రిలీజ్ అవ్వడానికి వన్ వీక్ ముందనుకుంటాను అతను ఆత్మహత్య చేసుకున్నాడు….విజయార్కె సీరియల్ ..ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్ (28-05-2017 )

10
ఫిజికల్ గా ఫైట్ కు ప్రిపేరయ్యాను. కానీ కొందరు వచ్చి అతన్ని తీసుకెళ్ళారు.
ఆ తర్వాత నాకే ఎలాగో అనిపించింది. రిలీజ్ అవ్వడానికి వన్ వీక్ ముందనుకుంటాను అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ రోజు చాలా ఫీలయ్యాను. అన్నం కూడా తినాలన్పించ లేదు.
మరో అనుభవం చెబుతూ-
”మాకు ఒకేసారి టీ ఇచ్చేవాళ్ళు. నేను టీ బాగా తాగేవాడిని టీ తో పాటు బీడీల కట్ట ఇచ్చేవాళ్ళు. నాకు సిగరెట్, బీడీ అలవాటు లేదు. టీ మాత్రం అలవాటుంది.
ఆ తర్వాత నా వంతుగా వచ్చిన బీడికట్ట అవసరమున్న వాళ్ళకు ఇచ్చేసి ,అతని టీ తీసుకునే వాడిని. ఆ అనుభవం మర్చిపోలేనిది. కేవలం టీకోసం బీడీలు మార్చుకునే వాడిని. ఆ టీని మూడుసార్లు వేడి చేసుకొని కొద్దికొద్దిగా తాగేవాడిని.
ఆ సెల్ లోనే మూడు చిన్న చిన్న రాళ్ళను తయారుచేసి టీని లోటాలాంటి దానిలో కాచుకుని త్రాగేవాడిని.
క్లోజ్ ప్రిజన్ లో ఉన్నప్పుడు-
రెండు వారాల తర్వాత ఓ రోజు ఉన్నట్టుండి అర్ధరాత్రి మంటలు వచ్చాయి. మా జైలుకు అవతలివైపు మార్కెట్ వుంది. అది తగులబడింది. ఆ మంటలు వేడి మా వరకూ వచ్చిందంటే, అవి ఎంత భయంకరమైన మంటలో ఊహించుకోండి!
ఖచ్చితంగా టైం ఎలా తెలుసంటే ‘ఎర్లీ మార్కింగ్ ఫోర్ కు ఎలక్ట్రిక్ ట్రెయిన్ వెళ్తుంది. అప్పుడే ఫైరింజన్ వచ్చింది. దగ్గర్లోవున్న కార్పొరేషన్ బిల్డింగ్ ప్రతీ ఆఫెనవర్ కు గంట కొడుతుంది.
ఆ రోజు చాలా కంగారుపడ్డాను. మంటలు మా సెల్ కు వ్యాపిస్తాయాన్నంతా భయంకరమైన మంటలు అవి!
నేను జైలులో ఉన్న సమయంలోనే మీనంబాకం బాంబ్ బ్లాస్ట్ కేసులో తొమ్మిదిమందిని హత్యచేసిన కేసులో నిందితుడైన వ్యక్తి జైలుకొచ్చాడు.
* * *
సెల్ అంతటా నిశ్శబ్దం.
సెంట్రీ పహరాతప్ప మరో మనిషి కదలిక లేదు.
సెంట్రీ బూట్లశబ్దం నిశ్శబ్దాన్ని హెచ్చరిస్తోంది.
ఆ నిశ్శబ్దం సుమన్ ని చిత్రవధ చేస్తోంది.
షూటింగ్ బిజీ లేదక్కడ.
సమస్యలు లేవు, భయాలు లేవు, హడావిడి లేదు.
ఉన్నదల్లా నిశ్శబ్దం.
ఉన్నదల్లా ఒంటరితనం.
ఆ ఒంటరితనం, నిశ్శబ్దం కలిసినవేళ…
చుట్టూ చూశాడు సుమన్.
అందరూ పడుకున్నారు.
పక్కకు ఒత్తిగిల్లి పడుకున్నాడు. ఏదో కాలిమీద పాకినట్టు అనిపించింది.
ఒక్క క్షణం ఒళ్ళు జలదరించింది. తేలు, జెర్రి లాంటివి కావు కదా!
దిగ్గున లేచాడు. ఓ బొద్దింక కాలుమీది నుండి దర్జాగా పైకెళ్లిపోతోంది. చేతిలో దానిని తీసేశాడు. వీపు నొప్పులతో బాధపెడుతోంది.
తనెందుకు బ్రతకాలి? ఆలోచనల అన్తతర్మథనం.
తనెందుకు చావాలి? వివేచనతో భేటీ!
కార్పొరేషన్ బిల్డింగ్ గడియారం గంట కొట్టింది.
లేచి కూర్చున్నాడు సుమన్. ఆలోచనలకు ఆనకట్ట వేయలేదు. అలా అని ఆలోచించలేదు.
ఊచల మధ్య నుండి బయటకు చూశాడు. చీకటిని పారద్రోలడానికి వెలుతురు చేస్తున్న ప్రయత్నం. మసక వెలుతురు. పైకి చూస్తే ఆకాశం కనిపించదు.
బయటకు కళ్ళు చిట్లించి చూసినా బయట ప్రపంచం కనిపించదు.
కళ్ళను అలాగే తెరచి వుంచాడు.
అలాగే మౌనిలా వుండిపోయాడు.
అన్నింటికీ అతీతంగా మెడిటేషన్ చేయసాగాడు.

(మిగితా వచ్చేవారం)
ఆంధ్రభూమి వీక్లీలో ఈ సీరియల్ వస్తోన్న సమయంలో (1991 ప్రాంతంలో) ఈ సీరియల్ చదివిన పాఠకులు అప్పటి అనుభవాలను షేర్ చేసుకోవచ్చు.మేన్ రోబో లో ప్రచురణ నిమిత్తం పంపించవచ్చు.

manrobocreations@gmail.com
మేన్ రోబో పాఠకుల కోసం పునః ప్రచురణ

ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్
ఈ పుస్తకం కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులో వుంది.
http://kinige.com/book/Jailu+Godala+Madhya+Hero+Suman

NO COMMENTS

LEAVE A REPLY