రాజమహల్ ఎంట్రన్స్ లో ఫిరంగులు వరుసగా నిలబెట్టి ఉన్నాయి.. ఫిరంగులు మరీ పెద్దవి కాకపోయినా చూడగానే దడ పుట్టే విధంగా ఉన్నాయి….స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (11-06-2017)

(గత సంచిక తరువాయి)

మంచి వేసవిలో కూడా రాజమహల్ లో చల్లగా ఉంది.
ఆ నైపుణ్యం బుక్ లో చదువుకుంటే వచ్చేది కాదనిపించింది. ఎంత టాలెంట్ ఉండకపోతే అలాంటి మహల్ కట్టగలుగుతారు?
సిమెంట్ లేదు, కంప్యూటర్ డిజైన్ లేదు. ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ఏమీ లేకుండా అలాంటి మహల్ కట్టారంటే అది చాలా గొప్ప విషయం అనిపించింది.
క్లాస్ సెక్షన్ ప్రకారం మహల్ లోనికి తీసుకు వెళ్ళారు…
రాజమహల్ ఎంట్రన్స్ లో ఫిరంగులు వరుసగా నిలబెట్టి ఉన్నాయి.. ఫిరంగులు మరీ పెద్దవి కాకపోయినా చూడగానే దడ పుట్టే విధంగా ఉన్నాయి. వాడి చాలా కాలం అయినందువల్ల తుప్పుపట్టి ఉన్నాయి.
మహల్ చాలా ఖరీదైన టేకు దూలాలతో కట్టారు. మహల్ కట్టి కొన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరక ఉంది.
మెయిన్ ఎంట్రన్స్ వద్ద పెద్ద ఫిరంగులు నిలిపి ఉంచారు. లోపలకు వెళ్ళగానే ఎక్కడి నుండో చల్లగాలి మొహాన్ని తాకుతూ వెళ్ళింది. అప్పటివరకు ఎండలో ఉన్న మాకు ఆ చల్లగాలితో చాలా రిలీఫ్ అనిపించింది.
మహల్ మొత్తం మూడు అంతస్తులు. మొదటి అంతస్తులో పురావస్తు శాఖ తవ్వకాల్లో దొరికిన, సేకరించిన రాతి విగ్రహాలను ప్రదర్శనకు ఉంచారు. మొఘలుల దాడిలో బలై ముక్కు మొహం క్లియర్ లేని విగ్రహాలు చూడడానికి కాస్త బాగున్నాయి. దాడిలో తప్పించుకున్న చక్కని విగ్రహాలు కళాత్మకంగా ఉన్నాయి. ప్రతి విగ్రహం వద్ద దానికి సంబంధించిన వివరణ ఉంది.
మొదటి అంతస్తులో ఫిరంగులకు వాడిన మందుగుండు, రాజుల మద్య జరిగిన అగ్రిమెంట్ తాలూకు కొన్ని స్టాంప్ పేపర్స్ ప్రదర్శనకు ఉంచారు.
ఫస్ట్ ఫ్లోర్ మధ్య భాగంలో అద్భుతమైన నిర్మాణంతో ఉన్న దర్బార్ లాంటి హాల్. అందులో శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం…
రమ్యంగా ఉన్న ఆ విగ్రహాన్ని ఎంతసేపైనా అలానే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. రూమ్ చాలా చల్లగా ఉంది. ఎక్కడినుండో కాంతి రూమ్ ని ప్రకాశవంతం చేస్తోంది.
మూడవ అంతస్తు నుండి కూడా ఆ రూమ్ లో ఏమి జరుగుతుందో చూసే విధంగా కట్టారు..
ఇక మూడవ అంతస్తులో ఆ కాలంలో వాడిన కత్తులు ఆయుధాలు ప్రదర్శనకు ఉంచారు..
మొత్తం చూడడానికి రెండు గంటలు పైనే పట్టింది. అక్కడ నుండి కూత వేటు దూరంలో రాణి మహల్ ఉంది.
రాణి మహల్ అప్పటికే శిధిలావస్థలో ఉందని లోపలికి అనుమతించలేదు. దూరం నుండే చూసి బాగుందని సరిపెట్టుకున్నాం.
అప్పటికే లంచ్ టైం కావడంతో సెక్షన్ ప్రకారం చెట్ల కింద కూర్చున్న మాకు పెరుగన్నం పొట్లాలు అందించారు.
ఆకలితో నకనకలాడిపోతున్న మాకు అందడమే ఆలస్యం ఓపెన్ చేసి ఒక పట్టు పట్టాం.
మాకు దగ్గరలో ఉన్న బోర్ లో నీళ్ళు తాగాక ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది.
కాసేపు రెస్ట్ తీసుకున్నాక మా క్లాస్ టీచర్ మా వద్దకు వచ్చారు.
కొండపైన రెండు చిన్న గుంటలు ఉన్నాయి. అవి ప్రక్కన ప్రక్కన ఉంటాయి. ఒక గుంటలో నీళ్ళు ఉప్పగా మరో గుంటలో నీళ్ళు తీయ్యగా ఉంటాయని మాకు ఇంట్రెస్ట్ కలిగే విధంగా చెప్పారు.
ఆ వింత ఎదో చూడాలన్న కుతూహలం మాలో బయలుదేరింది. అప్పటికే మిగిలిన సెక్షన్స్ వాళ్ళు కూడా అదే ఇంట్రెస్ట్ తో ఉన్నట్టు కనిపించారు. ఇక ఆలస్యం కాకుండా స్టూడెంట్స్ అందరూ ఒక లైన్ గా బయలుదేరాం.
కొండ దూరం నుండి చూడడానికి చిన్నగా కనిపించినా అది ఎంత కష్టమో ఎక్కడం స్టార్ట్ చేశాక కాని తెలియలేదు.

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY