చివర పెడితే ఎవరైనా ఉంటారో లేదో అన్న అనుమానం మొదలైంది. ఎవరూ లేకుండా ఎలా?…స్మార్ట్ రైటర్ సురేంద్ర నిన్నటి నేను (30 -04-2017)

(గత సంచిక తరువాయి)
స్నాక్స్ రూమ్ లో ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్నవారిని చూసి మొదట ఆశ్చర్యపోయాను. అంతా మన వాళ్ళే… నాకన్నా ముందుగా వచ్చి పడి తింటున్నారు.
అక్కడ సప్లై చేసేవాడు కూడా మా క్లాస్ మేట్ అవడంతో ఇక మనకు దిగులు లేకుండా పోయింది.
స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేయించి తిండి మీద పడ్డాం. 15 నిముషాల తరువాత తృప్తిగా బయటపడి మా డ్రామా కోసం వెయిట్ చేస్తున్న టీం వద్దకు చేరాను. అప్పటికే మా సర్ నన్ను వెదుకుతూ ఉన్నాడు.
ఏదో ఒక సాకు చెప్పి దెబ్బలు తినకుండా తప్పించుకున్నాను.
స్కూల్ డే లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరిని స్టేజి వెనుక ఉన్న స్క్రీన్ వద్ద కూర్చోపెట్టారు.
ఒక్కో ప్రోగ్రాం పిలుస్తుంటే ఒక్కో టీం స్టేజి పైకి వెళ్లి పర్ ఫార్మ్ చేస్తున్నారు. మధ్యలో చీఫ్ గెస్ట్ స్పీచ్, ప్రముఖుల ఉపన్యాసం లాంటివి ప్రోగ్రామ్స్ కి బ్రేక్ ను ఇస్తున్నాయి.
మా డ్రామా గంట పైగా ఉన్న ప్రోగ్రాం కాబట్టి చివర పెట్టారు. అంత చివర పెడితే ఎవరైనా ఉంటారో లేదో అన్న అనుమానం మొదలైంది.
ఎవరూ లేకుండా ఎలా?
చివర పెడితే ఎవరైనా ఉంటారో లేదో అన్న అనుమానం మొదలైంది.
ఎవరూ లేకుండా ఎలా?
ఎక్కడా లేని నీరసం నన్ను పట్టుకుంది…
ఇంతలో పిలుపు వచ్చింది…
స్టేజి పైన నన్ను పిలుస్తున్నారు….మేకప్ వేసుకుని కూర్చున్నా… వెళ్ళాలా వద్దా…
నన్ను మా ఫ్రెండ్స్ బలవంతంగా స్టేజి పైకి తోసారు.
ఇంతకూ ఎందుకు పిలిచారో అర్థం కాకుండా స్టేజి పైన నిలుచున్నా…
ఇంతలో మా ఫ్రెండ్ కూడా స్టేజి ఎక్కాడు…
అతణ్ణి చూడగానే అప్పుడు అర్థం అయ్యింది.
నన్ను స్టేజి పైకి పిలవడానికి కారణం, నేను సైన్స్ క్విజ్ లో గెలవడమే.. నేను మా ఫ్రండ్ పార్టిసిపేట్ చేసిన క్విజ్ పోటీలో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. లైఫ్ లో ఫస్ట్ టైం స్టేజి పైన బహుమతి అందుకోవడం…
థ్రిల్లింగ్ గా అనిపించింది.
మేకప్ లో నన్ను మా ఫ్రండ్ విచిత్రంగా చూశాడు. బహుశా వాడికి నేను డ్రామాలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసినట్టు లేదు.
నాది రెండు డ్రామాలు కావడంతో మొదటి డ్రామా మేకప్ తో రెడీగా ఉన్నా… అది అవ్వగానే వెంటనే మేకప్ తీసేసి మరో మేకప్ వేసుకోవాలి… కారణం… రెండో డ్రామా నా రోల్ తోనే స్టార్ట్ అవుతుంది.
***
కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అంటూ అనౌన్స్ మెంట్ వినిపించింది…
చిన్న పిల్లల ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతలో మాకు స్నాక్స్ వచ్చాయి… అవి చూడగానే ప్రాణం లేచి వచ్చింది. స్నాక్స్ తగ్గినట్టు ఉన్నాయి అంటూ స్నాక్ వద్ద ఉన్న టీచర్ మా సర్ తో అనడం మాకు బాగానే వినిపించింది.
కారణం మేమే అని మాకు తప్ప ఎవరికీ తెలియదు. మేము కూడా ఏమి ఎరుగనట్టే స్నాక్స్ తినడంలో బిజీ అయ్యాం.
ఇంతలో అనౌన్స్ మెంట్
“రైలు ప్రయాణం నాటకం” . నటించేవారి పేరు చెప్పలేదు. కారణం అప్పుడు అర్థం కాలేదు. అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు.
తింటున్న ప్లేట్ ను పక్కకు నెట్టి నన్ను స్టేజి పైకి తోసారు..
డ్రామా స్టార్ట్ అయ్యింది…

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY