“మొహమాటానికి లంచ్ కు పిలిస్తే మనం ఎగేసుకుని వెళ్తే ఏం బావుంటుంది?…వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ శ్రీ &శ్రీమతి (04-06-2017)

9
లాయర్ పరాంకుశం
నేమ్ ప్లేట్ అందంగానే వుంది
గేటు తీసుకుని లోపలి వెళ్ళింది శ్రీలక్ష్మి
లాయర్ పరాంకుశం సీరియస్ గా లా బుక్స్ తిరగేస్తున్నాడు
“నమస్కారం సార్”చేతులు జోడించింది శ్రీలక్ష్మి
“నమస్కారం కుచోమ్మా”సీటు చూపిస్తూ అన్నాడు పరాంకుశం
“చెప్పమ్మా…”అన్నాడు “సాధారణంగా అతని దగ్గరికి కేసులు గురించి రారు
“నేను మా ఆయనకు విడాకులు ఇవ్వాలని అనుకున్నానండీ”చెప్పింది శ్రీలక్ష్మి
“ఎందుకు?
“ఆయన అనుమానాన్ని భరించలేకపోతున్నాను”క్లియర్ గా చెప్పింది.
“మీ ఆయన పేరేమిటి…?అడిగాడు లాయర్
“తిక్కేశ్వర్రావు ”
“మీ ఆయనేం చేస్తుంటారు?
“ఆర్మీ రిటర్న్”అంది
“అదేమిటి?ఫారిన్ రిటర్న్ లా..కాసింత ఆశ్చర్యంగా అడిగాడు లాయర్
“ఆర్మీ లో చేరి పాకిస్థాన్ ని ఒంటి చేత్తో తరిమికొడుతానని వెళ్ళాడు..పెళ్ళైన కొత్తలో…హైట్,పర్సనాలిటీ సరిపోలేదని తిప్పి పంపించారు ..ఆ విషయం ఎవరికీ తెలీకూడదని ఆర్మీ రిటర్న్ అని పెట్టుకున్నారు..నాటకాల కంపెనీలో తుప్పు పట్టిన తుపాకీని వెంటేసుకుని తిరుగుతుంటాడు”క్లియర్ గా,క్లారిటీగా చెప్పింది.
“ఆయన అనుమానానికి రెండు శాంపిల్స్ చెప్పమ్మా”అన్నాడు
“అనుమానం ఏ రేంజ్ లో ఉంటుందంటే.. నన్ను దోమ కుడితే అది మగదా?ఆడదా?అని జెండర్ టెస్ట్ చేయిస్తారు ..
“ఇంకో శాంపిల్ చెప్పమ్మా?అడిగాడు లాయర్.మరి కాసింత క్యూరియాసిటీతో
“నేను కట్టుకున్న శారీ కూడా మగదేమోననే అనుమానం…చాలా ఇంకా చెప్పాలా?అన్నట్టు చూసింది శ్రీలక్ష్మి
అప్పటికే అతనికి మెంటల్ బాలన్స్ కాస్త అటుదిటుగా మారుతుంది.
“మీ అయన జబ్బుకు షాక్ ట్రీట్మెంట్ బెటర్”చెప్పాడు
“మీ ఇష్టం లాయర్ గారు..ఆయనలో అనుమానపు కణాలు మిక్సీలో వేసి రుబ్బేయండి.పచ్చడి చేయండి..మీ ఫీజెంతో చెప్పేయండి” అంది శ్రీలక్ష్మి
అదే సమయంలో ఆ ఇంటి ముందు ఆటోలో దిగారు ..చందన చరణ్
“మొహమాటానికి లంచ్ కు పిలిస్తే మనం ఎగేసుకుని వెళ్తే ఏం బావుంటుంది?చరణ్ అన్నాడు
” లాయరంకుల్ అలాంటోరు కారు”అంది లోపలి అడుపెడుతూ …
సరిగా అప్పుడే శ్రీలక్ష్మి ఎదురొచ్చియింది …
సరిగా అప్పుడే చరణ్ సిక్స్త్ సెన్స్ వార్నింగ్ ఇచ్చింది..
ఏమిటా వార్నింగ్? వచ్చే వారం కనుక్కుందాం.

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY