జైల్ హాస్పిటల్ కు సుమన్ ని తరలించారు. లోపల బెడ్స్ ఖాళి లేవు. సుమన్ ను నేలమీద పడుకోబెట్టారు….విజయార్కె…సీరియల్ ..ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్(04-06-2017 )

11
(సుమన్ తో కంచుకవచం చిత్రాన్ని నిర్మించిన నిర్మాత జైలులోవున్న సుమన్ గూర్చి చెబుతూ ‘నేను ఎప్పుడు సుమన్ గారిని కలుసుకోవడానికి వెళ్లినా అలాగే కూర్చుండిపోయేవాడు. ఓ మౌనిలా మెడిటేషన్ తో అన్నింటికన్నా అతీతమైన స్థాయికి వెళ్ళాడోనన్న ఫీలింగ్ కనిపించేది’ అన్నారు)

మెడిటేషన్ నిజంగా చాలా కష్టసాధ్యమైన విషయం.
గంటలు…రోజులు…నెలల తరబడి మెడిటేషన్ తో అలాగే ఉండిపోవడం ఎంతో మానసిక స్థయిర్యం, ఆత్మవిశ్వాసం వుంటేతప్ప ఎవరికీ సాధ్యపడని విషయం.
ఈ విషయాన్ని సుమన్ దగ్గర ప్రస్తావిస్తే ఇలా అంటారు.”నిజం చెప్పాలంటే ఇప్పుడా సంఘటనలు తలుచుకుంటే నాకే అలా ఎలా వుండగలిగానా ?అని ఆశ్చర్యం వేస్తోంది. అంతేకాదు నేను , అతికష్టం, దుర్లభం అయినా జీవితాన్ని జైలులో చవిచూశాను.” అంటారు.
సుమన్ బెయిల్ లభించేలా చేయాలని ప్రముఖ లాయర్ జి.ఆర్ గారు ప్రయత్నించసాగారు. . ఇది మామూలు వ్యవహారం కాదు. పొలిసు శాఖకు సంబంధించింది.
మళ్ళీ మధ్యలో రెండుమూడుసార్లు వచ్చారు జి.ఆర్ గారు.
ప్రతీ సారి సుమన్ ఒకే విషయాన్ని చెప్పేవాడు.
”సార్ నేను నిర్దోషిని. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలనుకుంటున్నాను. కానీ ఏ తప్పు చేయకుండానే శిక్షను అనుభవించడానికి సిద్ధంగా లేను. నేను దోషినని వాళ్ళు (పోలీసులు) ప్రూవ్ చేస్తే సంతోషంగా శిక్ష అనుభవిస్తాను. సార్…నేను నిర్దోషిని.”
స్థిరంగా, సిన్సియర్ గా, దృఢంగా చెప్పారు సుమన్.
* * *
నిద్ర లేవగానే ఒళ్ళంతా బరువుగా అన్పించింది.
అంతేకాదు ఒళ్ళు వేడిగా వుంది.
నోరంతా అదోలా వుతుంది.
జ్వరం వచ్చింది.
తోటివాళ్ళు వెంటనే ఆ విషయాన్ని పసిగట్టారు.
జైల్ హాస్పిటల్ కు సుమన్ ని తరలించారు. నడవడానికి ఓపికలేదు. తలంతా బరువుగా,
లోపల బెడ్స్ ఖాళి లేవు. సుమన్ ను నేలమీద పడుకోబెట్టారు.

షూటింగ్ ముచ్చట్లు
నా ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ సీన్ చేస్తున్నాను. ఫైటర్స్ తో ఫైట్ చేయాలి. అదీ సినిమా ట్రిక్ లా చేయాలి తప్ప రియల్ గా కాదుగదా! ఇక్కడేం జరిగిందంటే లాస్ట్ పర్సన్ ని పంచ్ చేయాలి. డైరెక్టర్ కట్ చెప్పాడు. ఫస్ట్ షాట్ లో ఓకే అయిందని సంతోషపడి చూస్తే ఫైటర్స్ ఎవ్వరూ లేరు. లాస్ట్ ఫైటర్ కు పన్ను ఊడింది. అందరికి దెబ్బలు బాగా తగిలాయి.
”మీరు ఫైట్స్ చేస్తున్నట్లు, వాళ్ళను బాదుతున్నట్లు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి యాక్షన్ మాత్రం చేయండి. జీవించొద్దు” అంటూ ఫైటర్లు, డైరెక్టర్ మొత్తుకున్నారు.

(మిగితా వచ్చేవారం)
ఆంధ్రభూమి వీక్లీలో ఈ సీరియల్ వస్తోన్న సమయంలో (1991 ప్రాంతంలో) ఈ సీరియల్ చదివిన పాఠకులు అప్పటి అనుభవాలను షేర్ చేసుకోవచ్చు.మేన్ రోబో లో ప్రచురణ నిమిత్తం పంపించవచ్చు.

manrobocreations@gmail.com
మేన్ రోబో పాఠకుల కోసం పునః ప్రచురణ

ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్
ఈ పుస్తకం కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులో వుంది.
http://kinige.com/book/Jailu+Godala+Madhya+Hero+Suman

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

 

 

 

NO COMMENTS

LEAVE A REPLY