్చి బైక్ స్టార్ట్ చేయగానే హెడ్ లైట్ వెలుతురులో ఒక్కసారిగా ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించి,కనిపించి మాయమవ్వడం భ్రమే కావచ్చు.
కానీ మనం ఆలోచిస్తే ప్రతీది మనకు …మన నమ్మకానికి అనుగుణంగా విజువలైజ్ అవుతుందేమో…
అతను వల్లకాడు అనే ఊళ్ళో ట్రైన్ దిగాడు.ఊళ్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు.రాత్రంతా పేకాడి ఓడిపోయాడు.మరోసారి పేకాడుతానంటే అవతలి వ్యక్తి “నాకు ట్రైన్ కు టైం అయ్యిందంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళాడు.అతను ఒళ్ళువిరుచుకుని లాంతర్ వెలుగులో టేబుల్ మీద పరిచిన పాత దీనిపత్రిక చూసి షాకయ్యాడు.(టక్ టక్ టక్)
* అమ్మాయి భయంతో పరుగెడుతోంది.తెల్లగా పాలిపోయిన మొహం..భయంకరమైన చూపులు…అమ్మాయి గొంతులోకి కోరల్లాంటి పళ్ళను దించి రక్తంతాగే రక్తపిశాచి …డ్రాక్యులా
డ్రాక్యులా పేరు వినగానే ఎవరి గుండెయినా దడదడలాడుతుంది. శతాధిక సంవత్సరాలుగా పాఠకులను, ప్రేక్షకులను భయపెడుతున్న పాత్ర అది. మనిషో రాక్షసుడో తెలియనంత క్రూరత్వం ప్రదర్శించే ఆ డ్రాక్యులా సృష్టికర్త …ఎవరో తెలుసా?
*ఎప్పుడో మూడువందల సంవత్సరాల క్రితం నాటి మమ్మీ కళ్ళు తెరిస్తే…ఒక్కక్షణం ఒళ్ళు గగుర్పొడుస్తుంది..
మెక్సికోసిటీలో అదే జరిగింది
*నాకు తెలిసి నేను చచ్చిపోయా.. మనిషి కాదు రక్త ‘పిశాచి’ ..వాంపైర్ అంటున్నదెవరు?బొమ్మకు డెడ్‌ ఫెస్టివల్‌! *అనుక్షణం ఎవరో వెంటాడుతున్నట్టు….*ఆఫ్రికాలోని మత ఆచారాలు, విశ్వాసాల నుంచి ఏర్పడిందే ‘వూడూ’ మంత్రవిద్య.*భయంకరమైన దెయ్యాల పండుగ
*హారర్ సాహిత్యాన్ని ఆసక్తిగా చదివే పాఠకులకు,వర్తమాన రచయితల కోసం….
ప్రముఖ రచయిత విజయార్కె రాసిన హారర్ ఎంటర్టైనర్ టక్ టక్ టక్ లో ఆసక్తి కలిగించే హారర్ విషయాలు విశేషాలు వున్నాయి.
హారర్ సాహిత్యాన్ని ఆసక్తిగా చదివేవారికి మంచి కాలక్షేపం.
ఇప్పుడు పుస్తకాల షాప్ కు వెళ్లడం కొనుక్కోవడం.పుస్తకాన్ని క్యారీ చేయవలిసిన అవసరం లేదు.మీరు ఇతరరాష్ట్రాల్లో వున్నా,విదేశాల్లో వున్నా డౌన్ లోడ్ చేసుకుని తీరికసమయాల్లో చదువుకోవచ్చు.
ఈ పుస్తకం కావలిసిన వారు పుస్తకంలోని కొంతభాగాన్ని ఫ్రీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు,పుస్తకం నచ్చినపక్షంలో కొనుక్కోవచ్చు.
టక్ టక్ టక్
Tak Tak Tak
Author: Vijayarke
Publisher: Manrobo Publications
Buy eBook
₹ 63 ₹ 70
10% discount
Gift this eBook
Free PDF ప్రివ్యూ

http://preview.kinige.com/previews/7800/PreviewTakTakTak37673.pdf

NO COMMENTS

LEAVE A REPLY