ఏకపక్షంగా తన నిర్ణయాన్ని తీర్పులా ప్రకటించింది.అక్కడి నుంచి నిష్క్రమించింది వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ శ్రీ &శ్రీమతి (09 -07 -2017)

ఫీడ్ బ్యాక్
డెత్ సెంటెన్స్ త్సర్వత శ్రీ&శ్రీమతి ..రెంటికీ పోలిక లేదు..విభిన్న వైవిధ్యమైన అటెంప్ట్..చాలా బావుంది మేడం..కంగ్రాట్స్ ..రామనాథ్ (విజయవాడ)
చరణ్ పాత్రను మలిచిన తీరు చాలా బావుంది…చరణ్ లాంటి వాళ్ళు నిజజీవితంలో వుంటారా? వైదేహి(వైజాగ్)
(గత సంచిక తరువాయి)
చరణ్ కు నిద్ర లేవు విశ్రాంతి లేదు..అలిసిపోతున్నాడు…ఒక్కో క్షణం భయపడిపోతున్నారు.కంపెనీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుందితన పరిస్థితిని ఎప్పటికప్పుడు చందనంతో చెప్పాలనే అనుకుంటున్నాడు.కానీ ఆవేశంలో అర్థం చేసుకోలేని స్థితిలో వున్నా చందాన ఎప్పటికప్పుడు చరణ్ ను ఎవాయిడ్ చేస్తూనే వుంది.మరొకొన్ని గంటల్లో మరో ఉపద్రవం ముంచుకు వస్తుందని అతనికా క్షణంలో తెలియదు.
చందన ఓ నిర్ణయానికి వచ్చింది.ఆ నిర్ణయం విని లాయర్ షాకయ్యాడు.
“చందనా ఏమిటీ నిర్ణయం?చిన్నపాటి మందలింపు కూడా వుంది లాయరంకుల్ మాటల్లో
“నా నిర్ణయం మారదు అంకుల్.అతనికి నా మీద ప్రేమ తగ్గిందో..మోజు తగ్గిందో చెప్పలేను.రోజూ నాతో కలిసి జాగింగ్ కు వచ్చేవాడు.కబుర్లు చెప్పేవాడు…ఇప్పుడు తీరిక లేదు..చివరికి అతని ప్రతిరూపం నాలో ఊపిరి పోసుకుంటుందన్న శుభవార్త చెప్పాలన్నా వినే తీరిక,,విని సంతోషపడే మనసూ లేకుండా పోయింది”చందం అంది
“రేపు నా బిడ్డ నాలా తండ్రి ప్రేమకు దూరం కావద్దు…అలా అని నేను అతనికి విడాకులు ఇస్తానని అనడం లేదు.కొన్నాళ్ళు దూరంగా వుంటాను.అతనిలో నా మీద ప్రేమ తిరిగి చిగురించినా,లేదా నా బిడ్డ మీద ప్రేమ గోదారిలా పొంగినా అతని కోసం ఎదురు చూస్తాను.అలా అని నా కొలీగ్ లా ఆత్మహత్య చేసుకోను..”దృడంగా చెప్పింది చందన
లాయర్ అంకుల్ కి అంతా అర్థమైంది.ఇప్పుడు చందన వినే పరిస్థితిలో లేదు.
వెంటనే చరణ్ ని పిలిపించాడు..విషయం అర్థం కాక కంగారుగా వచ్చాడు.చందన నిర్ణయం విన్నాడు.తన ఎదురుగానే వుంది.తనను చూసి కనీసం చిరునవ్వు కూడా చిందించలేదు.తాను అంత పరాయివాడు అయ్యాడా?బాధ తన్నుకు వచ్చిందిచరణ్ కు.
“మనం కొన్నాళ్ళు విడివిడిగా ఉందాం.నేను మా పుట్టింటికి వెళ్తాను//మనం ప్రేమించుకున్నప్పుడు ఎలా వుండమో అలానే ఉందాం.కాలం తెచ్చే మార్పు కోసం..మీలో వచ్చే మార్పు కోసం ఎదురుచూద్దాం”
వాదోపవాదాలకు తావు లేకుండా..
ఏకపక్షంగా తన నిర్ణయాన్ని తీర్పులా ప్రకటించింది.అక్కడి నుంచి నిష్క్రమించింది చందన..అతని మనసు గదిని ఖాళీ చేసినట్టు…
శూన్యంగా ఖాళీగా వున్న గదిలో జ్ఞాపకాలే మిగిలాయి.
(ఆ శూన్యాన్ని భర్తీ చేసేది ఎవరు?మనుష్యులా?కాలమా?)

మిగితా వచ్చేవారం  

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

.

NO COMMENTS

LEAVE A REPLY