“నీ లైఫ్ లో ‘హాఫ్’ పార్ట్ నర్ ని కదా! అందుకే ” అంటూ …వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ శ్రీ &శ్రీమతి (28-05 -2017)

8

రోజులు గడుస్తున్నాయి.
చందన ఆఫీస్ కి దగ్గరలోనే చరణ్ ఆఫీస్,రోజు ఇద్దరు కలిసే వెళ్తున్నారు
సాయంత్రం కాగానే చరణ్ రావటం ఆలస్యమైనా చందన వెయిట్ చేస్తుంది .ఇద్దరు కలసి కాసేపు ఈవినింగ్ వాక్ చేసి ఇంటికి వెళ్తున్నారు.
కంపెనీ అతి కష్టం మీద నడుస్తుంది .యాభై సంవత్సరాలు ఈ వ్యాపారం లో వున్న నటేశన్ కు కంపెనీ మూసి వేయడం ఇష్టం లేదు. అందుకే కంపెనీ నష్టాల్లో వున్నా నడిపిస్తున్నాడు .
మరో వారం లో మంచి ముహుర్తాలు ఉన్నాయని తెలిసింది.
చందన తండ్రి తో ఈ విషయం చెప్పింది .
“నేనూ చరణ్ ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం, వచ్చే వారంలో మంచి ముహుర్తాలున్నాయట, కూతురికి పెళ్లి చేయాలనే ఆలోచన ఉంటే ముహూర్తం చూసి పెళ్లి చేయండి.. ,లేదంటే ఏ గుడిలోనో పెళ్లి చేసుకుంటాం.
విస్తు పోయాడు కూతురి ప్రవర్తనకు శివరాం ,ఆవూరిలో వున్న బాల్య మిత్రుడు లాయర్ పరాంకుశాన్ని పిలిచాడు.
పరాంకుశం అంటే అభిమానం చందనకు. లాయర్ అంకుల్ అంటూ పిలుస్తుంది.కూతురి ప్రవర్తన పూసగుచ్చినట్లు చెప్పాడు
“చిన్నప్పట్నుంచి నీకు అమ్మాయి సంగతి తెలుసుగదరా.పిల్లలను చూడడానికి ఓ తోడు ఉంటుందని నువ్వు పెళ్లి చేసుకున్నావు ,కానీ సవతి తల్లి అంటే పిల్లలను రాచిరంపాన పెడుతుందని వుద్దేశం,అయినా పెళ్లి చేసుకోవటం మంచిదేగా… ఆ కుర్రాడ్ని పిలిపించి మాట్లాడుదాం”అన్నాడు పరాంకుశం.
తర్వాత చందన తో మాట్లాడాడు .
పెళ్లి ముహూర్తం కుదిరింది.
యశోద పెళ్లి హడావుడిలో వుంది .పెళ్లి సింపుల్ గా జరగాలని అనవసరమైన ఖర్చులు వద్దని పట్టుబట్టింది చందన.
***
పెళ్ళి సింపుల్ గా జరిగింది.
చంటిగాడిని కూడా తీసుకెళ్తానంది చందన.
యశోద ఎన్నో విధాలుగా నచ్చజెప్పింది “కొత్తగా పెళ్లయిన వాళ్ళ మధ్య మూడో వ్యక్తి వద్దని చెప్పింది ,పైగా ఉండేది ఊళ్ళోనే కాబట్టి రోజు తమ్ముడ్ని చూసుకొని పోవచ్చని చెప్పింది,యశోదమ్మ మాటలు చందన ఖాతరు చేయలేదు .
లాయరు పరాంకుశం చెప్పిన మీదట అంగీకరించింది
చరణ్ వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.
“ఒరేయి చరణ్…ఇంత మిత్ర ద్రోహం చేస్తావనుకోలేదు” ఏడుపు మొహంతో అన్నాడు ప్రసాద్.
“ఎందుకేడుస్తావురా…నువ్వు మాతో పాటు వుండు ” అన్నాడు చరణ్ చందన వైపు చూసి.”అవును ప్రసాద్ …అంది చందన.
“వద్దమ్మా…ఏదో సరదాకు అన్నాను.నేనుకూడా త్వరలో పెళ్ళి చేసుకుంటాను.అంతవరకూ మాఊరెళ్ళి వస్తాను.మా పెళ్ళి గురించి పెద్ద వాళ్లతో మాట్లాడాలి ” అన్నాడు.
అన్నట్టుగానే ప్రసాద్ తాను ప్రేమ్మించిన సుందరిని పెళ్ళి చేసుకున్నాడు.
చూస్తుండగానే రెండు పెళ్లిళ్లు జరిగాయి.
***
తలుపు దగ్గరే నిలబడిపోయింది చందన.
“అదేమిటి అలా నిలబడి పోయావు?నేలమీద వున్నచాప మీద పడుకొని అడిగాడు చరణ్.
“నాకు సిగ్గేస్తుంది”అంది మొహాన్ని చేతులతో కప్పుకుని ప్రయత్నం చేస్తూ.”
“నాకు బోల్డంత సిగేస్తుంది”నేను ఎవరితో చెప్పుకోవాలి.అయినా ఫస్ట్ నైట్ “సిగ్గు లేకుండా”వుండాలి.ఇలా సిగ్గుపడుతూ ఉంటే… మనం కాపురం చేసినట్టే”అన్నాడు చరణ్.
చిరుకోపంగా చూసింది చరణ్ వైపు
చందన చేయి స్విచ్ వైపు వెళ్ళింది
లైటాఫ్ అయింది.
***
మొహం మీద చల్లని నీళ్లు పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది.
“ఏవండోయ్ శ్రీమతి గారు …నేనే నీ మొగుడిగారిని”ఎదురుగా కాఫి కప్పుతో నిలబడ్డాడు చరణ్
ఎదురుగా ఆ దృశ్యం, అపురూపంగా అనిపించింది.”ఆ నేనున్నా కదండీ…మీరెందుకు కాఫి కలిపారు”అంది బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ.
“నీ లైఫ్ లో ‘హాఫ్’ పార్ట్ నర్ ని కదా! అందుకే” అంటూ సాసర్ లో సగం కాఫీ ఒంపుకుని,మిగితా సగం చందన కు ఇచ్చాడు.
మరో గంటలో ఇద్దరు తయారైయారు.
“మనం ఇవ్వాల్టి నుండి నడుచుకుంటూ వెళ్దాం”అంది చందన.
“నిన్ను ప్రేమించడం మొదలు పెట్టినదగ్గరనుండి నడకే నాకు శరణ్యమైంది కదోయ్,ఏం చేస్తాం ,చేసుకునోళ్ళకి చేసుకునంత ‘
ఇద్దరు నడుచుకుంటూ వెళ్లారు.చదనను ఆఫీస్ దగ్గర వదిలి తాను బయల్దేరాడు.
“సాయంత్రం ఆఫీస్ నుండి సినిమాకు వెళ్దాం. రెడీగావుండు”వెళ్లేముందు చెప్పాడు చరణ్.
“అలాగే అంది చందన.
“బట్…ఒక కండిషన్”
“ఏమిటది?”
“అక్కడికి మాత్రం నడిచి వెళదాం”అనోద్దు.ముపై కిలోమీటర్లు ఉంటుందా థియేటర్ అన్నాడు.
నవ్వుకుంది చందన.

(మిగితా వచ్చేవారం)

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY