ఒక్కో అక్షరాన్ని ప్రాణం పెట్టి రాస్తున్నట్టుంది.గుప్పెడంత ఆకాశం ధారావాహిక కల్పితకథలా కాదు…ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి గుప్పెడంత ఆకాశం (13-08-2017)

ఫీడ్ బ్యాక్ 
ఒక్కో అక్షరాన్ని ప్రాణం పెట్టి రాస్తున్నట్టుంది…గుప్పెడంత ఆకాశం ధారావాహిక కల్పితకథలా కాదు.రచయిత్రి ఆశయంలా వుంది.ఒక మంచి ధారావాహిక రచిస్తోన్న రచయిత్రికి,ప్రచురిస్తోన్నసంపాదకులకు …నమస్సులతో…రాఘవానందయ్య (కాకినాడ)
(9)
డాక్టర్ ప్రియాంక తన ఎదురుగా ఉన్న వృద్ధురాలివైపు చూస్తోంది.వృద్ధాప్యం ఛాయల కన్నా అలిసిపోయి,అయినవారి చేతిలో మోసపోయిన బాధ తాలూకూ నీలిచాయలు ఆమె మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి గత కొద్దిరోజులుగా ఆ వృద్ధురాలు హాస్పిటల్ లోనే వుంది. ఆమెకు అన్ని ఆరోగ్యపరీక్షలు చేయడం జరిగింది.
“మీపేరు? అడిగింది డాక్టర్ ప్రియాంక
“అనాథలకు పేర్లుండవు తల్లీ…పోనీ అమ్మ అనుకో…పిల్లల నిర్లక్ష్యానికి గురయ్యేవారు అమ్మలే కదా..”ఆమె మాటల్లో డిప్రెషన్ కన్నా నిర్లిప్తత ఎక్కువగా కనిపిస్తోంది.
“జీవితాన్ని చదివిన మీరు…ఢిల్లీ యూనివర్సిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో గోల్డ్ మెడల్ అందుకున్న మీరు..ఎన్నో చెస్ పోటీల్లో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సంపాదించిన మీరు…ఇలా మాట్లాడొచ్చా …రూపమతీ మేడం?
ఒక్కక్షణం స్థాణువైంది రూపమతి…కొన్నేళ్లు వెనక్కి వెళ్తే జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో చెస్ పోటీలో మేటి అనిపించుకున్న దిగ్గజం….
“మీకు …మీకెలా తెలుసు? ఆమె గొంతులో ఆశ్చర్యం…అసలు నేనెక్కడ వున్నాను..?మీరంతా ఎవరు?నన్ను ఇంత బాగా కడుపున పుట్టిన పిల్లలు కూడా చూసుకోనంత బాగా చూసుకుంటున్నారు? నాకు ఆరోగ్య పరీక్షలు చేసారు..నా గురించి శ్రద్ధ తీసుకునున్నారు…అన్నింటికన్నా నా గతాన్ని తవ్వితీశారు…
“నేను చెబుతాను…ముందు మీరు ఈ పేపర్స్ మీద సంతకం చేయండి”లోపలికి  వస్తూ అంది లాయర్ సాత్యకి ఆమె చేతిలో పేపర్స్ వున్నాయి.
“ఏమిటివి? వాటి వంక చూసి అడిగింది రూపమతి.
“మీ ఆస్తులను నగలను అన్నింటినీ మీ అనుకునే మీ వాళ్ళు లాక్కున్నారు…కానీ మీరు ప్రాణప్రదంగా భావించే చెస్ అకాడెమీని లాక్కున్నప్పుడు మీరు దాదాపు పిచ్చివాళ్లయ్యారు….నమ్మినవాళ్ళ చేతిలో మోసపోయామన్న బాధ కన్నా ఎందరో చెస్ ఛాంపియన్స్ ను తయారుచేయాలన్న మీ కోరిక తీరలేదన్న బాధతో ..చివరికి ఇలా తయారయ్యారు …మీ ఆస్తులు సంపద వదిలేద్దాం..కానీ మీరు ప్రాణంగా భావించే చెస్ అకాడమీ స్థలాన్ని మీకు తిరిగి అందించడానికి…న్యాయపరమైన పోరాటానికి,,మీ అనుమతి కావాలి”లాయర్ సాత్యకి చెప్పింది
రూపమతి కళ్ళలో నీళ్లు తిరిగాయి.తన చేతిలో చిల్లిగవ్వ లేదు…డబ్బు లేకుండా ఏ పనీ జరుగదు..లాయర్స్ కు ఫీజు ఇచ్చుకోలేదు..అందుకే నిస్సహాయంగా మిన్నకుండిపోయింది..కానీ ఇప్పుడు…తన కేసును ఉచితంగా…
“ఇది కలా నిజమా?భ్రమా?వాస్తవమా? తనలో తానే గొణుక్కున్నట్టు అంది రూపమతి.
“నిజం..అంతేకాదు..మీరు కేసు గెలిచేవరకూ… మీకిష్టమైన చెస్ ప్రాక్టీస్ చేయడమే కాదు…,మీకు అభ్యంతరం లేకపోతే తోటి వృద్ధులకు,చిన్నారులకు ఇందులో శిక్షణ ఇవ్వొచ్చు ..మీలాంటి చెస్ ఛాంపియన్స్ ను తయారు చెయ్యవచ్చు ”
“నేనా…నాకు అంత అదృష్టమా..”?ఆమె గొంతులో ,ఆనందం ..ఆశ్చర్యం…భావోద్వేగం..ముప్పొరిగొన్నాయి….
“మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను…మీ పాదాలకు ప్రణమిల్లుతున్నాను…”లేచి వాళ్ళ పాదాలు తాకబోయింది.
“వద్దు …మిమ్మల్ని తిరిగి భారతదేశపు చెస్ చాంపియన్ ఐకాన్ గా చూడాలన్న కోరిక..మాది కాదు..మిమ్మల్ని ఇక్కడివరకూ తీసుకువచ్చి మీ ఆరోగ్యాన్ని పరీక్షించి…మిమ్మల్ని సగౌరవముగా ఈ ప్రపంచం ముందు నిలబెట్టాలనుకున్నది..మేము కాదు…”లాయర్ సాత్యకి డాక్టర్ ప్రియాంక ఒకేసారి చెప్పారు.
“మరి ఆ దైవం ఎవరు…మానవత్వానికే ప్రాణం పోసిన ఆ మానవతా మూర్తి ..స్ఫూర్తి ఎవరు?ఆమె గొంతులో ఉత్సుకత…
డాక్టర్ ప్రియాంక తలెత్తి చూసింది…హాస్పిటల్ ప్రధాన ద్వారం దగ్గర నియాన్ లైట్ల వెలుతురులో పెద్దపెద్ద అక్షరాలతో “సుగాత్రి ఫౌండేషన్…సుగాత్రి వైద్య ప్రాంగణం…నిరుపేదల నిస్సహాయుల సేవా కేంద్రం ” అన్న అక్షరాలు…
లాయర్ సాత్యకి రూపమతి వైపు చూసి చెప్పింది…”ఇక్కడ సుగాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లీగల్ సెల్ వుంది….అవసరమైన న్యాయసలహాలు ఉచితంగా అందుతాయి. ఫీజు లేకుండా ఇక్కడ లాయర్స్ కేసులు వాదిస్తారు.న్యాయం అనిపించినా కేసులు,మానవత్వాన్ని గెలిపించే కేసులే తీసుకోవడం జరుగుతుంది.గెలిచినవారు ఇక్కడ సేవలు అందిస్తే చాలు..మరికొందరికి సాయం చేయగలిగితే చాలు…”
“మీ గొప్పమనసుకు చేతులెత్తి నమస్కరించాలి తల్లీ….లక్షల కొద్దీ సంపాదించే అవకాశం వున్నా…”ఆమె మాటలు పూర్తి కాకుండానే అక్కడికి వచ్చిన జర్నలిస్ట్ నందిని అంది
“మేము వచ్చింది అనాథల ప్రపంచం నుంచి..మేము ఎదిగింది సుగాత్రి మేడం ఆశ్రయంలో ..
మేము పెరిగింది సుగాత్రిమేడం మంచితనం ఒడిలో…
నేను కుప్పతొట్టిలో దొరికాను ..ఈ లాయర్ ను చిన్నప్పుడే వ్యభిచార ముఠాలకు తరలిస్తుంటే పదేళ్ల వయసులో కాపాడి చదువు చెప్పించి లాయర్ ని చేసారు సుగాత్రి మేడం…
ఈ డాక్టర్ పదిహేనేళ్ల క్రిందట బాల్యవివాహానికి గురై భర్త పెట్టే గృహహింస తట్టుకోలేక చావబోతుంటే కాపాడి డాక్టర్ చదువును చదివించిన దేవత సుగాత్రి మేడం…
యాసిడ్ దాడిలో గాయపడి మొహం వికృతంగా కాలిపోతే ఆదుకుని ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఐపీఎస్ రాయించి పోలీస్ అధికారిగా ఏసీపీ వసుమతిగా తీర్చిదిద్దింది సుగాత్రి మేడం…
అక్కడ ఒక అద్భుతం తాలూకూ కథనం పురుడుపోసుకుంటుంది.ఒక చైతన్యానికి..ఒక సమాజహితానికి…భవిష్యత్తు చరిత్రలో చరిత్రగా నిలిచిపోయే ఆశయాన్ని మూలలను నెమరుసుకుంటుంది.
ఇలా ఎన్నదరినో తీర్చిదిద్దిన ఆ మహామనిషి నీడలో నాలాంటి మాలాంటి ఎందరో సేదతీరుతున్నారు..సేవామార్గంలో ముందుకు కదులుతున్నారు…మేము వేసుకున్న ఈ వృత్తిపరమైన హోదాపరమైన దుస్తులు సుగాత్రి మేడం చలువే.” భావోద్వేగంతో చెప్పింది నందిని.
“ఆ తల్లిని చూడాలని వుంది”అంది రూపమతి.
“ఆ తల్లి తీర్చిదిద్దిన సుగాత్రి ఫౌండషన్స్ కు మనమిప్పుడు వెళ్తున్నాం…ఒకప్పుడు అది ఊరి చివరి స్మశానం…మరుభూమి…”చెప్పింది డాక్టర్ ప్రియాంక.కానీ ఇప్పుడు…
మరుభూమిని పచ్చదనాల అనుబంధాల ఆప్యాయతల స్ఫూర్తినిచ్చే హరితవనంగా మార్చిన సుగాత్రి ఫౌండేషన్ కు స్వాగతం…

(గుప్పెడంత ఆకాశంలో చిన్న విరామం)

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

NO COMMENTS

LEAVE A REPLY