హుషారుగా ఓ ఇంటి ముందు నిలబడ్డాడు .నేమ్ ప్లేట్ మీద పేరు చూశాడు …వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ శ్రీ&శ్రీమతి (23-04 -2017)

  (3)

”హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆఫీస్ కి బయలుదేరింది చందన ”కాస్తా టిఫిన్ చేసి వెళ్ళమ్మా” అంది యశోద, ”అక్కరలేదు” అంటూ తొమ్మిదేళ్ల తమ్ముడి వైపు తిరిగింది.పోలియో వచ్చి కాలు చేయి పడిపోయింది.
”ఒరేయ్… చంటీ …నీకేం కావాలో అన్నీటిఫిన్ లో సర్ది పెట్టాను .ఈ ఇంట్లో నేను వెళ్ళగానే నిన్ను ఎవరైనా ఏమైనా అంటే చెప్పు ” అంది యశోద వైపు చూస్తూ .
ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి .”అదేమిటమ్మా …వాడు మాత్రం నాబిడ్డ కాదా ?నేను పేరుకి పిన్నిని కానీ నీకు తల్లిలాంటిదాన్ని అమ్మా ”అంది.
”చూడు యశోదమ్మా…నువెప్పుడు నా తల్లివి కాలేవు .అయినా ఆయనకు సిగ్గులేదు ,భార్య చావగానే రెండో పెళ్లి కావాల్సి వచ్చింది .నీకేమైంది .పెళ్ళాం చచ్చిన ముసలి మొగుడే కావాల్సి వచ్చాడా ?
కలుక్కు మంది యశోదమ్మ మనస్సు.
”అమ్మా చందు …అప్పటి వరకు పక్కగదిలో వున్న శివరాం బాధగా బయటకు వచ్చాడు .
”చూడునాన్నా , మాఅమ్మకు భర్తవన్న ఒకే ఒక్క కారణంగా నిన్ను ‘నాన్నా ‘అని పిలుస్తున్నాను .సవతి తల్లి లక్షణాలు చూపించే , నాతమ్ముడికేమైనా అన్యాయం జరిగిందా నీ భార్యను వదిలి పెట్టను.ఆ విషయం నీ భార్యతో చెప్పు ”అంటూ విసవిసా బయటకు వచ్చేసేంది.
”ఏమండి …యశోద కళ్ళలో నీళ్లు ఆగడం లేదు.”
”నేను చేసిన తప్పేమిటండి…మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమేనా? నా తండ్రి మీద కుంపటిలా ఉండడం ఇష్టం లేక, మీ పిల్లలే నా పిల్లలు అనుకున్నాను .
ఎప్పుడు బుజ్జి గాడిని సవతి కొడుకులా చూడలేదండి.మన ఇద్దరి పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.
నాకు వంశీ పెద్ద కొడుకు ,చంటీగాడు రెండో బిడ్డ . ఆ తర్వాత భవేష్ ,భావిక లండీ” 
అంది భర్తను చుట్టుకుపోయి .
”ఊర్కో …యశోదా దానిది తెలిసీ తెలియనితనం అదే నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది .
భార్యను ఓదార్చాడు శివరాం .
కనీళ్ళు తుడుచుకుంది యశోద.చిట్టి గది దగ్గరకెళ్ళి పొడిగుడ్డను నీళ్లలో తడిపి అతని మొహాన్ని తుడిచింది .
”పిన్ని ఎంతమంచిది,అక్కకు ఎందుకో పిన్ని అంటే కోపం”పిన్ని అన్నం కలిపి నోట్లోపెడుతుంటే తింటూ అనుకున్నాడు తోమిదేళ్ల చంటి 
అన్నయ్యా…ఇవ్వాళ మనం కొత్త ఆట ఆడుకుందాం …భావిక ,భవేష్ ఇద్దరు వచ్చారు .
యశోధ భర్త గది వైపు నడిచింది అన్నం వడ్డించడానికి. 
పెద్ద బాగ్ భుజాన వేసుకున్నాడు చరణ్ .
సినిమాలో చూడడమే తప్ప ,ఈ డిటర్జెంట్ బిళ్లలు,పౌడర్,ఎలా సేల్ చేయాలో అర్థం కాలేదు 
రకరకాలుగా ఆలోచించి ఓ పద్ధతి కనిపెట్టాడు .
హుషారుగాఓ ఇంటి ముందు నిలబడ్డాడు .నేమ్ ప్లేట్ మీద పేరు చూశాడు .
మిస్టర్ తిక్కేశ్వర్ రావు ఆర్మీ రిటైర్డ్ అని ఉంది.
కాలింగ్ బెల్ నొక్కాడు చరణ్.
మరో ఐదు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది.
ఎదురుగా ఓ వివాహిత స్త్రీ ,వయసు ముప్పయ్ ఉంటుంది,చరణ్ ని చూస్తూనే కొంగు నిండుగా చుట్టుకొని ”అయన లేరువచ్చాక రండి” అంది.
”నేను మీ కోసం వచ్చాను” అన్నాడు తలుపుకు అడ్డంగా నిలబడి .
”హా…”
”అదే… నా ఉద్దేశం…ఇలాంటి వన్నీ ఇంట్లో ఆడవాళ్లే చూసుకుంటారుగా”
”అయోమయంగా చూసింది

(ఆ అయోమయానికి అర్థం తెలుసుకోవాలంటే వచ్చేవారం వరకూ వెయిట్ చేయాలి)

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY