“ఏమిటి సర్ నా పేపర్ అలా చింపేసారు” అయోమయం నన్ను చుట్టుముడుతుండగా అడిగాను…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (24-09-2017)

(గత సంచిక తరువాయి)

నాకు ఇష్టం లేకపోయినా నేను మా సర్ రాసింది చదవడం స్టార్ట్ చేశాను. నేను ప్రాక్టీస్ చేసే పేపర్ కి మా సర్ రాసినదానికి ఏమాత్రం పొంతన లేదు.
ఇక తప్పదు అన్నట్టు మొత్తం చదివాను. దాదాపు 10 పేజీలు ఉన్నాయి. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మొత్తం చదివి తల పైకెత్తాను
“ఎలా ఉంది?” మెరుస్తున్న కళ్ళతో మా సర్ అడిగాడు.
“బాగుంది సర్” అని నవ్వాను… రాబోయే ఆపద తెలియక
“మరి ఇంకేమి… నువ్వు రాసుకొచ్చిన ఏకపాత్రాభినయం వదిలేసి ఇదే ప్రాక్టీస్ చెయ్యి” అంటూ నా పేపర్ ను చింపేశాడు..
ఆ ఇన్సిడెంట్ సడన్ గా జరగడంతో ఒక్కసారి షాక్ కొట్టినట్టు అలానే చూస్తూ ఉండిపోయాను. మా సర్ కి తను చేసిన తప్పు అర్థంకాలేదు. పైగా అదేమంత పెద్ద విషయం కానట్టు నా వంక చూశాడు.
నాకు చాలా సేపటివరకు నోటమాట రాలేదు. మా సర్ నన్ను హెచ్చరించినట్టు పిలవడంతో ఈ లోకంలోకి వచ్చాను.
“ఏమిటి సర్ నా పేపర్ అలా చింపేసారు” అయోమయం నన్ను చుట్టుముడుతుండగా అడిగాను.
“ఈ రోజు నుండి ఇది ప్రాక్టీస్ చెయ్యి. మన బిల్డింగ్ పక్కన్నే జిరాక్స్ షాప్ ఉంది. అందులో ఈ బుక్ ను రెండు కాపీస్ తీసుకుని రా. నేను నీకు యాక్షన్ నేర్పిస్తాను” అంటూ నన్ను పంపించాడు.
మనం ఏదో అవుతుంది అనుకుని వస్తే మరేదో అయ్యిందేమిటా అనుకుంటూ జిరాక్స్ కోసం వెళ్లాను.
నా అదృష్టం… జిరాక్స్ షాప్ క్లోజ్ చేసి ఉంది.
ఇక ఆలస్యం చెయ్యకుండా నేను మా సర్ వద్దకు వెళ్లి షాప్ క్లోజ్ చేసి ఉంది అని చెప్పి బుక్ చేతిలో పెట్టాను.
“సర్ నాకు ఇంటి దగ్గర పనుంది… సాయంత్రంగా వస్తాను” అంటూ ఆయనకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటపడ్డాను.
తన బుక్ తీసుకువెళ్లి సాయంత్రం వచ్చేటప్పుడు జిరాక్స్ తీసుకుని రమ్మని మా సర్ వెనుక నుండి అరుస్తున్నా వినపడనట్టు వడివడిగా నడుస్తూ మా సర్ నుండి దూరంగా వెళ్ళిపోయాను…
ఉన్న ఒక్క ఆధారం నేను జిరాక్స్ తీసిన పేపర్స్. అది కూడా మా సర్ చించివేశాడు. ఈ విషయం ఆంటీకి తెలిస్తే నా తాట తీస్తుంది. ఎలారా దేవుడా అంటూ తల[పట్టుకుని కూర్చున్నాను.
అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. భోజనం చేసి ఆంటీ ఇంటికి వెళ్ళాలి. బాలవికాస్ సండే అయినా టైం దగ్గరపడుతూ ఉండడంతో డ్రామా ప్రాక్టీస్ కోసం ఎప్పుడు ఫ్రీ టైం ఐతే అప్పుడు రమ్మని ఆంటీ ఆర్డర్.
భోజనం చెయ్యమని ఇంట్లో పిలుపు రావడంతో ఇక నా ఆలోచనలకు తెరపడింది.. పేరుకు భోజనానికి కూర్చునట్టు ఉంది కాని మనసంతా పేపర్ పైనే ఉంది.
నాకున్న ప్రాబ్లం… నాకు ఏదైనా కష్టం వస్తే నేను ఒక్కడే ఆలోచించుకోవడం లేక ఒక్కడే బాధపడడం అలవాటు. ఒకరితో షేర్ చేసుకోవడం కానీ ఒకరి సలహా తీసుకోవడం కానీ అలవాటు లేదు.
ఏదో తినాలి కాబట్టి తింటున్నట్టు కాస్త ఎంగిలి పడి ఇంటినుండి బయటపడ్డాను.
నా అడుగులు ఆంటీ ఇంటి వైపు పడుతున్నా మనసు మాత్రం వద్దని మొరాయిస్తోంది. నేను చేసిన పని ఆంటీకి తెలిస్తే నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు.
పది నిముషాలలో ఆంటీ ఇంటికి చేరాను.

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY