చాలా నీరసంగా వున్న సుమన్ ని చూసి కంగారుపడింది….విజయార్కె…సీరియల్ ..ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్(25-06-2017 )

12

”అమ్మా” సుమన్ పెదవులు విచ్చుకున్నాయి.
”అమ్మా…” మూలుగుతున్నాడు. ఒళ్ళంతా వేడిగా వుంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. తల్లి జ్ఞాపకం వచ్చింది.
డాక్టర్ వచ్చి ఏవో బిళ్ళలు ఇచ్చి వెళ్ళాడు.
రెండురోజులు హాస్పిటల్ లోనే ఉన్నాడు.
ఫ్యాన్ లేదు. ఓ పక్క ఉక్కపోతగా వుంది.
డయాబెటీస్ పేషెంట్లు, లెప్రసి పేషెంట్ల మధ్య సుమన్ పడుకున్నాడు.
ఆ వాతావరణంలో ఒక్క క్షణం కూడా వుండాలనిపించలేదు.
వాళ్ళందర్నీ విజిట్ చేసింతర్వాత డాక్టర్ సుమన్ దగ్గరికి వచ్చి ఏవో బిళ్ళలు ఇచ్చాడు.
బయటకు వెళ్లే అవకాశం కూడా లేదు.
ఆ హాస్పిటల్ లో వున్న ఆ రెండ్రోజులూ భయంకరంగా గడిచింది సుమన్ కు.
(హాస్పిటల్ అనుభవం గూర్చి చెబుతూ సుమన్ ”నాకెప్పుడూ ‘నీట్’ గా ఉండటమంటే ఇష్టం. నేనేకాదు. నా చుట్టూ వుండే పరిసరాలు కూడా ‘నీట్’ గా వుండాలనుకునేవాడిని. నేను షూటింగ్ కు వెళ్ళినా ఆ ‘ప్లేస్’ నీట్ గా ఉండాలి. మనకు మంచి మూడ్ వుంటేనే కదా ఏ పని అయినా చేయగలిగేది. నేను హాహాస్పిటల్ లో వున్నా ఆ రెండ్రోజులూ ఆ అనీజీని భరించాను. ఇక్కడ పేషంట్లను అసహ్యించుకోవడం కాదు. వీళ్ళకైనా ప్రత్యేకంగా ఓ గది ఇస్తే వీళ్ళకూ మంచిదే కదా! వాళ్ళందరి మధ్య రెండ్రోజులు రెండు యుగాల్లా గడిపాను. ఓ వైపు జ్వరం బాధ, అంత జ్వరంలోనూ అమ్మా ఎలా ఉందోననే దిగులు.”)
* * *
సుమన్ ను చూడ్డానికొచ్చింది తల్లి.
చాలా నీరసంగా వున్న సుమన్ ని చూసి ఎంతో కంగారుపడింది.
జ్వరం వచ్చిన విషయం తెలుసుకుని చాలా ఫీలయింది. ‘నీకు జ్వరం వస్తే కనీసం నీ దగ్గరుండి నీకేమి చేయలేకపోయాను’ ఆమె మనసులో బాధ.
”ఎలా ఉందిరా?” మాతృవాత్సల్యం కట్టకు తెగింది. కన్నీటి ఆనకట్ట కట్టలు తెంచుకుని ప్రవహించింది.. కనుకొలకుల సరిహద్దులు దాటిన ఆశ్రువులు నక్షత్రాల్లా మెరుస్తూ నేలరాలాయి.
కొడుకు చేతులను తన చేతుల్లోకి తీసుకుంది.
కొడుకును ఏమని ఓదార్చాలో అర్ధం కాలేదు.
గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.
కొడుకు ముందు నిలబడి, కొడుక్కు దూరంగా వుండలేకపోయింది. జైలుగోడలు బద్దలుకొట్టి కొడుకును తీసుకెళ్ళలన్నంత ఆరాటం.
సుమన్ కు తల్లి అంటే పంచప్రాణాలు. ఇంటర్వ్యూలో తల్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక్క క్షణం సైలెంటయి చెప్పాడు.”తాను నాకు తల్లి మాత్రమే కాదు. గురువు, దైవం అన్నీ. నాకోసం ఆమె తపించిపోయింది.
అనుక్షణం తన వృత్తి నిర్వహణలో బిజీగా వుంటూ నాకోసం…నేను బయటకు రావడానికి నిరంతరం కృషిచేసింది.
క్షణాలు….నిమిషాలు….గంటలు…రోజులు…
ఎన్ని నిశ్శబ్ద లక్షల క్షణాలు మౌనంగా రోదించిందో నాకు తెలుసు. నాకు ధైర్యం చెబుతూ తను లోపల ఎంత ఆవేదన పడిందో నేనూహించగలను.
అందుకేనండి ఆమె ”అమ్మ”.
మళ్ళీ…మళ్ళీ…నేను మరో జన్మలోకూడా ఆ అమ్మకే కొడుగ్గా పుడతాను.
* * *

(మిగితా వచ్చేవారం)
ఆంధ్రభూమి వీక్లీలో ఈ సీరియల్ వస్తోన్న సమయంలో (1991 ప్రాంతంలో) ఈ సీరియల్ చదివిన పాఠకులు అప్పటి అనుభవాలను షేర్ చేసుకోవచ్చు.మేన్ రోబో లో ప్రచురణ నిమిత్తం పంపించవచ్చు.

manrobocreations@gmail.com
మేన్ రోబో పాఠకుల కోసం పునః ప్రచురణ

ఫ్లాష్ బాక్ 1991 జైలు గోడల మధ్య హీరో సుమన్
ఈ పుస్తకం కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులో వుంది.


http://kinige.com/book/Jailu+Godala+Madhya+Hero+Suman

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY