సాయిబాబా ఇక రాడు అన్న నమ్మకం కలగడంతో ఇక అక్కడ ఉండబుద్ది కాలేదు. …స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (23-07-2017)

(గత సంచిక తరువాయి)
రూమ్ లో సిల్వర్ కోటెడ్ చైర్, డోలక్, మృదంగం, పట్టు బట్టలా కనిపిస్తున్న పెద్ద క్లాత్, నిలువెత్తు సాయిబాబా ఫోటో రూమ్ డెకరేషన్ కు సంబంధించి కొన్ని వస్తువులు.
ఈ వస్తువులు ఎందుకో, వాటిని అంత బద్రంగా రూమ్ లో పెట్టి లాక్ చెయ్యడం ఎందుకో అర్థం కాలేదు.
అప్పటికే చాలా మంది వచ్చారు.. వాళ్ళలో మా స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ముఖపరిచయం ఉన్న వ్యక్తులు ఉన్నారు.
బాలవికాస్ అసోసియేషన్ పెద్దలా కనిపించే ఒక వ్యక్తి అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
మా ఆంటీ ఎక్కడ ఉందో అని వెదికాను. ఎక్కడా కనపడలేదు. అందరూ ఒక క్లాస్ రూమ్ వైపుకు వెళుతున్నారు.
మా స్కూల్ లో కొన్ని క్లాస్ రూమ్స్ పొడవుగా ఉండి కదులుతున్న ట్రైన్ ను గుర్తుకు తెస్తుంటాయి.
క్లాస్ క్లాస్ కు మద్య టెంపరరీ పార్టిషన్ ఉంటుంది. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు తేలిగ్గా పక్కకు జరపోచ్చు.
అలాంటి ఒక క్లాస్ రూమ్ లోకి వెళుతున్నారు. వారి వెంట నేను కూడా కదిలాను. క్లాస్ రూమ్ లో జంఖానాలు పరిచి ఉన్నాయి. వీఐపీ లా కనిపించే కొంత మంది ముందు వరుసలో కూర్చుని ఉన్నారు. ఎదురుగా నేను స్టోర్ రూమ్ లో చూసిన చైర్ వెయ్యబడి ఉంది. దానిపై వెల్వెట్ క్లాత్ ను కప్పారు. ఆ వెల్వెట్ క్లాత్ పై సాయిబాబా చిహ్నమైన సర్వమత లోగో ప్రింట్ చేయబడి ఉంది.
చైర్ పక్కగా కొంత మంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు. చేతిలో డోలక్, ఫ్లూట్ మొదలైన సంగీత వాయిద్యాలు ఉన్నాయి.
పది నిముషాల తరువాత సాయి భజన్స్ స్టార్ట్ అయ్యాయి. కాస్త డీప్ గా చూస్తే ఆ భజన్స్ వాళ్లకు బాగా అలవాటు ఐనట్టు ఉంది. “ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగ నాధా సుబ్రహ్మణ్యం… అంటూ పాట జోరు అందుకుంది. అందరూ భక్తి పారవశ్యంలో మునిగి ఉన్నారు. నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. ఆ చైర్ ఎందుకు వేశారో అందులో ఎవరు కూర్చుంటారో అన్న ఇంట్రెస్ట్..
సినిమాలో చూసిన సీన్స్ గుర్తుకు వచ్చాయి.. లాస్ట్ సీన్ లో హీరోయిన్ ఎమోషనల్ గా పాట పాడుతూ ఉంటే చివరలో దేవత ప్రత్యక్షం అయినట్టు ఇక్కడ సాయిబాబా ప్రత్యక్షం అవుతాడేమో అన్న సందేహం కలిగింది.
అంతే… ఆ చైర్ వైపు కన్ను ఆర్పకుండా చూడడం స్టార్ట్ చేశాను.
కనురెప్ప వేస్తే ఎక్కడ సాయిబాబా కనపడకుండా పోతాడేమో అన్న టెన్షన్ తో ఆ చైర్ వైపు అలాగే చూస్తూ కూర్చున్నా.
“సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సాయినాధా సుబ్రహ్మణ్యం…” అంటూ హై పిచ్ కి వెళ్ళిన పాట టక్కున స్లో అయ్యింది. అక్కడ ఉన్న వారు అందరూ అలిసిపోయి సేదతీరుతున్నట్టు అనిపించింది. కానీ సాయిబాబా మాత్రం రాలేదు. వచ్చి ఆ చైర్ లో కూర్చుంటాడేమో అన్న నా ఆశ ఆవిరైపోయింది. ఏదో మిరాకిల్ జరుగుతుందన్న నా ఎక్సైట్ మెంట్ ఆ క్షణంలో చప్పున చల్లారిపోయింది.
సాయిబాబా ఇక రాడు అన్న నమ్మకం కలగడంతో ఇక అక్కడ ఉండబుద్ది కాలేదు. ఇంతలో మరో భజన్ స్టార్ట్ అయ్యింది.. మా జూనియర్ బ్యాచ్ కోసం చూశాను. మూడో లైన్ లో కూర్చుని పెద్ద గొంతుతో భజన్స్ పాడేస్తున్నారు…
పాపం వారి ఆవేశాన్ని డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక నెమ్మదిగా ఆ రూమ్ నుండి బయటపడ్డాను. చివరి లైన్ లో ఉన్న నేను మా ఆంటీకి కనపడకుండా నెమ్మదిగా బయటకు జారుకున్నాను.
బయట… అంతా ప్రశాంతంగా ఉంది.
కాస్త దూరంగా ఉన్న క్లాస్ లో కూర్చోవడం వల్ల భజన్స్ లీలగా వినిపిస్తున్నాయి.
ఇంతలో మా ఆంటీ నన్ను వెదుక్కుంటూ వచ్చింది. నేను అక్కడ కూర్చునందుకు ఒక చిన్న క్లాస్ పీకి నన్ను భజన్స్ జరుగుతున్న క్లాస్ లోకి తీసుకువెళ్ళింది..
అక్కడ కూర్చోవడం ఇబ్బందిగా ఉంది. నాకు ఈ భజన్స్ అంటే చిరాకు… ఈ నరకం ఇంకా ఎంతసేపో అన్న నిరుత్సాహంలో ఉండగా అమృతవాక్కుల్లా కొన్ని మాటలు వినిపించాయి
“మంగళహారతి” భజన్స్ అంతా అయిపోయాక మంగళహారతి ఉంటుంది. బాలవికాస్ హెడ్ లా కనిపించే వ్యక్తి పెద్ద కర్పూరం వెలిగించి ఆ ఖాళీ కుర్చీకి హారతి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. కనీసం అప్పుడైనా సాయిబాబా వచ్చి ఆ చైర్ లో కూర్చుని హారతి అందుకుని అందరిని దీవిస్తాడేమో అన్న ఆశ కలిగింది.

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY