సరిగ్గా నెల తరువాత సుమన్ ను గుండాస్ యాక్ట్ కాంపౌండ్ లో అంటే క్లోజ్ ప్రిజన్ లోకి పంపించారు… విజయార్కె సీరియల్ ..ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్(07-05-2017 )

7
చాలా మంది లాయర్లు వెనుకంజ వేశారు.
సుమన్ కేసును టేకప్ చేయడమంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడమేఅనే భయం..కావచ్చు… బహుశా అందుకేనేమో ఎవ్వరూ ముందుకు రాలేద్దు.
ప్రతిరోజూ లాయర్లను సంప్రదించడానికి ముందు బాబాను వేసుకునేది.సుమన్ అమ్మగారు
ఆ రోజూ ప్రముఖ లాయర్ జి. రామస్వామిగారిని కలిసింది.
కేసు విషయం అర్ధం చేసుకున్న లాయర్ హృదయం ఆర్ద్రమైంది. అప్పటికే సుమన్ కేసు పేపర్లలో చదివాడు
”చూడమ్మా తల్లి గుండెకోతను అర్ధం చేసుకోగలను. మీ అబ్బాయి కేసును నేను టేకప్ చేస్తాను. అతను నిర్దోషి అని నాకనిపిస్తే ఆ కేసును నేను వాదిస్తానమ్మా ” అన్నారాయన.
జి.రామస్వామిగారు జి ఆర్ గా తమిళనాడులో ప్రఖ్యాతిగాంచిన న్యాయవాది.
* * *
లాయర్ జి.రామస్వామిగారు సుమన్ ను కలుసుకున్నారు.
”మీ కేసు నేను టేకప్ చేస్తాను. అయితే ఒక కండిషన్. డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర ఏది దాచకూడదు. ఏం జరిగిందో మొత్తం నాకు తెలియాలి. అందులో మీ తప్పు ఎంత ఉందొ తెలియాలి. నిజాలు అన్నీ నాకు తెలిస్తే నేను కేసును వాదించి గెలిపించగలను.”
”సార్ మీరు నా కేసును టేకప్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. మీ ముందు నేను దాచిపెట్టేది ఏమి లేదు.. ఒక్కటి మాత్రం చెప్పగలను. నేను నిర్దోషిని” అన్నాడు సుమన్.
”ఒక వేళ తర్వాత తెలిస్తే నేను చేయగలిగింది ఏమి ఉండదు” సుమన్ నుండి నిజాన్ని రాబట్టడానికి మరోసారి ప్రయత్నం చేశారు లాయర్ జి.ఆర్.
తానూ నిర్దోషినని మరింత దృఢంగా చెప్పాడు సుమన్.
”ఓకే ఆల్ రైట్ నేను మీ కేసు టేకప్ చేస్తాను” అంటూ డిటైల్స్ తీసుకున్నారు. వెళ్లేముందు మరోసారి హెచ్చరించారు లాయర్ జి. ఆర్
సరిగ్గా నెల తరువాత సుమన్ ను గుండాస్ యాక్ట్ కాంపౌండ్ లో అంటే క్లోజ్ ప్రిజన్ లోకి పంపించారు.

క్లోజ్ ప్రిజన్ లో ఎవరేఉంటారంటే…
(మిగితా వచ్చేవారం)
ఆంధ్రభూమి వీక్లీలో ఈ సీరియల్ వస్తోన్న సమయంలో (1991 ప్రాంతంలో) ఈ సీరియల్ చదివిన పాఠకులు అప్పటి అనుభవాలను షేర్ చేసుకోవచ్చు.మేన్ రోబో లో ప్రచురణ నిమిత్తం పంపించవచ్చు.

manrobocreations@gmail.com
మేన్ రోబో పాఠకుల కోసం పునః ప్రచురణ

ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్
ఈ పుస్తకం కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులో వుంది.
http://kinige.com/book/Jailu+Godala+Madhya+Hero+Suman

NO COMMENTS

LEAVE A REPLY