ఇంత కష్టపడి రాత్రనక పగలనక డైలాగ్స్ నేర్చుకున్న నా టాలెంట్ ను మెచ్చుకుంటారని ఎంతో సంబరపడ్డ నాకు షాక్ కొట్టినట్టు…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (03-09-2017)

(గత సంచిక తరువాయి)
దాన వీర శూర కర్ణ డైలాగ్స్ చేతికొచ్చిన నాటి నుండి దానిని ఒక పట్టు పట్టాలని డిసైడ్ అయ్యాను. డైలాగ్ పేపర్స్ పాకెట్ లో ఉంచుకుని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుకోవడం మొదలుపెట్టాను. వారం రోజుల్లో డైలాగ్స్ మొత్తం బట్టీ పట్టాను.
వారం తిరక్కుండానే డైలాగ్స్ మొత్తం నోటికి వచ్చేశాయి. నిద్రలో లేపి అడిగినా గడగడా చెప్పడం అలవాటు అయ్యింది.
ఆదివారం మద్యాహ్నం…
బాలవికాస్ క్లాస్ లో ఆంటీ నేను నేర్చుకున్న డైలాగ్స్ చెప్పమన్నారు.
కళ్ళు మూసుకుని గడగడా చెప్పేశాను. మూడు నిముషాలలో మొత్తం డైలాగ్స్ చెప్పి ఆంటీ వైపు గర్వంగా చూశాను.
ఆంటీకి ఒక్కసారి షాక్. ప్రదీపన్నకు కూడా షాక్ లా అనిపించింది. ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
సిట్యువేషన్ చూస్తే ఆంటీ, ప్రదీపన్న హ్యాపీగా లేరు అనిపించింది.
ఇంత కష్టపడి రాత్రనక పగలనక డైలాగ్స్ నేర్చుకున్న నా టాలెంట్ ను మెచ్చుకుంటారని ఎంతో సంబరపడ్డ నాకు షాక్ కొట్టినట్టు అయ్యింది. ఇందులో నేను చేసిన తప్పు ఏమిటో అర్థం కాలేదు.
కాసేపటికి అంతా సర్దుకున్నట్టు అనిపించింది. ఆంటీ మూడ్ సరి అయినట్టు పేస్ చూస్తే అర్థం అయింది.
“గుడ్.. డైలాగ్స్ బాగానే బట్టీ పట్టావు. కానీ ఇలా స్కూల్ పాఠంలా అప్పిగిస్తే కుదరదు. డైలాగ్స్ ఎలా చెప్పాలి అన్నది నేర్చుకోవాలి” అంటూ మెత్తగా క్లాస్ పీకారు.
నాపై ఇంత నమ్మకం ఉంచి బాలవికాస్ లో ఎవరూ చేయని మోనో యాక్షన్ (ఏక పాత్రాభినయం) నా చేత చేయించడం అంటే ఆంటీకి నాపై ఎంత కాన్ఫిడెంట్ ఉందో అర్థం అయ్యింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టడం నా చేతిలో ఉంది.
అప్పుడే డైలాగ్స్ ఎలా పలకాలో అర్థం చేసుకున్నా…
డైలాగ్స్ అంటే గలగలా చెప్పడం వల్ల ప్రయోజనం లేదని బాగా అర్థం చేసుకున్నాను.
ప్రతిసారి కేసెట్ పెట్టుకుని మూవీ చూడడం కుదరదు. ఇక నా సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది.
ఇక ప్రతి డైలాగ్ కి అర్థం తెలుసుకోవడం స్టార్ట్ చేశాను.
మూడు నిముషాల డైలాగ్ పాఠం కాస్త ఐదు నిముషాల మోనో ఆక్షన్ లా మారింది.
ఆంటీ కూడా సంతోషించారు.

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY