దాన వీర శూర కర్ణకు షార్ట్ నేమ్ అని చెప్పాడు…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (13-08-2017)

(గత సంచిక తరువాయి)
ప్రదీపన్న నన్ను డైరెక్ట్ గా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకు వెళ్ళాడు.
ఎందుకో ఏమిటో తెలియని నేను అన్న వెంట లోనికి వెళ్లాను. ప్రదీపన్న, అతని ఫ్రండ్స్ పుట్టపర్తిలో చదువుకున్నారు. ప్రదీపన్న నాకన్నా రెండేళ్లు పెద్ద.
కాసేపటికి నాకు బోర్ కొట్టడం స్టార్ట్ అయ్యింది. ఎంతసేపు వాళ్ళ స్కూల్ విషయాలు తప్ప నాకు ఇంట్రెస్ట్ కలిగే ఏ విషయమూ వారి మాటల్లో నాకు కనపడలేదు.
ప్రదీపన్న నా అనీజీనెస్ కనిపెట్టినట్టు ఉన్నాడు.
డి.వి.ఎస్.కె ఉందా అంటూ వాళ్ళ ఫ్రండ్ ని అడిగాడు. నాకు అర్థం కాలేదు. అతను లేదు అంటూ సమాధానం చెప్పాడు.
మేము ప్రదీపన్న ఫ్రండ్ ఇంటి నుండి బయటపడగానే అడిగాను.
“అన్నా… డి.వి.ఎస్.కె అంటే ఏమిటని..”
దాన వీర శూర కర్ణకు షార్ట్ నేమ్ అని చెప్పాడు
అప్పటికే ఆలోచించి బుర్ర పాడుచేసుకున్న నేను ఆ మాటతో చప్పున చల్లారిపోయాను.
“ఇంతకూ మీ ఫ్రండ్ ను అడిగింది ఏమి?” అంటూ అడిగాను
డి.వి.ఎస్.కె వీడియో కేసెట్ అని చెప్పాడు
“ఓస్ ఇంతేనా.. నాతో రా అన్నా.. నేను కేసెట్ షాప్ కి తీసుకువెళతాను…” అంటూ స్కూటర్ దగ్గరకు నడిచాను.
తిరుపతిలో మనకు తెలియని కేసెట్ షాప్ లేదు. మనం తెలియని కేసెట్ షాప్ వాడు లేడు.
తిరుపతిలో అప్పట్లో ఫేమస్ గా ఉన్న విజయా వీడియో విజన్ తీసుకువెళ్లాను
డి.వి.ఎస్.కె మాస్టర్ ప్రింట్ కావాలి అని అక్కడే కూర్చున్నాను.
కౌంటర్ లో ఉన్న వాడు మా ఫ్రండ్ కావడంతో ఇప్పుడే వస్తా అంటూ షాప్ బయటకు వెళ్ళాడు.
పది నిముషాలలో ప్రత్యక్షం అయ్యాడు. వాడి చేతిలో మాస్టర్ ప్రింట్ ఉంది. కొత్తగా వచ్చినట్టు ఉంది కేసెట్. మా ముందే సీల్ విప్పి మా చేతిలో పెట్టాడు.
ప్రదీపన్నకు ఒక రకంగా షాక్ లా అయ్యింది.
“నీకు ఇంత టాలెంట్ ఉందేమిరా” అంటూ ఆశ్చర్యపోయాడు…
అప్పుడే ఏమి చూశావు అంటూ అన్న వైపు చూశాను.
కేసెట్ బద్రం మామా అంటూ షాప్వాడు వెనుక నుండి అరుస్తున్నా పట్టించుకోకుండా ఆంటీ వాళ్ళ ఇంటికి బయలుదేరాం.
అప్పటికే సాయంత్రం ఐదు గంటలు అయ్యింది.
ప్రదీపన్నకు ఏదో పని ఉందంటూ కేసెట్ నా చేతిలో పెట్టి ఇంట్లో ఇమ్మని బండి తీసుకుని వెళ్ళిపోయాడు.
మనకు నడక అలవాటు.. పైగా నడవడం అంటే చాలా ఇష్టం. ఇక గాంధీ రోడ్ నుండి భవానీనగర్ వరకు నడుచుకుంటూ వెళ్లాను. ఆంటీ వాళ్ళ ఇల్లు చేరడానికి దాదాపు అర్థగంట పట్టింది. పైగా ఆంటీ వాళ్ళ ఇంటికి మా ఇంటిమీదుగానే వెళ్ళాలి.
ఇంటికి వెళితే కేసెట్ మిస్ అవుతుందేమో అన్న టెన్షన్ తో ఇంటికి వెళ్ళకుండా సరాసరి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్లాను.
మనం పొద్దున్న ఇల్లు వదిలితే ఇక రాత్రే ఇంటికి వెళ్ళడం.. ఆ విషయం మా ఇంట్లో బాగా తెలుసు. ఇంట్లో ఉండమన్నా ఉండడం చాలా కష్టం. అందుకే పెద్దగా పట్టించుకోరు.

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY