ఒక్కసారిగా విశ్వకర్మ ఆ దేవదేవుడి ఆజ్ఞతో ,ఓ మంచి మనిషి మానవతా నిష్ఠతో చేసిన తపస్సుకు మెచ్చి…ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి గుప్పెడంత ఆకాశం (20-08-2017)

ఫీడ్ బ్యాక్
రచనను తపస్సులా,అక్షరాలను అసిధారా వ్రతంలా భావిస్తూ భావోద్వేగాలను పరిచయం చేస్తూ కొత్తప్రపంచంలోకి తీసుకువెళ్తోన్న రచయిత్రి శ్రీసుధామయి కి కృతఙ్ఞతలు.ఇంత మంచి సీరియల్ ను అందిస్తోన్న మేన్ రోబో కు ధన్యవాదాలు …సుష్మ ,మనోహర్ ,కీర్తన(హైద్రాబాద్)
(10)
వర్షానికి ముందు వచ్చే మట్టి వాసన
నగర కాలుష్యాన్ని దాటి స్వచ్ఛమైన సస్యశ్యామల హరిత ప్రపంచంలోకి అడుగుపెట్టింది మినీ బస్సు.నగరానికి దూరంగా విసిరివేయబడినట్టు వున్న ఆ ప్రాంతం…
ఒకప్పుడు …
విషాదం చేతబడి చేసినట్టుగా ఉండేది.

***

కానీ ఇప్పుడు…
ఒక్కసారిగా విశ్వకర్మ ఆ దేవదేవుడి ఆజ్ఞతో ,ఓ మంచి మనిషి మానవతా నిష్ఠతో చేసిన తపస్సుకు మెచ్చి సృష్టించి ,నిర్మించిన సామ్రాజ్యంలోకి అడుగుపెట్టినట్టు…
సుగాత్రి ఫౌండేషన్ అని పచ్చగడ్డి మీద తెల్లగులాబీలతో చెక్కినట్టున్న అక్షరాలు స్వాగతం పలుకుతున్నాయి.
రోడ్డుకు ఇరువైపులా స్వచ్ఛందంగా నాటిన మొక్కలు…నిస్వార్థంగా ఎదిగి ఆహ్వానం పలుకుతున్నట్టున్నాయి.
ఆకాశం నుంచి మబ్బులు తొంగి చూస్తున్నాయి ఎప్పుడెప్పుడూ హర్షించి వర్షిద్దామా అన్నట్టు….
స్వచ్ఛమైన గాలి..ధారాళమైన గాలి…అక్కడక్కడా పర్ణ కుటీరాలు…
ఆ మినీ బస్సు లో జర్నలిస్ట్ నందిని ,డాక్టర్ ప్రియాంక.లాయర్ సాత్యకి ,ఏసీపీ వసుమతి వున్నారు.
వారితో పాటు కొందరు పిల్లలు వున్నారు.ఇద్దరు మహిళలు.వున్నారు..వాళ్ళ దుస్తులు చిరిగి వున్నాయి.
రూపమతి ఒక సంభ్రమాశ్చర్య ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు ఫీలయింది.
జర్నలిస్ట్ నందిని గొంతు విప్పింది
“ప్రతీరోజు నగరంలో అనాథలైన పిల్లలు ,నిస్సహాయులైన మహిళలు…ఆశ్రయం లేక అల్లాడిపోయే వృద్ధులు ఈ ప్రపంచంలోకి …సుగాత్రి ఫౌండేషన్ లోకి అడుగు పెడుతారు.సుగాత్రి ఫౌండేషన్ ఒకేరోజులో నిర్మించబడిన దేవాలయం కాదు…సంవత్సరాల కృషి.ఊహ తెలిసాక మేము అడుగుపెట్టింది ఒక స్మశాన వాటికలోకి…కొన్ని పదుల ఎకరాల స్థలంలో విస్తరించి వున్న ఈ ప్రాంతాన్ని చాలా కాలం క్రిందట స్మశానంగా ,చెత్తను పోగుచేసే స్థలంగా రాళ్ళూ రప్పలతో నిండి ఉండేది.ఒక జమీందారు కు మిగిలిన చివరి ఆస్తి…కోట్ల విలువైన అతని సంపదను తీసుకుని కన్నతండ్రిని బయటకు సాగనంపారు.అప్పుడు పనికిరాకుండా పోయిన ఈ ప్రాంతంలో తలదాచుకున్నాడు.
ఈ స్థలం ఆ జమీందారీదే
స్మశానమని,పనికిరాని ప్రాంతమని నిర్లక్ష్యం చేసారు.అతని చివరిరోజుల్లో సుగాత్రి మేడం కన్న కూతురిలా సేవలు చేసింది.అమ్మలా ఆదరించింది.ఈ స్మశానాన్నిహరితవనంగా మార్చింది.నిస్సహాయులైన మహిళలకు ధైర్యం చెప్పింది.
కుప్పతొట్టి పాలైన పిల్లలను చేరదీసింది.
నిరాశ్రయులకు ..నిర్లక్ష్యానికి గురైన వృద్ధులకు తానే బిడ్డయ్యింది…ఇంటిపెద్దయ్యింది.రాత్రీ పగలు తేడా లేకుండా కష్టపడింది….
చాలా మందికి తెలియని విషయం..సుగాత్రి మేడం గొప్ప రచయిత్రి కవియిత్రి చిత్రకారిణి…బయట ప్రపంచానికి ప్రతిమ సూపర్ మార్కెట్ నడిపే వ్యక్తిగానే తెలుసు…
కానీ ఒక్కక్షణం ఆగి కొనసాగించింది..నందిని…
సువిధ పేరుతో ప్రముఖ ఆంగ్ల పత్రికల్లో పేదరికం గురించి,మహిళల సమస్యల గురించి వ్యక్తిత్వ వికాసం గురించి రాసిన కథనాలు సుగాత్రి మేడం రాసినవే…
మన..మరణం తర్వాత మరో జీవితం అనే పుస్తకాన్ని రాసింది…ఎన్నో పెయింటింగ్స్ వేసింది..
వాటి తాలూకూ రాయల్టీ…పారితోషికం అన్నీ సుగాత్రి ఫౌండేషన్ కోసమే ఖర్చు చేస్తుంది…అందులో నుంచి ఒక్క పైసా తాను తీసుకోదు…సుగాత్రి మేడం పోరాటం వ్యక్తుల మీద కాదు..వ్యవస్థ మీద కాదు.మనుష్యుల్లోని దానవత్వం మీద..మరుగున పడిపోతున్న మానవత్వపు మూలలను పునః ప్రతిష్టించాలన్నదే ఆశయం..
నన్ను జర్నలిస్ట్ గా తీర్చిదిద్దింది సుగాత్రి మేడం….ప్రియాంకను డాక్టర్ ను చేసింది…సాత్యకి లాయర్ ,వసుమతి పోలీస్ అధికారి..ఇంకా ఎందరో మా సుగాత్రి మేడం ఫౌండేషన్ లో ఎదుగుతున్నారు..దేశానికి అవసరమయ్యే వృత్తులను శక్తులను ఆయుధాలుగా తీర్చిదిద్దుతుంది…”కళ్ళు మసకబారుతుండగా చెప్పింది..కొన్నేళ్ల క్రితం తన దీనమైన జీవితం గుర్తొచ్చింది..అప్పుడే సుగాత్రి మేడం తనను ఆదుకోకపోయి ఉంటే..ఆలోచనే భయంకరంగా వుంది…
ఏసీపీ వసుమతి ,నగరంలో వున్న డాక్టర్స్ లాయర్స్ పోలీస్ అధికారులు పాత్రికేయులు ఉపాథ్యాయులు ..వీళ్ళలో చాలా మంది “సుగాత్రి మేడం చూపించిన దయతో,ప్రేమతో ఎదిగినవారే…”.మా నుంచి సుగాత్రి మేడం ఒక్కటే ఆశించారు…”మీరు మీలాంటి వారిని ఒక్కరినైనా తయారు చేయండని?కళ్ళు తుడుచుకుంటూ కొనసాగించింది .
తన ఆశయాల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని,తన ఆనందాలను పక్కన పెట్టారు…
రూపమతి అలానే వింటూ ఉండిపోయింది i

ఈ ప్రపంచంలో ఇంత గొప్ప వ్యక్తులు వుంటారా?
ఎవరికీ వారే యమునాతీరీ లా సాగిపోయే జనసంద్రంలో ఇలాంటి ఆణిముత్యాలు …ఉంటాయా?
ఆస్తులు పెంచుకునే ఆర్థిక వ్యవస్థలో…అనుబంధాలను తెంచుకుని కరెన్సీ సొసైటీ లో…ధనమే ప్రామాణికం అనుకునే పరమ స్వార్థం ఊపిరిపోసుకున్న కలుషిత నయా ప్రపంచంలో….కళ్ళ ముందు కనిపించిన ఆ గొప్పవ్యక్తిని కనులారా చూడాలనిపించింది..
డాక్టర్ ప్రియాంక కొనసాగించింది….
సుగాత్రి ఫౌండేషన్ లో పిల్లలు స్కూల్ కు మాత్రమే కాదు..ఇష్టమైన పని చేయొచ్చు.వాళ్లకు ఆసక్తి వున్న రంగంలో తీర్చిదిద్దుతారు….మహిళలు అన్ని పనులు చేస్తారు..ఇక్కడే పండిన/పండించిన కాయగూరలు…చౌకధరలకు ప్రతిమ సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి..ఎటువంటి ఎరువులు లేకుండా పండిన కాయగూరలు..కాయగూరలు అమ్మగా వచ్చిన ఆదాయం ఫౌండేషన్ కు జమ అవుతుంది…
వృద్ధులు ఏ మాత్రం నిరాశ నిస్పృహలకు లోను అయ్యే అవకాశం లేదు… చదువుకున్న వాళ్ళు చదువురానివారికి చదువు చెబుతారు..వ్యక్తిత్వ వికాస తరగతులు..,నాటకాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళ కోసం థియేటర్ వండి…సినిమా ప్రముఖులు వచ్చి నాటకాల చూస్తారు.అలా నాటకాల్లో భేష్ అనిపించుకున్న కొందరు వృద్ధులు ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు..అయినా వారి నివాసం ఇక్కడే…
అద్భుతంగా అనిపిస్తుంది రూపమతికి ..ఇదెలా సాధ్యం..ఎంత గొప్ప ఆలోచన.. ఓల్డ్ ఏజ్ హోమ్ అని కాకుండా…అనాథ శరణాలయంలా కాకుండా..ఒక దేవాలయంలా..ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం ఎవరికీ సాధ్యం….?
ఆమె ఆలోచనలకు చిరు విరామంలా…మినీ బస్సు ఆగింది….
ఎదురుగా ఒక కొత్త ప్రపంచం…

(గుప్పెడంత ఆకాశం లో చిన్న విరామం )

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

NO COMMENTS

LEAVE A REPLY