నా next target దొంగ బాబాలు ,స్వామిజీల మీద..అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తున్న శశాంక్ బ్యూటిఫుల్ లైఫ్

షార్ట్ ఫిలిమ్స్ సముద్రంలో సునామీలా వచ్చాడు.ఎమోషన్స్ ,సోషల్ అవేర్ నెస్ ,ఎంటర్టైన్మెంట్ …సబ్జెక్టు ఏదైనా సిన్సియర్ గా ప్రేక్షకుల ఆలోచనలను టచ్ చేస్తూ,కదిలేబొమ్మలతో ఆలోచింపజేసే కథలను కనిపించేలా చేసిన విజువల్ విజార్డ్ శశాంక్ రామానుజపురం తాజా ప్రయత్నం బ్యూటిఫుల్ లైఫ్…
మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ తమ జీవితాలను,ఇతరుల జీవితాలను విషాదంలోకి నెట్టేస్తున్న మందుబాబులకు గుణపాఠం చెప్పే షార్ట్ ఫిలిం స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు.
సుప్రసిద్ధ టీవీ సినీ నటి సన ప్రధాన పాత్రలో బిర్మించిన ఈ చిత్రానికి పోలీస్ శాఖా వెన్నుదన్నుగా నిలిచింది.
యు ట్యూబ్ లో విడుదలైన బ్యూటిఫుల్ లైఫ్.రెండువారాల వ్యవధిలోనే లక్షా నలభై వేలకు చేరువై అత్యధిక వ్యూస్ తో ముందుకు దూసుకువెళ్తుంది.
ఈ నేపథ్యంలో శశాంక్ తన ఆలోచనలు షేర్ చేసుకున్నాడు
*బ్యూటిఫుల్ లైఫ్ షార్ట్ ఫిలిం తీయడానికి ఇన్స్పిరేషన్ …?
** చాలా చోట్ల జరుగుతున్న drunk n drive యాక్సిడెంట్స్ వలన ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజలు.
*బ్యూటిఫుల్ లైఫ్ షార్ట్ ఫిలిం ద్వారా ఏం చెప్పాలనుకున్నారు ?
** నేనేం చెప్పిన వినాల్సిన వాళ్లు వినరు , అందుకనే విజువల్ ద్వారా చూపించాను , ఇది చూసి వేల మందిలో ఏ ఒక్కరిలోనైనా మార్పు వస్తే నేను చెప్పాలనుకున్నది చెప్పినట్లే .
అందుకనే విజువల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను.
*నెక్స్ట్ టార్గెట్ ఏమిటి?
** నా next target అమాయక ప్రజల పిచ్చి నమ్మకాన్ని కాష్ చేసుకుంటున్న దొంగ బాబాలు ,స్వామిజీల మీద ఒక షార్ట్ ఫిలిం తీయడం
అల్ ది బెస్ట్ శశాంక్
మీ కోసం బ్యూటిఫుల్ లైఫ్ లింక్…

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY