ఆశయమే అక్షరం …అసురస్వార్థానికి అక్షరమే ఆయుధం …ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సె(పె)న్సేషనల్ సీరియల్ గుప్పెడంత ఆకాశం(18-06-2017)

ఆకాశంలో మెరుపులు ఉరుములు…క్రొత్తసృష్టికి పురిటినొప్పులు….ఆశయమే అక్షరం …అసురస్వార్థానికి అక్షరమే ఆయుధం …
సీరియల్ ప్రకటనతోనే సంచలనం సృష్టించిన
ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి సీరియల్ గుప్పెడంత ఆకాశం ఈవారమే ప్రారంభం.
రచనలో ఐడియాలజీ…కథలో కొత్తదనం..కథనంలో నూతనత్వం…భావాల్లో క్లారిటీ…అక్షరాల్లో ప్యూరిటీ…చెప్పాలనుకున్న విషయాన్నీ ..ఎమోషన్స్ ని బాలన్స్ చేస్తూ మీ ముందుకు వచ్చిన గుప్పెడంత ఆకాశం సీరియల్ మీద మీ స్పందన తెలియజేయండి.చీఫ్ ఎడిటర్

ఒకమాట
ఇది నా తొలి సీరియల్…ఎలా మొదలుపెట్టాలో,? ఎలా రాయాలో? ఏం రాయాలో ..?తెలిసీ తెలియని స్థితిలో మొదలుపెట్టిన ధారావాహిక.
మనసు భావాల బాంఢాగారం…మస్తిష్కం ఆలోచనల గ్రంథాలయం…నా చేతివేళ్ళు కంప్యూటర్ కీ బోర్డు మీద కదిలే అక్షర కథనాలు.
మీ ఆదరణ అభిమానం నన్ను రైటర్ గా ముందుకు నడిపే మార్గదర్శి.
ఆ ధైర్యంతో మొదలుపెట్టాను…రచయితల్లోని టాలెంట్ పాఠక ప్రపంచానికి పరిచయం చేసే మేన్ రోబో, రైటర్స్ కు రెడ్ కార్పెట్ లాంటిది.
థాంక్యూ మేన్ రోబో
సీరియల్ గురించి చెప్పడం కన్నా మీరు చదివి …బాగుంటే ఒక అభినందన..నచ్చకపోతే ఒక విశ్లేషణ ….తెలియజేయండి.
ఒక ఆశయానికి అక్షరం ఆయుధమై,ఒక ఆలోచనకు పదం అంకురార్పణమై…నేను సైతం భావోద్వేగాల యవనికపై..లక్ష్యాన్ని సాధించే నిరంతర సాహితీ ప్రవాహమై..ముందుకుకదిలే నా స్ఫూర్తికి వెన్నంటి నిలిచే …
సుగాత్రి లాంటి అమ్మలకు
ప్రతిమ లాంటి కూతుళ్ళకు …
మానవత్వాన్ని ప్రేమించే ప్రతీఒక్కరికీ…
శ్రీసుధామయి

నాంది
పచ్చని పంటచేలను చీరగా చుట్టుకున్న ప్రకృతికాంత.పైరగాలి పైటగా మారింది.అప్పుడే ఉదయిస్తోన్న ఉషోదయం ఆమె నుదిటి కుంకుమగా నిలిచింది.ప్రకృతిలోని సొబగులు ఆమె తనువును చేరి…ఆమె అణువణువునా అందమై బాసిల్లుతున్నాయి.
విధాత విభ్రాంతుడై ఆ ప్రకృతి కన్యను ఓ ఇంట పుట్టిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో,అన్యమనస్కంగానే ఆమెను ఆశీర్వదించాడు
తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు.
కంచిలో కనిపించని ఒక కథ
అక్షరాల కాన్వాసు మీద పదాలతో పురుడు పోసుకుంది.వాక్యం కన్ను తెరిచింది.కథనం ముందుకు కదిలింది.
విశ్వమంత ఆకాశం గుప్పెడంత ఆకాశంగా మారింది.పిడికెడంత గుండెలో ఒదిగిపోయింది
నిబిడాంధకారంలో మెరిసిన మెరుపులో అక్కడ కనిపించిన దృశ్యం …?

***
ప్రారంభం
అనగనగా సురభి అనే గ్రామం!!
పాడిపంటలు పచ్చనిపొలాలతొ విరాజిల్లడమే కాకుండా, మనుష్యుల మధ్య అభిమానాల మేళవింపు ఆప్యాయతల రంగరింపులకు కొదవ లేని పల్లె.ఇంకా కార్పొరేట్ ఇనుప చట్రాల మధ్య నలిగిపోని స్వచ్ఛమైన ఊరు.
ఆ ఊరిలో ఉన్న కుటుంబాలలో ధర్మతేజ గారి కుటుంబం ఒకటి.. ధర్మతేజ గారి ధర్మపత్మి ధరణి గారు పిల్లలకోసం చేయని పూజ లేదు.. మొక్కని దేవుడు లేడు..దేవుడు కరుణించాడో.అమ్మ వేదన చూసి బ్రహ్మదేవుడు సృష్టించాడో….
దాదాపు 8 సంవత్సరాల తర్వాత వారింట్లో మహాలక్ష్మి అడుగుపెట్టింది
చెట్టూ చేమా,ఊరూ వాడా…పండుగ చేసుకుంది.ధర్మతేజ ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టిందని పండుగ చేసుకున్నారు.కోయిలమ్మలు జోల పాడాయి.
ఊళ్ళో కోవెలలో అర్చనలు…కోనేటిరాయుడికి అభిషేకాలు.
ఒక ప్రాణి పుట్టుక ఇంత బావుంటుందా?
ఒక జననం ఇంత అబ్బురంగా ఉంటుందా?
కాలం ఒడిలో పురుడు పోసుకున్న చిన్నారి భవిష్యత్తు ఏ మలుపు తిరగనుందో?
(గుప్పెడంత ఆకాశంలో చిన్న విరామం)

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY