ప్రేమంటే కాలం గడిచేకొద్దీ- పదిలంగా వుండే గతం తాలూకు అందమైన …వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ శ్రీ &శ్రీమతి (13-08-2017)

మీ అభిమానాన్ని స్వంతం చేసుకున్న శ్రీ&శ్రీమతి సీరియల్ ఈ వారంతో అయిపొయింది.
ఈ పుస్తకం కినిగె ద్వారా ఇ.బుక్ గా విడుదలైంది.
ఆగష్టు 15  తేజారాణి తిరునగరి బర్త్ డే.
తేజారాణి తిరునగరికి పుట్టినరోజు శుభాకాంక్షలు
                              …చీఫ్ ఎడిటర్    

అతనితో జీవితాన్ని తెంచుకోవాలని నువ్వు అనుకుంటే, నీలో పంచుకున్న జీవితాన్ని అతను మరొకరితో పంచుకోకూడదనుకుంటున్నాడు.
అతనికి దూరంగా వుండి నువ్వేం సాధించావు. అతడ్ని అనుక్షణం మానసికంగా సాధించావు అంతే…నీ దాకా వస్తే తప్ప సమస్య నీకు అర్ధం కావడంలేదు కదా!” ఆగాడు లాయర్ అంకుల్.
అప్పుడే ఆపిల్స్ పట్టుకుని వచ్చాడు చరణ్ . స్వీటు ప్యాకెట్ తీసి మైసూర్ పాక్ ముక్క చేతిలో పట్టుకుని ”చందనా నోరు తెరు” అన్నాడు అప్రయత్నంగా నోరుతెరిచింద.
అంతమంది వున్నారని కూడా గమనించకుండా మైసూర్ పాక్ ముక్కని హారిక నోట్లో పెట్టాడు.
”నాకు కంపెనీ ఎం.డీ.గా ప్రమోషన్ వచ్చింది. కారు, ఫ్లాట్ ఇస్తున్నారు. ఇకనుండి నీకే కష్టం రానివ్వను, ప్రామిస్” అన్నాడు చిన్న పిల్లాడిలా. అప్పుడు….అప్పుడు తన్నుకొచ్చింది దుఃఖం. ఇంకా …ఇంకా తన భర్త తనని ప్రేమిస్తున్నాడు. తాను ద్వేషించినా…తనని ప్రేమిస్తున్నాడు.
మనసు ఆర్ద్రమై, కన్నీళ్లు ఓదార్చే నేస్తాలై కనుకొలుకుల సరిహద్దులు దాటి బయటకొచ్చి భర్త పాదాలను స్పృశించాయి.
ఆర్తిగా భార్య నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు.
ఆమె హృదయనేత్రం తెరుచుకుంది.
ఉపసంహారం…
మార్చి 26
ప్రేమంటే కాలం గడిచేకొద్దీ- పదిలంగా వుండే గతం తాలూకు అందమైన స్మృతి.
ప్రేమంటే కనుకొలుకులు దాటి…నేను నీ దానినే సుమా అని చెప్పి ఆత్మార్పణ చేసుకునే త్యాగం . నా మనసులో రాజ్యమేలిన అజ్ఞానమనే నిశ్శబ్దం విధ్వంసమైంది.
మూడువందల అరవై ఐదురోజుల ప్రేమ సాక్షిగా నువ్వు నావాడివి.
అందుకే నావైన కన్నీళ్లతో నీకు పాదాభివందనం చేస్తున్నాను.
ప్రేమంటే మన జీవితాంతం వుండే అద్భుతమైన పదం. రెండు కన్నీటి చుక్కలు ఆనందభాష్పాలలుగామారి డైరీలోని ఆ పేజీమీద సంతకం చేశాయి.
శుభం
దాంపత్యాని అర్థాన్ని తెలుసుకునే ప్రతీఒక్కరికీ ఈ నవల అంకితం  …రచయిత్రి
(అయిపోయింది)

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY