”గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది” 1997 లో స్వాతి మంత్లీ లో వచ్చిన నవల అమ్మ ఆవేదనకు అక్షరచిత్రం…అమ్మ చూపించిన ఒక పరిష్కారం.

”దేవుడు విషాదాన్ని సృష్టించి, కంటి తుడుపుగా ‘ఓదార్పు’ ను సృష్టించాడు.
* కాఫీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయిట …కాఫీ తగ్గించకూడదా?”
”గుండెపోటు కాఫీ తాగడం వల్ల రాదు. కొడుకు ప్రేమగా చూసుకోకపోతే వస్తుంది. కోడలు బిడ్డలా ఆలోచించలేకపోతే వస్తుంది”
*ఇద్దరు కసాయివాళ్ళు ఈ మేక నాకు కావాలంటే నాక్కావాలని గొడవ పడుతుంటే ఆ మేకపిల్ల ఎలా విలవిల్లాడిపోతుందో, ఆ తల్లి కూడా అలానే విలవిలలాడిపోయింది.
*ఓ దేవుడా నీకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు. కృతఘ్నులైన కొడుకులనిచ్చి, కొండంత దేవుడైన భర్తను తీసుకెళ్లి, నా బాధను చూడలేక, నాకు అండగా ఓ తండ్రిని ఇచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రభూ.
*మళ్ళీ జన్మంటూ వుంటే గొడ్రాలుగా పుట్టించు దేవుడా! అని దేవుడ్ని మనస్ఫూర్తిగా వేడుకుంది.
*అక్కడున్న సమాధులను కదిలిస్తే ఎన్ని కథలు వెతలుగా చెబుతాయో, అక్కడ తగలబడుతున్న చితులను అడిగితే ఎన్ని కన్నీళ్ళను అక్షరాలుగా అనువదిస్తాయో…?
**అదో స్మశానం ..దాన్ని అనుకుని శరణాలయం..స్మశానమే వారికి దేవాలయం…
చితికి నిప్పంటించి చేతులు దులుపుకుని అయినవాళ్లు వెళ్ళిపోతే,ఏమీకాని అతను ఆ చితిలో దేహం బూడిదగా మారేవరకు అక్కడే ఉంటాడు బసవప్ప…
వాసంతి ఒక జర్నలిస్ట్ …శరణాలయంలో ఉన్నవాళ్ళ కథలను సీరియల్ గా రాస్తోన్న తనకు ఒక కొత్త కథ తెలుస్తుంది…ఏమిటా కథ..?
ఒక కొత్త ఒరవడిలో.తిరగబడిన మాతృమూర్తి విశ్వరూపం నిర్ణయం నవల.
ఈ నవలలో ఇప్పటికీ నాకు బాగా నచ్చిన నేను రాసిన కొన్ని వాక్యాలు నన్ను వెంటాడుతూనే వున్నాయి.
ఇరవయ్యేళ్ల క్రిందట 1997 లో ఈ నవల రాస్తున్నప్పుడు .భవిష్యత్తు తరంలో బిడ్డల నిరాదరణ వల్ల అనాథలుగా మారిన తల్లిదండ్రులు వుండకూడదనుకున్నాను.పసితనంలో గుండెల మీద ఆడుకునే బిడ్డ చిట్టిచిట్టి పాదాలతో తన్నినా “అయ్యో నీ పాదాలు కందిపోయాయా?అంటూ ,తల్లి/తండ్రి తల్లడిల్లిపోతారు.
అదే బిడ్డలు చెట్టంత ఎదిగి తలిదండ్రుల గుండెల మీద నిర్ధాక్షిణ్యంగా తన్నేస్తే,ఆ తల్లి/తండ్రి ఇంకా త్యాగమే శరణ్యమని కన్నీరు కారుస్తూ మిన్నకుండిపోవాలా ? తిరగబడి పిల్లల తప్పులను తర్జనితో చూపి కనీసం రేపటితరం పిల్లలైనా దారితప్పకుండా ఓ దారి చూపాలా?
స్వాతి మంత్లీ లో అనుబంధ నవలగా వచ్చిన నిర్ణయం,ఆ వెంటనే కన్నడ పత్రిక రాగసంగమలో ధారావాహికగా,అటుపై మధురప్రకాశన పబ్లికేషన్స్ ద్వారా నవలగానూ వచ్చి తెలుగుకన్నడ పాఠకుల అభిమానాన్ని స్వంతం, చేసుకున్న నిర్ణయం…
ఇప్పుడు మీ ముందుకు వచ్చింది….
మీ కోసం నిర్ణయం నవల లింక్…

http://preview.kinige.com/previews/7900/PreviewNirnayamVijayarke32762.pdf

అందుబాటులో వున్న విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/author/Vijayarke

NO COMMENTS

LEAVE A REPLY