విలువైన జీవితాలను మద్యం మత్తుకు తాకట్టు పెట్టొద్దు…రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగత్ …బ్యూటిఫుల్ లైఫ్ షార్ట్ ఫిలిం ప్రివ్యూ

విలువైన జీవితాలను మద్యం మత్తుకు తాకట్టు పెట్టొద్దు..మీ కన్నవాళ్లకు
శోకాన్ని మిగల్చవద్దు..తాగి డ్రైవ్ చేస్తే మీకే కాదు..ఎదుటివారికి కూడా ప్రమాదమే..”అన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగత్
యువదర్శకుడు శశాంక్ రామానుజపురం స్వీయదర్శకత్వంలో ప్రముఖ నటి సన,మేఘన లోకేష్ ప్రధాన పాత్రలుగా నిర్మించిన బ్యూటిఫుల్ లైఫ్ షార్ట్ ఫిలిం ను ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమం లో జాయింట్ సిపి తరుణ్ జోషి ,డిసిపి ట్రాఫిక్ రమేష్ నాయుడు అడిషనల్ డిసిపి దివ్య చరణ్ రావు తదితరులు పాల్గొన్నారు.నటి సన మాట్లాడుతూ ” శశాంక్ డెడికేషన్ ను అభినందిస్తూ “శశాంక్ కాన్సెప్ట్ అద్భుతంగా ఉందని,మరిన్ని ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని ఉందన్నారు.


ప్రముఖ రచయిత ,జర్నలిస్ట్ విజయార్కె మాట్లాడుతూ “ఈ షార్ట్ ఫిలిం లో హీరో కూడా వున్నాడని..ఈ షార్ట్ ఫిలిం ఇలా మీ ముందుకు రావడానికి కారణమైన రాచకొండ కమిషనర్ మహేష్ భగత్, హీరో అన్నారు.పోలీస్ డిపార్ట్ మెంట్ అందించిన సహకారాన్ని కొనియాడారు.
దర్శకుడు శశాంక్ స్పందిస్తూ “ఒక సోషల్ ఎవెర్ నెస్ తో నేను తీసిన బ్యూటిఫుల్ లైఫ్ కు కారణమైన కమిషనర్ గారికి,అడగ్గానే కీలకమైన పాత్ర చేయడానికి ఒప్పుకున్న సన గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు చెబుతూ”ఈ షార్ట్ ఫిలిం చూసి ఒకరైనా ఆలోచించగలిగితే నా ప్రయత్నం సఫలమైనట్టే అన్నారు.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY