మహాకవి తెలుగువారి ఖ్యాతి సినారెకు ములుగు లక్ష్మీ అక్షర నివాళి

మాటలకందని భావాలు
కవితలకందని మౌనాలు
రాళ్ళను సైతం కరిగించే
సంగీత సాహిత్యలు
మాకు అందించిన
ఓ విశ్వంభరా..!
ఇదే నా అక్షర నివాళి..!!
ములుగు లక్ష్మీ

నాన్న స్మృతి లో
*************
(ఫాథర్స్ డే సందర్భంగా)
ఆ ఇంటిని చూసినప్పుడల్లా
నా చిన్న నాటి జ్ఞాపకాలు
గుర్తువస్తున్నాయి నాన్న.!

నీ గుండెలపై ఆడించి
నీ భుజాల పై మోసి..
నిదురపుచ్చిన ఆ క్షణాలు
ఇంకా గుర్తు వస్తున్నాయి నాన్న..!

నా చిటికెనవేలు పట్టి నడిపించి
ప్రపంచాన్ని చూపించావు
నువ్వు దిద్దిన అక్షరాలతో
విశ్వవిజేత చేసినందుకు
నీ కంట ఆనందబాష్పాలు
ఇంకా గుర్తు వస్తున్నాయి నాన్న..!
పగలనక రాత్రనక
కష్టించి పనిచేసి
ఇంటిని ఇంట్లో వారందరినీ
ఒంటి స్తంభం లా మోస్తున్నావు
ఆంక్షలైనా,శిక్షలైనా
నా భవిత కోసమేనన్న సంగతి
ఇంకా గుర్తు ఉంది నాన్న..!
గెలిచినా,ఓడినా
వెన్నుతట్టి భరోసా ఇచ్చావు
అందుకే నాన్న నీ స్మృతి మరువలేనిది
నా జీవితగమ్యానికి మార్గదర్శక మైనది..!
************
ములుగు లక్ష్మీ
నెల్లూరు

NO COMMENTS

LEAVE A REPLY