యాక్టింగ్ నేర్పే మిషతో నేను తప్పు చేస్తే కొట్టడం స్టార్ట్ చేశారు. పైగా అందరు టీచర్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చెయ్యడం నాకు నచ్చలేదు. …స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (17-09-2017)

(గత సంచిక తరువాయి)
ఒక్క విషయం మాత్రం నాకు క్లియర్ గా అర్థం అయ్యింది. అందరూ అన్నీ చేయలేరు… చెప్పలేరు…
మా తెలుగు సర్ ని యాక్షన్ నేర్పడానికి అప్రోచ్ అవ్వడం సరికాదు అనిపించింది. ఇక మనకు దిక్కు ఒక్కరే…
నేను డ్రామా వేసిన టీంకి హెడ్ గా ఉన్న సర్.
మరుసటి రోజు స్కూల్ బ్రేక్ టైంలో ఆ సర్ ను అప్ప్రోచ్ అయ్యాను. ఆయన నేర్పడానికి ఒప్పుకున్నారు.
నాకు ఫ్రీ టైం ఉన్నపుడు కలువు నేను నేర్పుతాను అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఆయన అప్పటికే స్కూల్ లో అల్లూరి సీతారామరాజు ఏక పాత్రాభినయం వేయడం నేను చూశాను. చాలా బాగా యాక్ట్ చేశారు.
ఆ రోజు నుండి నేను సర్ ను స్టాఫ్ రూమ్ లో కలవడం స్టార్ట్ చేశాను.
యాక్టింగ్ నేర్పే మిషతో నేను తప్పు చేస్తే కొట్టడం స్టార్ట్ చేశారు. పైగా అందరు టీచర్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చెయ్యడం నాకు నచ్చలేదు. క్రమంగా ఒక విషయం మాత్రం అర్థం అయ్యింది…
యాక్టింగ్ నేర్పే ఉద్దేశ్యం లేనట్టు అనిపించింది. ఒక స్టూడెంట్ తన వద్దకు యాక్టింగ్ నేర్చుకోవడానికి రావడం టీచర్స్ అందరి ముందు గొప్పగా ఫీల్ అయ్యి ఆ అహం కోపం రూపంలో నాపై చూపిస్తున్నారు.
పైగా నా యాక్టింగ్ లో జరిగే ప్రతి చిన్న తప్పును పక్క టీచర్స్ తో చెప్పి నవ్వడం, వాళ్ళు కూడా ఆయనతో శ్రుతి కలపడం నా దృష్టిని దాటిపోలేదు.
ఇక ఇక్కడ కూడా నేర్చుకోవడం కుదరదు అన్న నిర్ణయానికి వచ్చేశాను.
ఇంతలో మరో ఇబ్బంది వచ్చి పడింది. నేను ఈ సర్ వద్ద యాక్షన్ నేర్చుకోవడం ఎవరో తెలుగు సర్ కి చెప్పినట్టు ఉన్నారు. ఆయనకు పెట్ గా ఉన్న నన్ను క్రమంగా దూరం పెట్టడం స్టార్ట్ చేశారు.
ప్రతి విషయానికి నన్నే పిలిచే మా తెలుగు సర్ నన్ను కాదని వేరేవారికి పని చెప్పడం స్టార్ట్ చేశారు.
విద్యను నేర్పే గురువులలో ఇంతటి ఈర్ష్య ఓర్వలేనితనం నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
గురువే దైవం అన్న మాటలు వింటూ పెరిగిన నేను ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులను చూడడం ఎందుకో ఒకరకంగా అనీజీ అనిపించింది. ఒకరంటే మరొకరికి ఉన్న ఈగో స్టూడెంట్స్ మీద చూపడం ఎందుకో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
ఇంతలో నాకో న్యూస్ తెలిసింది.
మా సైన్స్ టీచర్ కి మోనో యాక్షన్ లో ప్రవేశం ఉంది.
ఆయన ఉండేది మా ఇంటి దగ్గరే. నెక్స్ట్ డే సండే కావడంతో నేను ఆయన రూమ్ కి వెళ్లాను.
హాస్టల్ లా ఉంది ఇల్లు. చాలా రూమ్స్ ఉన్నాయి. ఆ ఇంట్లో పై పోర్షన్ లో ఉన్న రూమ్ మా సర్ నివాసం.
ఆదివారం ఉదయం 9 గంటలకు షార్ప్ గా మా సర్ రూమ్ తలుపు తట్టాను.
అప్పటికే టిఫిన్ చేసి ఉన్నారు. నేను రాగానే నన్ను చైర్ లో కూర్చోమన్నారు.
చిన్న రూమ్. ఒక బెడ్… టేబుల్… చైర్… నీట్ గా ఉంది. మా సర్ నా రూమ్ చూస్తే 2 డేస్ అన్నం కూడా తినడం కుదరదేమో… అంత చండాలంగా ఉంటుంది.
సర్ కి నా డైలాగ్ పేపర్ ఇచ్చాను. ఆయన నా డైలాగ్ పేపర్ పక్కన పెట్టి ర్యాక్ లో నుండి ఒక బుక్ బయటకు తీశారు.
నాకు అర్థం కాలేదు. నా డైలాగ్ పేపర్ పక్కన పెట్టడం ఎందుకో…
బుక్ లో ఒక పేజి ఓపెన్ చేసి నా ముందు పెట్టారు. అందులో హెడ్డింగ్….
“మోడరన్ దుర్యోధన… ఏక పాత్రాభినయం” అని రాసి ఉంది
ఇది నాకు ఎందుకు చూపిస్తున్నారో అర్థం కాలేదు. అడిగితే ఏమనుకుంటారో.
పైగా ముక్కోపి. షార్ట్ టెంపర్.. ఆ షార్ట్ టెంపర్ కి బలి అయిన వాడిలో నేను ఒకణ్ణి
“సురేంద్రా… నేను సొంతంగా రాసిన ఏక పాత్రాభినయం. మోడరన్ దుర్యోధన… ఒక్కసారి చదువు” అంటూ ఇచ్చారు.
***
(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY