ఏ మాత్రం తేడా వచ్చినా వాళ్ళ ముఖకవళికల వల్ల తెలిసిపోతుంది…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (15-10-2017)

(గత సంచిక తరువాయి)
నేను మొదటి డ్రామా వేసినప్పుడు పెద్దవారు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకున్నాను. యాక్టింగ్ ఎలా చెయ్యాలి, ఎలా డైలాగ్ డెలివరి చెయ్యాలి ఎక్కడ నిలబడాలి, ఎలా నిలబడాలి అన్న విషయం అన్న విషయంపై బాగా అవగాహన పెంచుకున్నాను. అందువల్ల ఏ డ్రామాలోనైనా ఎటువంటి ప్లేస్ లో నైనా యాక్టింగ్ చెయ్యడం నేర్చుకున్నాను.
డ్రామా యాక్టింగ్ లో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆడియన్స్ నాడిని చాలా ఈజీగా పట్టేయచ్చు… వాళ్ళు బోర్ ఫీల్ అవుతున్నారా లేక ఇంటరెస్టింగ్ గా ఉన్నారా అన్న విషయం వెంటనే తెలిసిపోతుంది. దానికి తగ్గట్టుగా మనం మన యాక్టింగ్ మార్చుకుంటే సరిపోతుంది.
అయినా ఆడియన్స్ అడుగు దూరంలో ఉండగా యాక్టింగ్ అన్నది సాహసంతో కూడుకున్న పనే… ఏ మాత్రం తేడా వచ్చినా వాళ్ళ ముఖకవళికల వల్ల తెలిసిపోతుంది. మనం చేసేది ఇంట్రెస్ట్ గా లేకపోతే మనకు నిరుత్సాహం వస్తుంది.
స్టేజ్ కనపడగానే నన్ను నేను మర్చిపోయే పరిస్థితిలో ఆడియన్స్ గురించి నేను పెద్దగా ఆలోచించలేదు.. నా ఫోకస్ అంతా నా నటన పైనే…
ఎంత కాదనుకున్నా మనం చేసేది ఇతరులకు నచ్చిందో లేదో అన్న ఉత్సుకత లోపల ఎక్కడో ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ తోనే డైలాగ్స్ మరిచిపోకుండా యాక్టింగ్ సింక్ చేసుకుంటూ అందరి ఫీలింగ్స్ చూడసాగాను.
నా ఎదురుగా ఉన్న వారి ఫీలింగ్స్ లో ఏ మార్పూ లేదు. బాగుందా బాగాలేదా అన్న విషయం ఏ మాత్రం వారి పేస్ లో కనపడ్డం లేదు.
అయినా నిరుత్సాహపడకుండా తడబాటు లేకుండా చాలా కేర్ ఫుల్ గా చేస్తూ పోతున్నాను. మొత్తం మీద 15 నిముషాలలో నా ప్రోగ్రాం ముగిసింది…
నా డైలాగ్స్ కి మా జూనియర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి చప్పట్లు కొట్టారు. వారు నాపై అభిమానంతో కొట్టారో లేక నా యాక్టింగ్ నిజంగా నచ్చి కొట్టారో అర్థం కాలేదు అయినా మొదట వచ్చిన ప్రశంసలు కావడంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఇక ఆంటీ వైపు చూడాలంటే ఎందుకో కాస్త గిల్టీగా అనిపించింది. నా యాక్టింగ్ బాగాలేకపొతే పాపం ఇంత కష్టపడ్డ ఆంటీకి ఏ సమాధానం చెప్పాలో ఎంత ఆలోచించినా నా మైండ్ కి తట్టలేదు.
అలాగే జడ్జీలుగా ఉన్నవారి వైపు చూడ్డానికి కూడా ధైర్యం చాలలేదు.
ఇక అక్కడ ఉండడం కష్టం అనిపించి నేరుగా పక్కనే ఉన్న రూమ్ లోనికి వెళ్లాను.
రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్ లా అక్కడే కూర్చుని వెయిట్ చేయడం స్టార్ట్ చేశాను.
ఇంతలో ప్రదీపన్న రూమ్ లోనికి వచ్చాడు.

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY