పెళ్లికి ముందు…ప్రేమించుకునే వయసులో నువ్వే జీవితంగా బ్రతికే అబ్బాయి పెళ్లయ్యాక బాధ్యతలనూ పంచుకోవాలి…వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ శ్రీ &శ్రీమతి (06-08-2017)

(గతసంచిక తరువాయి)
“చందనా…”ఇదివరకు ఇలా అనేదానివా?”
”అప్పుడు వేరంకుల్ బరువూ – బాధ్యతలు లేవు.. నాకు మందులకు, ఇంట్లో ఖర్చులకు…పైగా ఆఫీసులో టెన్షన్లు” అంది.
చందన కళ్లకింద చారికలు వచ్చేశాయి.
”చూశావా చందనా …నీవరకు వచ్చేసరికి నువ్వెలా ఎస్కేప్ అవుతున్నావో?” అన్నాడు లాయర్ అంకుల్.
”అదేమిటంకుల్ అలాగంటారు?”
”సమస్యలు ఎక్కువయ్యేకొద్దీ సరదాలు సర్దుకోవాలి. నీ భర్త సమస్యలను అర్ధం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించలేదు. ప్రేమ తగ్గింది అన్నావు? అదే నువ్వు ఒక్కప్పుడు ప్రేమగా చూసుకునే నీ తమ్ముడ్ని కసురుకున్నావు. అదేమిటంటే సమస్యలన్నావు. రోజూ సాయంత్రమే ఇంటికొచ్చే నువ్వు ఏ అర్ధరాత్రో ఇంటికొస్తున్నావు. అదేమిటంటే నీమీద బాధ్యత పెరిగిందన్నావు.
రైట్…ఒప్పుకుంటానమ్మా…అలాగే నీ భర్త పరిస్థితి ఉంటుందని ఎందుకనుకోలేదు.
నీ తండ్రి బ్రతికి వున్నప్పుడు నువ్వు తండ్రిచాటుబిడ్డవి. అప్పుడు హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు బాధ్యతలు, బరువులు పంచుకుని మోయాల్సిన బిడ్డవి.
అలాగే భర్తకూడా అంతే. పెళ్లికి ముందు అతనికి సంసార బాధ్యతలు వుండవు. నీలో ప్రయివసీగా ఉండడానికి వుండే సమయం కొద్దిగానే ఉంటుంది. అందుకే ఆ కొద్దీ సమయాన్ని నీ దగ్గర గడపాలనుకుంటాడు.
పెళ్లయ్యాక…బరువు, బాధ్యతలు పెరుగుతాయి. తనకంటూ ఓ కుటుంబం…పిల్లలు, ఇలా సమస్యలూ, బాధ్యతలూ పెరుగుతాయి. అసలు జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది. అందుకే కొన్నిసరదాలూ చంపుకోవాల్సి వస్తుంది. సగటు మధ్యతరగతి మనిషి జీతం రాగానే ఆ డబ్బులతో పిల్లలకు స్వీట్లు, పళ్లు తెస్తాడు. కానీ ప్రతిరోజూ తీసుకువస్తారా? రారు.ఎందుకు…? జీతం వచ్చిన ఒక్కరోజైనా ఆనందంగా గడపాలని. అలా అని రోజూ ఎందుకు తీసుకురారం ఆ భార్య, పిల్లలు తండ్రిని నిలదీస్తే ఏం చెబుతాడా తండ్రి?
ఏ పండుగకో కొత్త బట్టలు వేసుకుంటే బాగానే వుంటుంది. రోజూ వేసుకోవాలనుకోవడం మూర్కత్వం కాదా?
భార్యాభర్తల మధ్య వుండాల్సింది నమ్మకం…అది లేకపోతే కాపురం చేయడం అనరు, వ్యభిచారం చేస్తున్నారంటారు.
పెళ్లికి ముందు…ప్రేమించుకునే వయసులో నువ్వే జీవితంగా బ్రతికే అబ్బాయి పెళ్లయ్యాక బాధ్యతలనూ పంచుకోవాలి…అప్పుడుకూడా నీకోసమే తిరిగితే…బాధ్యతలను విస్మరిస్తే…మీరు బ్రతకలేరు.
అది సృష్టి సహజం…ప్రేమ మనసులో వుండాలి. అది చచ్చిపోయేది కాదు.
అలాంటిది ప్రేమకాదు.
నీకో విషయం తెలుసా? నువ్వు మీ ఇంట్లో ఇచ్చే డబ్బు కుటుంబానికి నీకు సరిపుతుందనుకున్నావా? లేదు…చరణ్ నీకు తెలియకుండానే నీ కుటుంబానికి సాయం చేస్తున్నాడు.
అదీ…అదీ ప్రేమంటే…భార్య బాధ్యతలను కూడా పంచుకోగలిగినవాడే భర్త.
నీ ఆరోగ్యం కోసం ప్రతీ రోజూ డాక్టర్ ని కనుక్కుంటున్నావా. డాక్టర్ మీ నాన్న పరిచయం అంటూ ఫీజులేకుండా చూస్తుంటే నిజమేననుకున్నావా? కాదు. ఆ ఫీజు నీ భర్త చెల్లిస్తున్నాడు.
అదీ…అదీ నిజమైన ప్రేమంటే. భార్య ఆరోగ్యాన్ని తన కంటిపాపలో చూసుకోగలవాడే భర్త.
ఓవైపు తన ఉద్యోగ నిర్వహణలో అనుక్షణం తలమునకలవుతూ, మరోవైపు నిన్ను అపురూపంగా చూసుకోవాలనుకుంటున్న చరణ్నీ కు భర్తే కాదు , దైవంకూడా కావాలి.
నువ్వు ఇన్ని నెలలు దూరంగా వున్నా వయసులో వున్న నీ భర్త తన కోరికలను చంపుకున్నాడు. మరో వ్యక్తి అయితే విడాకులు ఇచ్చేవాడు.

(ముగింపు వచ్చేవారం)

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY