ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేస్తూ ఎవరిని నిద్ర పోనీయనని తెలిసి నన్ను బయటకు పంపడమే బెస్ట్ అనుకున్నట్టు…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (06-08-2017)

(గత సంచిక తరువాయి)
ఏక పాత్రాభినయం
బాలవికాస్ కి రెగ్యులర్ గా వెళ్ళడం స్టార్ట్ అయ్యింది. అప్పటికే నాకు తెలుగుపై పట్టు ఉండడంతో శ్లోకాలు, పద్యాలు, పురాణాలు వంటపడ్డాయి. సాయిబాబాపై నమ్మకం లేకపోయినా ఆదివారం బోర్ కొట్టడం మాత్రం తగ్గింది.
ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేస్తూ ఎవరిని నిద్ర పోనీయనని తెలిసి నన్ను బయటకు పంపడమే బెస్ట్ అనుకున్నట్టు ఉన్నారు. ఆదివారం మూడు గంటలకు బాలవికాస్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మనకు ఎలాగూ నిద్ర పట్టదు. పైగా మా జూనియర్ బ్యాచ్ మొత్తం బాల వికాస్ అంటూ వెళ్ళిపోతారు. ఇక ఒక్కడే ఉండలేక నేను కూడా బాలవికాస్ బాట పట్టాను.
క్రమంగా ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా క్లోజ్ అయ్యింది. ఇలా ఉండగా ఒక రోజు ఆంటీ బాలవికాస్ క్లాస్ అయిపోగానే నన్ను పిలిచింది. మా జూనియర్స్ బయట వెయిట్ చేస్తుండగా నేను ఆంటీ ఇంట్లోకి వెళ్లాను. అక్కడ ప్రదీప్ అన్న (ఆంటీ పెద్ద కొడుకు) ఆంటీతో పాటు కూర్చుని ఉన్నాడు.
“త్వరలో ఈశ్వరమ్మ డే సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. అందులో పాటలు, డ్రామాలు ఉంటాయి” అన్నారు. మే ఆరో తేదీ రావడంతో స్కూల్స్ కూడా క్లోజ్ చేసి ఉంటారు. హాలిడేస్ లో క్రికెట్ ఆడడం తప్ప మనకు పెద్దగా పని ఉండదు. ఇక బాలవికాస్ లో డ్రామాలు అనగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.
“నువ్వు దుర్యోధన ఏకపాత్రాభినయం చెయ్యాలి రా” అని ఆంటీ అన్నారు. నాకు పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డం పడ్డట్టు అయ్యింది.
ఏకపాత్రాభినయం అంటే అర్థం కూడా తెలియని వయసు. అయినా స్టేజీ.. డ్రామా అనగానే ఇక ఉత్సాహం పట్టలేక సరే అనేశాను.
ఆంటీ అలా అని ప్రదీప్ అన్న వైపు చూసింది. నేను కలలో తెలిపోతున్నాను.
డ్రామా… మరోసారి స్టేజ్ ఎక్కడం… అంత మంది చూస్తుండగా యాక్టింగ్…
అబ్బో… అబ్బబ్బో… ఆంటీ ఆపై ఏమి చెప్తుందో నాకు అర్థం కావడం లేదు… అర్థం కావడం లేదు అనడం కన్నా నేను వినడం లేదు అన్నది కరెక్ట్..
అప్పుడే దుర్యోధనుడిలా ఊహించుకుంటూ ఎక్కడో తేలిపోతున్న నన్ను ఆంటీ తలపై ఒక మొట్టుతో ఈ లోకంలోకి తెచ్చింది.
“రేయ్… ప్రదీపన్నతో బయలుదేరు” అని నన్ను బయలుదేరదీసింది.
ఎక్కడికి ఎందుకు అన్న మాట నా నోట్లో రాకుండానే బయలుదేరాను.
అన్న చేతక్ బండిని బయటకు తీశాడు.. తిరుపతిలో మనకు తెలియని ప్లేస్ అంటూ లేదు. ఎక్కడకు తీసుకువెళతాడో అన్న ఇంట్రెస్ట్ మనసులో ఉరకలు వేస్తుండగా నేను అన్న వెనుకనే కూర్చున్నాను.
బండి భవానీ నగర్ దాటి వీవీ మహల్ వైపు కదిలింది. అక్కడ నుండి మా ఇల్లు దగ్గరే… శ్రీనివాసా థియేటర్ దాటి తీర్థకట్ట వీదిలోకి తిరిగింది.
ఎక్కడకు వెళ్ళినా మనకు టెన్షన్ లేదు…
అప్పటికే ఉండబట్టలేక ఎక్కడకు అన్నా అని రెండు మూడు సార్లు అడిగాను.
చెప్తా రా అంటూ ఏ విషయం చెప్పకుండా కదిలాడు

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY